Daily Current Affairs in Telugu 30-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న ప్రముఖ ఒడియా రచయిత హృషికేష్ మల్లిక్ :
ప్రముఖ ఒడియా రచయిత హృషికేష్ మల్లిక్కు 2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన సారిజయతిబా ఒపేరా (ముగిసిన నాటిక) పుస్తకానికి డిసెంబర్30 న ఈ ఆవార్డు ప్రకటించారు. ఆంగ్లంలో ప్రముఖ రచయిత్రి నమిత గోఖలే (థింగ్స్ టు లీవ్ బిహెండ్ నవల), హిందీలో దయా ప్రకాశ్ సిన్హా, కన్నడంలో డి.ఎస్.నాగభూషణ తమిళంలో లంబాయ్ రచనలకు పురస్కారాలు ఇచ్చారు. బెంగాలీలో తృణ మూల్ ఎమ్మెల్యే బ్రత్య బసు రాసిన నాటకానికి అవార్డు లభించడం విశేషం. ఆంగ్లంలో సాహిత్య అకాడమీ యువ పురస్కారం మేఘా మంజుదార్కు లభించింది. ఆమె చేసిన తొలి రచనే ఈ ఘనత సాధించింది. బర్నింగ్ పేరుతో గత ఏడాదే ఆమె పుస్తకాన్ని ప్రచురించారు. భారత్ లో జన్మించిన ఆమె ప్రస్తుతం కాలిఫోర్నియోలో నివసిస్తున్నారు. ఆంగ్లంలో బాల సాహిత్య పురస్కారం అనిత వచ్చరణనికి ప్రకటించారు. అమృత షేర్ గిల్ రెజిల్ విత్ ‘ఎ ఫెయింట్ బ్రష్’ అన్న పుస్తకానికి అవార్డు లభించింది.
- ఓడిశా రాష్ట్ర రాజధాని :భువనేశ్వర్
- ఓడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి : నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ :గనేషి లాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న ప్రముఖ ఒడియా రచయిత హృషికేష్ మల్లిక్
ఎవరు : ఒడియా రచయిత హృషికేష్ మల్లిక్
ఎక్కడ:ఓడిశా
ఎప్పుడు:డిసెంబర్ 30
కేంద్ర సాహిత్య ఆకాడమీ పురస్కారం గెలుచుకున్న ప్రముఖ తెలంగాణా కవి గోరేటి వెంకన్న :
ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య ఆకాడమీ పురస్కారం వరించింది. అద్భుతమైన ప్రకృతి వర్ధనతో కూడిన 32 గేయ కవి తలతో ఆయన వెలువరించిన ‘వల్లంకి తాళం’ సంకలనానికి 2021కి గాను ఈ పురస్కారం దక్కింది. దేశ వ్యాప్తంగా 20 భాషల్లో వెలువడిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర సాహిత్య యువ, బాల పురస్కారాలను ప్రభ భించింది. కేంద్ర సాహిత్య పురస్కారం కింద రూ. లక్ష ను ,తామ్ర పత్రం బహూకరిస్తారు. యువ, బాల పురస్కారాలకు రూ.50 వేల నగదు, తామ్రపలకం. ప్రదానం చేస్తారు. తెలుగు భాష నుంచి గోరటి రాసిన వల్లంకి తాలం రచనకు గాను ఈ అవార్డు లబించింది.కాగా తగుల్ల గోపాల్ కు సాహిత్య అకాడమి యువ పురస్కారం మరియు దేవరాజు మహారాజు కు బాల సాహిత్య అవార్డు లబించింది.
- గోరేటి వెంకన్న ప్రముఖ కవి తెలంగాణా శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని:హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి:కేంద్ర సాహిత్య ఆకాడమీ పురస్కారం గెలుచుకున్న ప్రముఖ తెలంగాణా కవి గోరేటి వెంకన్న
ఎవరు : తెలంగాణా కవి గోరేటి వెంకన్న
ఎప్పుడు:డిసెంబర్ 30
ముగ్గురు ఇండో-కెనడియన్ ప్రముఖులకు దక్కిన కెనడా దేశ అత్యున్నత పౌర పురస్కారాలు :
ముగ్గురు ఇండో-కెనడియన్ ప్రముఖులకు ఆ దేశ అత్యు న్నత పౌర పురస్కారాల్లో ఒకటయిన ‘ఆర్డర్ ఆఫ్ కెనడా’అవార్డ్ వరించింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్, స్థిరాస్తి వ్యాపార మెఘల్గా పేరుపొందిన బాబ్ (నవజీత్) సింగ్ ధిల్లాన్, సుప్రసిద్ధ శిశు వైద్య నిపుణుడు డాక్టర్ ప్రదీప్ మర్చంట్లకు వీటిని బహూకరించను న్నారు. వీరితో పాటు మొత్తం 135 మందికి అ౦దజేయనున్నారు.
- కెనడా దేశ రాజధాని :ఒట్టావా
- కెనడా దేశ కరెన్సీ :కెనెడియన్ డాలర్
- కెనడా దేశ ప్రదానమంత్రి : జస్టిస్ ట్రూడో
క్విక్ రివ్యు :
ఏమిటి: ముగ్గురు ఇండో-కెనడియన్ ప్రముఖులకు దక్కిన కెనడా దేశ అత్యున్నత పౌర పురస్కారాలు
ఎవరు : వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్, బాబ్ (నవజీత్) సింగ్ ధిల్లాన్, డాక్టర్ ప్రదీప్
ఎక్కడ:కెనడా
ఎప్పుడు:డిసెంబర్ 30
‘విత్ లవ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్’ ప్రచారాన్ని ప్రారంబించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి :
ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటకం మరియు అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా ఛానెల్ నుండి ‘విత్ లవ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా, దీనిని ను పర్యాటక కేంద్రంగా ప్రచారం చేయడంతో పాటు సంస్కృతి, వ్యక్తులు, కళలు, ఆహారం మొదలైన వాటిని ప్రదర్శించే లక్ష్యంతో నార్త్ ఈస్ట్ ఇండియా ఫోటోగ్రఫీ అండ్ విడియో గ్రాఫి కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘విత్ లవ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్’ ప్రచారాన్ని ప్రారంబించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఎవరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు:డిసెంబర్ 30
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ :
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్ నుంచి తక్ష ణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. తొలి టెస్టులో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి అనంతరం అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ సందర్భంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్ద తుగా సహచరులతో పాటు మోకాలిపై కూర్చోవడానికి డికాక్ తిరస్కరించడంతో వివాదం చెలరేగడం, ఆ తర్వాత అతడు క్షమాపణలు చెప్పడం తెలిసిందే. కుటుంబంతో మరింత సమయం గడపడం కోసం రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని 20 ఏళ్ల డికాక్ చెప్పాడు. డికాక్ భార్య సాషా వచ్చే కొన్ని రోజుల్లో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. డికాక్ 51 టెస్టుల్లో 38,82 సగటుతో 3300 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 22 ఆర్ధశతకాలు ఉన్నాయి.
- దక్షిణాఫ్రికా దేశ రాజదాని :కేప్ టౌన్ ,ప్రిటోరియ ,బ్లూమ్ ఫౌంటెన్
- దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ :సౌతాఫ్రికన్ రాండ్
- దక్షిణాఫ్రికా దేశ అద్యక్షుడు : సిరిల్ రామఫోసా
- దక్షిణాఫ్రికా దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ : క్వింటన్ డికాక్
క్విక్ రివ్యు :
ఏమిటి: టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్
ఎవరు : దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్
ఎప్పుడు:డిసెంబర్ 30
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |