Daily Current Affairs in Telugu 03-03-2020
టర్కీలో భారత రాయబారిగా సంజయ్ కుమార్ నియామకం:

టర్కీలో భారత రాయబారిగా సీనియర్ దౌత్య దికరిగా సంజయ్ కుమార్ పాండా ని నియమించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మార్చ్ 03న వెల్లదించింది. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కి చెందిన పాండా ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కో లో భారత కాన్సులేట్ జనరల్ గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టర్కీలో భారత రాయబారిగా సంజయ్ కుమార్ నియామకం
ఎక్కడ: టర్కీ
ఎవరు: సంజయ్ కుమార్
ఎప్పుడు:మార్చ్ 03
ఐఐసి టెస్టు ర్యాంకింగ్స్ లో టీం ఇండియా కు మొదటి స్థానం:

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో 0-2 తో చిత్తు గా ఓడినప్ప్పటికి ఐసిసి ర్యాంకింగ్స్ లో టీంఇండియా మొదటి స్థానంను దక్కించుకుంది. టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం ను భరత్ నిలబెట్టుకుంది .అయితే తర్వాతి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు భారత్ కు మద్య అంతరం మాత్రం బాగా తగ్గింది.భారత్ 116 పాయింట్లతో అగ్ర స్థానంలో కోసగుతుండగా న్యూజిలాండ్ 110 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానంలో ఇంగ్లాండ్ 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.కివీస్ సిరీస్ లో ఘోరంగా విపమైన విరాట్ కోహ్లి (4ఇన్నింగ్స్ లో 38పరుగులు )ర్యాంకులో ను మార్పు లేదు.అతను రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.అగ్ర స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ (911) కు విరాట్ కు మద్య అంతరం పెరిగింది. లబుశేన్ (827 ),విలియంసన్ (813) వరుసగా మూడు ,నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి బుమ్రా (07)ఒక్కడే టాప్ -10లో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఐసి టెస్టు ర్యాంకింగ్స్ లో టీం ఇండియా కు మొదటి స్థానం
ఎక్కడ:దుబాయి
ఎవరు:టీం ఇండియా
ఎప్పుడు:మార్చ్ 03
జమ్మూ చారిత్రాత్మక నగర కోఒదలి పేరును భారత్ మాతా చౌక్ గా మార్పు:

పాత జమ్మూ లోని వాణిజ్య కేంద్రమైన చారిత్రాత్మక సిటీ చౌక్ ను భారతీయ జనతా పార్టీ (బిజేపి)నేతృత్వంలో నిజమ్ము కాశ్మీర్ మున్స్సిపల్ కార్పోరేషన్ (జేఎంసి) జనరల్ హౌస్ తీర్మానించిన ఆమోదించిన తరువాత భారత్ మాతా చౌక్ “ గా పేరు మార్చారు.అధికారులు తెలిపారు.చౌక్ పేరు మార్చడం వలన ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది.వారిలో ఎక్కువ మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జమ్మూ చారిత్రాత్మక నగర కోఒదలి పేరును భారత్ మాతా చౌక్ గా మార్పు
ఎక్కడ:జమ్మ్ము కాశ్మీర్
ఎప్పుడు:మార్చ్ 03
బెంగళూర్ లో జరగనున్న 19 వ ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020 సమావేశం :

బవిష్యత్ ఉత్పాదకత మరియు వృద్దిని రూపొందించే ఆవిష్కరణ మరియు ప్రపంచ స్థాయి పద్దతుల పై ప్రపంచం లోనే అతి పెద్ద సమావేశం 45 సంవత్సరాల తరువాత భారత దేశంలోకి తిరిగి వచ్చింది. ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ (డబ్ల్యు పి) యొక్క 19 వ ఎడిషన్ 2020 మే 6 నుండి మే 8వరకు బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎగ్సిబిషణ్ సెంటర్ లో జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బెంగళూర్ లో జరగనున్న 19 వ ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020 సమావేశం
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు:మార్చ్ 03
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
భారత జీడిపి అంచనా వృద్ది రేటు 4.9 శాతం:ఫీచ్

భారత జిడిపి వృద్ది రేటు 2019 -20ఆర్ధిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చు అన్న గత అంచనాలను 4.9 శాతానికి తగిస్తున్నట్లు ఫీచ్ సొల్యుషన్ మార్చి 2న ప్రకటించింది.2020-21 ఆర్ధిక సంవత్సరంలో జీడిపి వృద్ది అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిసింది.దేశీయంగా డిమాండ్ బలహనంగా ఉండడం మరియు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సరఫరా పరంగా అడ్డంకు లతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు ఫిచ్ పేర్కొంది.మరియు కోవిద్ 19 (కరోనా వైరస్ ) రిస్క్ కారణంగా 2020-21 ఆర్హ్తిక సంవత్సరంలో భారత వృద్ది అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈపిడి)తెలిపింది.గతంలో ఇది 6.2శాతంగా ఉంటుందని అంచనా వేసింది.ఆర్ధిక మార్కెట్లు ,పర్యాటక రంగం,సరఫరా వ్యవ్స్తఃలో సమస్యలు మొదలైన అంశాల వల్ల జి-20 దేశాల వృద్ది రేటు మందగించవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత జీడిపి అంచనా వృద్ది రేటు 4.9 శాతం:ఫీచ్
ఎవరు: ఫీచ్ రేటింగ్స్ సంస్థ
ఎప్పుడు:మార్చ్ 03
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |