Daily Current Affairs in Telugu 29-05-2020

Manavidya daly current affairs in Telugu

Daily Current Affairs in Telugu 29-05-2020

rrb ntpc online exams in telugu

విప్రో సియివో మరియు యం.డిగా దేయరి డెలాపోర్ట్ నియామకం :

ఐటి దిగ్గజం విప్రో కు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సియివో) ,మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ధేయరి  డేలాపోర్ట్  నియతులయ్యారు. జులై 06 2020 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని కంపెని మే29 వెల్లడించింది. ఈ ఏడాది కంపెని నుంచి వైదొలగినట్లు జనవరి లో నే ప్రకటించిన అభిదాభి జడ్ నీమచ్ వాలా స్థానం లో దేలాపోర్ట్ బాద్యతలు చేపట్టనున్నారు. జూన్ 1 న నీమచ్ వాలా స్వచ్చందంగా వైదొలగనున్నారు. అయితే జులై 5 రోజువారీ కార్యాలపాలు రిశాద్ ప్రేంజి నిర్వహించ నున్నట్లు విప్రో ఒక ప్రకటన లో పేర్కొంది. క్యాప్ జెమిని గ్రూప్ లో చాలా కాలం  పని చేసిన ధేయరి జులై 06వ తేదిన భాద్యతలు స్వీకరించనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : విప్రో సియివో మరియు యం.డి గా దేయరి డెలాపోర్ట్ నియామకం

ఎవరు: దేయరి డెలాపోర్ట్

ఎప్పుడు: మే 29

ఎన్.టి.పి.సి సౌత్ రీజియన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా సి.వి ఆనంద్ నియామకం :

ఎన్టీపిసి దక్షిణ ప్రాంత ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా సి.వి  ఆనంద్ గారు నియమితులయ్యారు. ఎన్టిపిసి  దక్షిణ ప్రాంత కార్యాలయం హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటివల వరకు ముంబై లో ఎన్టీ పిసి పశ్చిమ ప్రాంతం -1 ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా బాద్యతలు నిర్వర్తించిన సి.వి ఆనంద్ హైదరాబాద్ కు బదిలి అయ్యారు. ఆయన తిరుపతి లోని ఎస్వి విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని 1983 లో ట్రైనీ ఇంజనీర్ గా ఎన్టీపిసి లో చేరారు. గత మూడున్నర దశాబ్దాల కాలం లో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించాలని ఎన్టీపీసీ  ఒక ప్రకటనలో తెలిపింది. గతం లో రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ,విశాఖ లోని సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెయినేన్స్ విభాగాల్లో  కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎన్.టి.పి.సి సౌత్ రీజియన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా సి.వి ఆనంద్ నియామకం

ఎవరు: సి.వి ఆనంద్

ఎప్పుడు: మే 29

అథ్లెట్ కిరణ్ జీత్ పై నాలుగేళ్ల నిషేధం విధించిన వాడా :

అథ్లెట్ కిరణ్ జీత్ కౌర్ పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అయిన వాడా వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఆమె పై నాలుగేళ్ల నిషేధం విధిందింది. నిరుడు డిసెంబర్ 15 న కోల్ కతా లో జరిగన టాటా స్టీల్ 25 కిలోమీటర్ల పరుగులో కిరణ్ జీత్ విజేతగా నిలిచింది. ఓవరాల్ గా 11వ స్థానం లో నిలిచిన ఆమె భారత క్రీడాకారుల్లో ప్రథమ స్థానం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 న కిరణ్ జీత్ నమూనాల్ని సేకరించారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో ఆమె పై వాడా చర్యలు తీసుకుంది. 2019 డిసెంబర్ 15 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని వాడా పేర్కొంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : అథ్లెట్ కిరణ్ జీత్ పై నాలుగేళ్ల నిషేధం విధించిన వాడా

ఎవరు: వాడా

ఎప్పుడు: మే 29

కేరళా లో మొట్ట మొదటి మహిళా డిజిపి గా బాధ్యతలు చేపట్టిన ఆర్.శ్రీలేఖ:

కేరళా లో తొలి మహిళా ఐపిఎస్ అధికారిగా ఉన్న ఆర్.శ్రీలేఖ గారు మే28 న ఫైర్ అండ్ రేస్క్యు సర్వీసెస్ కొత్త అధిపతి గా భాద్యతలు స్వీకరిచిన తరువాత కేరళా పోలీసులకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఆదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా విభాగానికి అధిపతి గా ఉన్నారు. 1998 బ్యాచ్ ఐపిఎస్అధికారి  శ్రీలేఖ 1991 లో కేరళా లో మొదటి మహిళా పోలీస్ సుపరిండేంట్ అయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కేరళా లో మొట్ట మొదటి మహిళా డిజిపి గా బాధ్యతలు చేపట్టిన ఆర్.శ్రీలేఖ

ఎవరు: ఆర్.శ్రీలేఖ

ఎక్కడ: కేరళా

ఎప్పుడు: మే 29

ఛత్తీస్ గడ్ యొక్క ప్రథమ ముఖ్యమంత్రి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి కన్నుమూత :

ఛత్తీస్ గడ్ ప్రథమ ముఖ్య మంత్రి అయిన అజిత్ ప్రమోద్ కుమార్ జోగి (74)  మే 29 న కన్ను మూసారు. హృద్రోగం కారణంగా ఈ నెల 09 రాయ్ పూర్ లోని శ్రీ నారాయాణ ఆస్పత్రిలో చేరిన ఆయన గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారు. మద్యాహ్నం మరోసారి గుండెపోటు రావడం తో తుది శ్వాస విడిచారు. తొలుత ఐఏఎస్ అధికారిగా పని చేసిన ఆయన రాజకీయాల్లో చేరి ప్రజా నాయకునిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టిలో కీలక నేతగా గుర్తింపు పొందారు. 2000సంవత్సరం లో ఛత్తీస్గడ్  రాష్ట్రము ఏర్పాటు కాగాఈయన  ప్రథమ ముఖ్యమంత్రిగా నియమితులయి 2003వరకు కొనసాగారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఛత్తీస్ గడ్ యొక్క ప్రథమ ముఖ్యమంత్రి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి కన్నుమూత

ఎవరు: అజిత్ ప్రమోద్ కుమార్ జోగి

ఎక్కడ: ఛత్తీస్ గడ్

ఎప్పుడు: మే 29

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *