Daily Current Affairs in Telugu 05-06-2020
పేదలకు ఉచిత ఇంటర్నెట్ అందించే మొదటి రాష్ట్రం గా నిలిచిన రాష్ట్రం గా కేరళా :
కేరళాలో నివసిస్తున్న దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పౌరులందరికీ కేరళా ప్రభుత్వం తన ప్రతిస్తాత్మక బ్రాడ్ బాండ్ ప్రాజెక్ట్ ను కేరళా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (కే.ఫోన్) ప్రాజెక్ట్ అని ప్రకటించింది. వారికీ ఉచిత హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అందించే మొదటి రాష్ట్రము గా కేరళా ఉంది .ఈ ప్రాజెక్టు కు అయ్యే వ్యయం ను 1500 కోట్ల రూపాయలుగా అంచనా వేసారు.ఈ ప్రాజెక్ట్ 2020 డిసెంబర్ నుండి ప్రారంబమవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిట్: పేదలకు ఉచిత ఇంటర్నెట్ అందించే మొదటి రాష్ట్రం గా నిలిచిన రాష్ట్రం గా కేరళా
ఎవరు: కేరళా ప్రభుత్వం
ఎక్కడ: కేరళా
ఎప్పుడు: జూన్ 05
ప్రపంచ ఉత్తమ వ్యాపార వేత్త గా ఈవై అవార్డుకు ఎంపికైన కిరణ్ మజుందార్ షా :
బయోకాన్ ఎగ్సిక్యుటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా కు ప్రతిష్టాత్మక ఈవై ప్రపంచ ఉత్తమ వ్యాపారవేత్త (వరల్డ్ ఎంతర్ప్రేన్యుర్ )అవార్డు వరించింది. ప్రస్తుత సంవత్సరానికి 2020గాను 41 దేశాల్లో ఎంటర్ ప్రేన్యుర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన 46 మంది నుంచి మజుందార్ షా కు ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు.ఈ అవార్డును అందుకుంటున్న మూడో భారతీయురాలు కిరణ్ మజుందార్ షా కావడం గమనార్హం .ఇంతకు ముందు కోటక్ మహింద్రా బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్ ,ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూడా ఈ గౌరవాన్ని పొందారు. ఈ ప్రతిస్తాత్మక ఈవై వరల్డ్ ఎంటర్ ప్రేన్యుర్ ఆఫ్ ది ఇయర్ -2020 అవార్డును పొందటాన్ని గౌరవంగా భావిస్తున్నాను అని కిరణ్ మజుందార్ షా గారు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిట్: ప్రపంచ ఉత్తమ వ్యాపార వేత్త గా ఈవై అవార్డుకు ఎంపికైన కిరణ్ మజుందార్ షా
ఎవరు: కిరణ్ మజుందార్ షా
ఎప్పుడు: జూన్ 05
డబ్యు.టి.వో లో నూతన రాయబారిగా నియమితులయిన బ్రజేంద్ర నవనీత్ :
ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యు.టి.వో కు భారత కొత్త రాయబారిగా బ్రజేంద్ర నవనీత్ ను ఎన్.డియూ నియమించింది. జెనివాలో డబ్ల్యు.టి.వో కు శాశ్వత మిషన్ ఆఫ్ ఇండియా( పి.ఎం.ఐ) లో అయన పి.ఎం.ఐ లో జే.ఎస్ దీపక్ స్థానంలో ఉంటారు. జెనివా లో ని డబ్యు.టి.వో లకు పి.ఎం.ఐ వద్ద కౌన్సిలర్ పదవికి అన్వర్ హుస్సేన్ షేక్ నియమాకనికి కేబినేట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిట్: డబ్యు.టి.వో లో నూతన రాయబారిగా నియమితులయిన బ్రజేంద్ర నవనీత్
ఎవరు: బ్రజేంద్ర నవనీత్
ఎక్కడ: డబ్యు.టి.వో
ఎప్పుడు: జూన్ 05
భారత్ లో జరగనున్న మహిళల ఆసియా కప్ పుట్ బాల్ టోర్నమెంట్ :
భారత్ వేదికగా 2022 లో ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ పుట్ బాల్ టోర్నమెంట్ జరగనుంది.1979 తర్వాత మన దేశంలో ఈ చాంపియన్ షిప్ ను నిర్వహించడం ఇదే తొలిసారి.భారత్ కు ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు ఇస్తున్నట్లు ఏఎఫ్ సి మహిళల పుట్ బాల్ కమిటీ నిర్ణయించింది అని అఖిల భారత పుట్ బాల్ సమాఖ్య తెలిపింది. 2022 ద్వితీయార్థం లో జరిగే అవకాశం ఉన్న ఈ చాంపియన్ షిప్ లో 12 జట్లు పోటీ పడబోతున్నాయి. గత టోర్నీలో ఎనిమిది జేట్లే ఆడాయి.ఆతిథ్య హోదాలో భారత్ నేరుగా పాల్గొనబోతుంది. 2023 ఫిఫా ప్రపంచ కప్ కు ఈ చాంపియన్ షిప్ ను అర్హత టోర్నీ గా పరిగనించనున్నారు. స్వదేశంలో 1979 లో జరిగిన ఆసియా కప్ లో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిట్: భారత్ లో జరగనున్న మహిళల ఆసియా కప్ పుట్ బాల్ టోర్నమెంట్
ఎక్కడ: భారత్ లో
ఎప్పుడు:జూన్ 05
ప్రపంచ చాంపియన్ అయిన సల్వా ఈద్ నాసర్ పై నిషేదం :
అథ్లెటిక్స్ లో సంచలనం అయిన మరియు ప్రపంచ చాంపియన్ అయిన సల్వా ఈద్ నాసర్ నిదేధం విధించబడింది.400 మీటర్ల అట్లేతిక్స్ లో ప్రపంచ చాంపియన్ బహ్రెయిన్ దేసస్తురాలు అయిన సల్వా ఈద్ నాసర్ పై డోపింగ్ నిషేధం పడింది.పోటీలో పాల్గొన కుండా ఆమెను తాత్కాలికంగా క్రీడల నుంచి నిషేధిస్తున్నట్లు అథ్లెటిక్స్ సమగ్రత విభాగం వెల్లడించింది. డొప్ పరీక్షకు సల్వా ఈద్ నాసర్ హాజరు కాకపోవడం తో ఈ శిక్ష పడింది.
క్విక్ రివ్యు :
ఏమిట్: ప్రపంచ చాంపియన్ అయిన సల్వా ఈద్ నాసర్ పై నిషేదం
ఎవరు: సల్వా ఈద్ నాసర్
ఎక్కడ: బహ్రెయిన్
ఎప్పుడు: జూన్ 05
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |