Daily Current Affairs in Telugu 12-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 12-06-2020

rrb ntpc online exams in telugu

తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బిశ్వజిత్ దాస్ గుప్తా నియామకం :

తూర్పు నౌకా దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా నియమితులయినట్టు జూన్ 11 న నేవీ వర్గాలు తెలిపాయి.ఇప్పటి వరకు ఆ స్థానం లో కొనసాగిన వైస్ అడ్మిరల్ ఎస్ ఎన్ ఘోర్మడే రక్షణ మంత్రిత్వ శాఖ సమీకృత కార్యాలయంలో వ్యక్తి గత సేవల నియంత్రన విభాగానికి బదిలీ పై వెళ్ళినట్లు పేర్కొన్నాయి. బిశ్వజిత్ దాస్ గుప్తా 1985 లో భారత నౌకాదళం లో చేరి నావిగేషన్ అండ్ డైరెక్షన్  విభాగం లో ఐ.ఎన.ఎస్ నిశాంక్ కార్ముఖ్ తబార్ నౌకల్లో కీలక భాద్యతలు చేపట్టారని స్పష్టం చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బిశ్వజిత్ దాస్ గుప్తా నియామకం

ఎవరు: బిశ్వజిత్ దాస్ గుప్తా

ఎక్కడ: న్యుదిల్లి

ఎప్పుడు: జూన్ 12

అమెరికాలో భారత కాన్సుల్ జనరల్ అధికారి గా తెలుగు అధికారి నియామకం :

విదేశాంగ శాఖలో పని చేస్తున్న తెలుగు అధికారి అమెరికాలో భారతః కాన్సుల్ జనరల్ అధికారిగా నియమించబడ్డారు. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా గల్ఫ్ దేశాల బాద్యతలు నిర్వహిస్తున్న టి.వి నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కో  ఓ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా  గా నియమితులయ్యారు. ఈ నెలాఖరులో భారత కాన్సుల్ జనరల్ గా బాద్యతలు చేపట్టనున్నారు. 1993 ఓ ఇండియా లో ఫారిన్ సర్వీసులో చేరి అనేక దేశాల్లో సేవలందించారు. హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం లో బి.ఎస్సి  భారత వ్యవసాయ పరిశోదక కేంద్రంలో ఎంఎస్సి చేసిన ఈయన రెండింటిలో నూ బంగారు పతకాలు సాధించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అమెరికాలో భారత కాన్సుల్ జనరల్ అధికారి గా తెలుగు అధికారి నియామకం

ఎవరు: టి.వి నాగేంద్ర ప్రసాద్

ఎక్కడ: శాన్ ఫ్రాన్సిస్కో 

ఎప్పుడు: జూన్ 12

ప్రతిస్తాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను దక్కించుకున్న భారత అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్ :

ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్ (75) ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ఫ్రిజ్ వరించింది.2020సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతి కి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ఫ్రిజ్ తెలిపింది.రతన్ లాల్ కు 50ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణ కు 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు.200 కోట్ల ప్రజలకు ఆహార బద్రత కల్పించారు.వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణ మండల పర్యావరణ వ్యవస్థలకు  కాపాడారు.అని వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రతిస్తాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను దక్కించుకున్న భారత అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్

ఎవరు: రతన్ లాల్

ఎప్పుడు: జూన్ 12

దేశంలో అత్యుత్తమ విధ్యాసంస్థ లలో ఒకటిగా నిలిచిన  ఐఐటి మద్రాస్ :

దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి  లు మరోసారి సత్తా చాటాయి.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా (ఎంహెచ్ఆర్డి) జూన్ 11న ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్ టాప్ -10 విద్యా సంస్థల్లో ఏకంగా 7ఐఐటి లు చోటు సాధించగా 2వ ర్యాంకు ను బెంగళూర్ ఐఐఎస్సి  సాధింధించి.టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ,రీసర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ,గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్ ,ఔట్ రీచ్ అండ్ ఇంక్లుజివిటి  ,పి ఆర్ పరసెప్షన్  కేటగిరీలలో విద్యాసంస్థల పని తీరును కేంద్రం పరిశీలించి  100 పాయింట్లు స్కోర్ ప్రామాణికంగా ర్యాంకు లను కేటాయించింది.ఓవరాల్ యునివర్సిటీ  ,ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్  ఫార్మసి ,కాలేజ్ ,మెడికల్ ,లా ,ఆర్కిటెక్చర్ ,ద్నేతల్ విభాగాలలో  అత్యుత్తమా విద్యా సంస్థలను ప్రకటించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలో అత్యుత్తమ విధ్యాసంస్థ లలో ఒకటిగా నిలిచిన  ఐఐటి మద్రాస్

ఎవరు: ఐఐటి మద్రాస్

ఎప్పుడు: జూన్ 12

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *