Daily Current Affairs in Telugu 01-06-2020
తూర్పు నావికాదళ కార్యాలయ ఐ.ఎం.ఎస్ గా కమాండర్ సర్కార్ గోకలే బాద్యతలు :
తూర్పు నావికాదళం (ఈఎన్.సి) ప్రధాన కార్యాలయం అయిన ఐ.ఎన్.ఎస్ సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్ గా రాహుల్ వికాస్ గోఖలే మే 30 న పదవి భాద్యతలు స్వీకరించారు. దీంతో సాంప్రదాయ ఫుల్లింగ్ అవుట్ వేడుక ద్వారా ప్రస్తుత కమాండర్ కే.ఎ బోపన్న కు ఐ.ఎం.ఎస్ సర్కార్ అధికారులు మరియు నేవీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈయన 1992 జనవరి 1వ తేదిన భారత నావికా దళం లో చేరారు. ఐ.ఎ.ఎస్ ఖుక్రి ,ఐ.ఎన్.ఎస్ కోల్కతా లో నావిగేషన్ అండ్ డైరెక్షన్ స్పెషలిస్ట్ గా పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : తూర్పు నావికాదళ కార్యాలయ ఐ.ఎం.ఎస్ గా కమాండర్ సర్కార్ గోకలే బాద్యతలు
ఎక్కడ: న్యుడిల్లి
ఎవరు: రాహుల్ సర్కార్ గోఖలే
ఎప్పుడు: మే 01
టెన్నిస్ క్రీడాకారులకు ఐ.టి.ఎఫ్ ఆర్ధిక సాయం :
కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో సింగిల్స్ ,డబుల్స్ విభాగాలలో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐ.టి.ఎఫ్)ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్య ల ద్వారా అర్హులైన ఆటగాళ్ళకు ఈ సహాయనిధిని అందిస్తారని తెలిపింది. సింగిల్స్ లో 500-700 మద్య డబుల్స్ లో 175-300 మద్య ర్యాంకు ఉన్న ఆటగాళ్ళను అర్హులుగా పేర్కొంది. అర్హులైన క్రీడాకారులుకు ఒక్కొకోరికి 2000 డాలర్లు ఆర్ధిక సహాయం లబించవచ్చని వివరించింది. ఈ తాజా నిర్ణయం ద్వారా 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : టెన్నిస్ క్రీడాకారులకు ఐ.టి.ఎఫ్ ఆర్ధిక సాయం
ఎవరు: ఐ.టి.ఎఫ్
ఎప్పుడు: మే01
కొత్త మ్యాప్ పై పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిన నేపాల్ :
భారత్ తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకు వెళుతుంది. భారత భూబాగాలను తమ దేశంలోనివి అని చూపిస్తూ రోపొంధించిన కొత్త మ్యాప్ కు సంబందించిన రాజ్యాంగ సవరణ బిలును మే 31న పార్లమెంట్ ల ప్రవేశపెట్టింది. నేపాల్ ఓ ప్రదాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిలును మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తరవాత న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును ప్రవేశ పెట్టారు. భారత్ భూభాగానికి చెందిన లిపులేక్ ,కాలాపానీ ,లింపియాదురాను వ్యూహాత్మకంగా తమ దేశ భుబాగాలు గా పేర్కొంటూ సవరించిన మ్యాప్ లను నేపాల్ విడుదల చేసింది. ఈ మ్యాప్ కు చట్ట బద్దత రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగంలోని షెడ్యుల్ 3లో కొత్త సరిహద్దు లతో కూడిన మ్యాప్ చేర్చాలని ప్రదాని కే.పి శర్మ ఒలి రాజ్యాంగ సవరణ లను తీసుకువచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కొత్త మ్యాప్ పై పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిన నేపాల్
ఎక్కడ: నేపాల్
ఎవరు: కే.పి శర్మ ఒలి
ఎప్పుడు: మే01
బాలివుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోన వైరస్ తో కన్నుమూత :
బాలివుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిత్ వాజిద్ లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఇక లేరు. 42ఏళ్ల వాజిద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. అయితే కొంతకాలంగా గుండె ,కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వాజిద్ ఇబ్బంది పడుతున్నారు. ముంబై లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలివుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో మంచి సంగీతాన్ని ఇచ్చి బాలివుడ్ సినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ సంగీత దర్శకుల జాబితాలో ఈయన చోటు సంపాదించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాలివుడ్ సంగీత దర్శకుడు వాజిద్ కరోన వైరస్ తో కన్నుమూత
ఎక్కడ: ముంబై
ఎవరు: వాజిద్
ఎప్పుడు: మే01
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |