Daily Current Affairs in Telugu 11-08-2021

Daily Current Affairs in Telugu 11-08-2021

ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ లో రికార్డు నెలకొల్పిన భారత క్రీడాకారులు :

ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ భారత క్రీడాకారులు రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. క్యాడెట్ కాంపౌండ్ బాలికల టీమ్ ర్యాంకింగ్ విభాగంలో ప్రియా గుజ్జర్, పర్త్ కౌర్, రిధు వర్షిణి లతో కూడిన భారత జట్టు 2067/2160 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో అమెరికా (2045/2160) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ర్యాంకింగ్ ఈవెంట్ లో  ప్రియా గుజ్జర్,కుశాల్ దలాల్ జోడీ’ (1401) కొత్త రికార్డు నెలకొల్పింది.2019లో నటాషా పులరన్ (నెదర్లాండ్స్. 1387) నెలకొల్పిన రికార్డును అధిగమించింది. అండర్-18 కాంపౌండ్ జట్టు రెండో స్థానంలో నిలవగా,బాలుర వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో కుశాల్ దలాల్ మూడో స్థానంలో నిలిచాడు. అండర్-21 పురుషుల రికర్వ్ జట్టు (1977 పాయింట్లు) రెండో స్థానం సాధించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ లో రికార్డు నెలకొల్పిన భారత క్రీడాకారులు

ఎవరు: భారత క్రీడాకారులు

ఎప్పుడు: ఆగస్ట్ 11

 ఆగస్ట్ 07ను ‘జాతీయ జావెలిన్ దినోత్సవం’గా జరుపుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య :

ఒలింపిక్స్లో ఆగస్టు 7న భారత్ కు  స్వర్ణం అందించడం ద్వారా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆ రోజును ఇక ‘జాతీయ జావెలిన్ దినోత్సవం’గా జరుపుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఎస్ఐ) నిర్ణయించింది. 87.58 మీటర్ల త్రోలో విజేతగా నిలిచిన 23 ఏళ్ల నీరజ్. చోప్రా ఒలింపిక్స్ లో  వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ‘దేశవ్యాప్తంగా యువతను జావెలిన్ త్రో వైపు ఆకర్షించడానికి ఆగస్టు 7ను మేము జాతీయ జావెలిన్ దినోత్సవంగా పాటిస్తాం అని వచ్చే ఏడాది నుంచి మా రాష్ట్ర సంఘాలు ఆ రోజున తమ తమ రాష్ట్రాల్లో జావెలిన్ పోటీలు నిర్వహిస్తాయి” అని ఏఎఫ్ఎస్ఐ ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ లలిత్ భానోత్ చెప్పాడు. ఆ తర్వాత  అండర్ డిస్ట్రిక్ట్ పోటీలు నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున జావెలిన్లు సరఫరా చేస్తాం. క్రమంగా పోటీల స్థాయిని పెంచుతాం” అని అథ్లెట్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా అతడు అన్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆగస్ట్ 07ను ‘జాతీయ జావెలిన్ దినోత్సవం’గా జరుపుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య

ఎవరు: భారత అథ్లెటిక్స్ సమాఖ్య

ఎప్పుడు: ఆగస్ట్ 11

వాన్ ధన్ వికాస్ యోజన పథకం కింద 7 జాతీయ అవార్డులను గెలుచుకున్న నాగాలాండ్ :

వాన్ ధన్ వికాస్ యోజన పథకం కింద నాగాలాండ్ 7 జాతీయ అవార్డులను గెలుచుకుంది ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED) యొక్క 34 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2020-21 మొదటి వాన్ ధన్ వార్షిక పురస్కారాలలో నాగాలాండ్ ను ఏడు జాతీయ అవార్డులతో సత్కరించింది. ఈ అవార్డులను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా జూమ్ వెబ్‌నార్ ద్వారా అందజేశారు.. వాటిలో మొదటి స్థానాలు ‘ఉత్తమ సర్వే రాష్ట్రం’, ‘ఉత్తమ శిక్షణ’ మరియు ‘అత్యధిక సంఖ్యలో VDVKC లు స్థాపించబడ్డ౦దుకు గాను ’. ఇది ‘బెస్ట్ సేల్స్ జనరేటెడ్’ మరియు ‘బెస్ట్ ఇన్నోవేషన్ & క్రియేటివిటీ’కి 3 వ స్థానాన్ని సాధించింది. గూస్‌బెర్రీ వైన్ (సరఫరాదారు: టోకా మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్) వంటి వస్తువుల కోసం వినూత్న & సృజనాత్మక ఉత్పత్తి ఆలోచనల కోసం రాష్ట్రం అవార్డులను కూడా అందుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: వాన్ ధన్ వికాస్ యోజన పథకం కింద 7 జాతీయ అవార్డులను గెలుచుకున్న నాగాలాండ్

ఎవరు: నాగాలాండ్

ఎప్పుడు: ఆగస్ట్ 11

న్యూ గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లో 122 వ స్థానంలో భారత్  :

న్యూ గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్” లో భారతదేశం 122 వ స్థానంలో ఉంది. లండన్‌లోని కామన్వెల్త్ సచివాలయం విడుదల చేసిన 181 దేశాల్లోని యువకుల పరిస్థితిని కొలిచే నూతన గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2020 లో భారతదేశం 122 వ స్థానంలో నిలిచింది.. స్లోవేనియా, నార్వే, మాల్టా మరియు డెన్మార్క్ దేశాల  తర్వాత సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు నైజర్ దేశాలు వరుసగా చివరి స్థానంలో ఉన్నాయి. యువత అభివృద్ధి యొక్క త్రైమాసిక ర్యాంకింగ్‌లు 2010 మరియు 2018 మధ్య అఫ్ఘనిస్తాన్ మరియు రష్యాతో పాటుగా సూచికలో మొదటి ఐదు స్థానాలలో నిలిచాయి, విద్య మరియు ఉపాధి వంటి రంగాలలో వారి స్కోరు సగటున 15.74 శాతం పెరిగింది

క్విక్ రివ్యు :

ఏమిటి: న్యూ గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లో 122 వ స్థానంలో భారత్

ఎప్పుడు: ఆగస్ట్ 11

బ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్ సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి :

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్ సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి  ఆగస్ట్ 10 న ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ పార్టీ ఎంపీ సుధాంశు త్రివేది గారు ఎన్నికయ్యారు. కాగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశీపక్ శర్మ గారు   పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్ సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి

ఎవరు: ఎంపీ వి. విజయసాయిరెడ్డి

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 11

RRB Group D Practice test

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test

For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *