Daily Current Affairs in Telugu -09-11-2019:
Daily Current Affairs in Telugu -07-11-2019
అయోధ్య రామ మందిర నిర్మాణం పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు:
అయోధ్య లోని రామ జన్మ భూమి, బాబ్రి మసీద్ భూ యాజమాన్య వివాదం పై సుప్రీం కోర్టు నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది.జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్జే, జస్టిస్ డివై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ లతో కూడిన ఐదుగురు ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తీర్పు లోని ముఖ్య అంశాలు:
- అయోధ్య లోని వివాదస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిరం కోసం అప్పగించాలి.
- కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చెయ్యాలి.ఆలయ నిర్మాణ బాధ్యత ఆ ట్రస్టు కు ఇవ్వాలి.
- సున్ని వక్స్ బోర్డ్ కు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని కేటాయించాలి.
- మసీదు నిర్మాణానానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సున్ని వక్స్ బోర్డు కు పూర్తీ స్వేచ్చ ఉంటుంది.
- 1992 లో జరిగిన బాబ్రి మసీదు కూల్చివెత చట్ట విరుద్దం.
క్విక్ రివ్యు :
ఏమిటి : అయోధ్య రామ మందిర నిర్మాణం పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
ఎపుడు: నవంబర్,09 2019
ఎవరు : .సుప్రీం కోర్టు
ఎక్కడ: డిల్లి
ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం :
రాష్ట్రంలోని ప్రభుత్వ పాటశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ౧వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాద్యమంను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. నవంబర్,9న సీనియర్ అధికారులతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం
ఎపుడు: నవంబర్,09 2019
ఎవరు : .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణకు 6వ స్థానం, ఎపి కి 4వ స్థానం:
పంట నష్టాలు,ఏటేటా పెట్టుబడులు పెరగటం, గిట్టుబాటు ధరలు లేకపోడడం అప్పులు ఇలా కారణాలు ఏమైనా అన్నదాత బలవన్మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో(4) స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నది.2016 లో ప్రమాద మరణాలు – ఆత్మహత్యలకు సంబంధించిన జాతీయ నేర గణాంక సంస్థ (ఎస్సిఆర్బి)తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు: 11,379. ఇందులో ఎపికి చెందిన వారు 7.06 శాతం, తెలంగాణ చెందిన వారు 5.66 శాతం ఉన్నారు. ఏపిలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 730 మంది మహిళలు ఉండగా, తెలంగాణాలో ఆ సంఖ్య 572, 73 మంది ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణకు 6వ స్థానం, ఎపి కి 4వ స్థానం
ఎపుడు: నవంబర్,09 2019
ఎవరు : ఎస్సిఆర్బి
ఎక్కడ: డిల్లి
టోక్యో ఒలంపిక్స్ కు చింకి యాదవ్ ఆర్హత సాధించింది:
భారత షూటర్ చింకి యాదవ్ 2020 ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల చింకి యాదవ్ ఫైనల్ కు చేరడంతో ఒలంపిక్స్ లో అర్హత సాధించింది. నవంబర్ 8న జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ లో చింకి యాదవ్ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సాధించింది.
టోక్యో ఒలంపిక్స్ -2020 కు అర్హత సాధించిన భారత షూటర్లు:
- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ -2(ఇద్దరు) ; అపుర్వి చండేలా. అంజుం మౌద్గిల్
- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ -2(ఇద్దరు): అభిషేక్ వర్మ, సౌరబ్ చౌదరి
- పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ -2(ఇద్దరు) : దీపక్ కుమార్, దిశ్వాంగ్ పన్వర్
- పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీపొజిషన్ -1(ఒకరు) : సంజీవ్ రాజ్ పుత్
- మహిళల25 మీటర్ల ఎయిర్ పిస్టల్ -2(ఇద్దరు): చింకి యాదవ్, రాహి సర్నోబత్
- మహిళల10 మీటర్ల ఎయిర్ పిస్టల్ -2(ఇద్దరు): యశస్విని సింగ్, మను భాకర్
క్విక్ రివ్యు :
ఏమిటి : టోక్యో ఒలంపిక్స్ కు చింకి యాదవ్ ఆర్హత సాధించింది:
ఎపుడు: నవంబర్,09 2019
ఎవరు : చింకి యాదవ్
ఎక్కడ: దోహా,ఖతర్
షూటర్ తేజస్వినికి ఒలంపిక్ బెర్త్:
బారత వెటరన్ షూటర్ తేజస్విని సావంత్ భారత్ కు మరో ఒలంపిక్ బెర్తు సాధించిపెట్టింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ట్రిపోజిషన్ లో పతకం గెలవకపోయినా ఫైనల్ చేరడం ద్వారా తేజస్విని ఒలంపిక్ కోటా స్థానాన్ని ఖరారు చేసింది. నవంబర్ 9న క్వాలిఫయింగ్ లో 1171 పాయింట్లు సాధించింది ఫైనల్ కు వెళ్ళినతేజస్విని తుది సమరంలో 435.8 పాయింట్లుతో నాలుగో స్థానంలో నిలిచింది. షూటింగ్ లో భారత్ కు ఇది 12వ ఒలంపిక్ బెర్తు, కాజల్, గాయత్రి తోడుగా తేజస్విని 50 మీటర్ల రైఫిల్ త్రిపొజిషన్ టిమ్ కాంస్యన్ని గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : షూటర్ తేజస్వినికి ఒలంపిక్ బెర్త్
ఎపుడు: నవంబర్,09 2019
ఎవరు : తేజస్విని సావంత్
ఎక్కడ: దోహా,ఖతర్
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |