Daily Current Affairs in Telugu 29-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సంజయ్ అరోరా :
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) చీఫ్ సంజయ్ అరోరాకు సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి) డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది డిసెంబరులో SSB డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సంజయ్ అరోరా సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎసి) డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతారు. తమిళనాడు కేడర్ కు చెందిన 1988-బ్యాచ్ అధికారి అయిన ఆరోరా ఆగస్టులో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) DGగా నియమితులయ్యారు మరియు సెప్టెంబర్ 1న ఇండియా-చైనా LAC గార్డింగ్ ఫోరమ్ బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సంజయ్ అరోరా
ఎవరు : సంజయ్ అరోరా
ఎప్పుడు: డిసెంబర్ 29
శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణా :
శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM)ని అమలు చేస్తున్న 34 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTలు) లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానాన్ని పొందింది. తమిళనాడు మరియు గుజరాత్ జాబితాలో వరుసగా 2వ మరియు 3వ స్థానాలను పొందాయి. 28 డిసెంబర్ 2021 నాటికి పనితీరు ఆధారిత సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్ రూపొందించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణా
ఎవరు : తెలంగాణా
ఎప్పుడు: డిసెంబర్ 29
ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సు భారత రాయబారిగా అనుపం రే ఎన్నిక :
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సుకు భారత తదుపరి రాయబారిగా మరియు శాశ్వత ప్రతినిధిగా డాక్టర్ అనుపమ్ రే ఎన్నికయ్యారు. 1994 బ్యాచికి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) అధికారి అయిన రే, ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. నిరాయుధీకరణ అంటే ఆయుధాలను తగ్గించడం, పరిమితం చేయడం లేదా రద్దు చేయడం. నిరాయుధీకరణ సాధారణంగా దేశం యొక్క సైనిక లేదా నిర్దిష్ట రకం ఆయుధాలను సూచిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సు భారత రాయబారిగా అనుపంరే ఎన్నిక
ఎవరు : అనుపంరే
ఎక్కడ: జెనివా
ఎప్పుడు: డిసెంబర్ 29
మెక్సికోలో భారత తదుపరి రాయబారిగా పంకజ్ శర్మ నియామకం :
జెనీవాలోని నిరాయుధీకరణపై ఐక్యరాజ్యసమితి సదస్సుకు ప్రస్తుతం భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న పంకజ్ శర్మ మెక్సికోలో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) విడుదల ప్రకారం, 1991 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఈయన.
క్విక్ రివ్యు :
ఏమిటి: మెక్సికోలో భారత తదుపరి రాయబారిగా పంకజ్ శర్మ నియామకం
ఎవరు : పంకజ్ శర్మ
ఎక్కడ: మెక్సికో
ఎప్పుడు: డిసెంబర్ 29
ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపికైన డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి :
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఈవో) ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని (లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు) ప్రకటిం “చింది. ఆయన ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు కావడం గమనార్హం. ఈ మేరకు డిసెంబర్ 29 డబ్యూఈవో మాజీ అధ్యక్షుడు, అవార్డుల కమిటీ ప్రొఫెసర్ జీన్ ప్రాంకోయిస్ రే అభినందన లేఖను పంపించారు. పురస్కార కమిటీ డాక్టర్ నాగేశ్వర రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయన ఎండోస్కోపీలో చేసిన పరిశోధనలు, ప్రచురణలు, ఆవిష్కరణలను ప్రశంసించారు. 2022 జపాన్ లో జరిగే ప్రపంచ ఎండోస్కోపీ ‘కాంగ్రెస్ లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో డాక్టర్ నాగేశ్వరరెడ్డికి మూడు ప్రతి ష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. తొలుత అమెరికన్ సొసైటీ ఆఫ్ జీఐ ఎండోస్కోపీ నుంచి రుడాల్ఫ్ షిండర్ అవార్డును దక్కించుకున్నారు. తర్వాత
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపికైన డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
ఎప్పుడు: డిసెంబర్ 29
ర్యాపిడ్ చెస్ చాంపియన్ గా నిలిచిన ఉజ్బెకిస్తాన్ కి చెందిన నోడిర్బెక్ :
ఈ ఏడాది రికార్డు స్థాయిలో అయిదోసారి ప్రపంచ ఛాంపియ న్ గా నిలిచిన కార్ల్ సన్ (నార్వే)కు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ లో తిరుగుండదనే అంతా అనుకున్నారు. 10వ రౌండ్ ముందు వరకూ అతనే ఆధిక్యంలో ఉండడంతో ఈ డిఫెండింగ్ చాంపియన్ కచ్చితంగా టైటిల్ గెలుస్తాడనే ఊహించారు. కానీ అంచ నాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో నోడిర్బెక్ చాంపియన్ గా నిలిచాడు. ఏదో రౌండ్ లో కార్ల్ సన్ కు షాకిచ్చిన అతను అదే జోరు కొనసాగిస్తూ 13వ రౌండ్ ముగిసే సరికి పాయింట్లతో అగ్రస్థానంలో 3.5 నిలిచాడు పోటీల్లో ఏడు విజయాలు సాధించిన అతను అయిదు గేమ్లు డ్రాగా ముగించాడు. అతనితో పాటు నెపోమియాచి (రష్యా), కార్ల్ సన్, కరువానా (యుఎస్) కూడా 9.5 పాయింట్లే సాధించారు. కానీ టైబ్రేకర్ లో నెపోమియాపై గెలిచిన నోడిర్బెక్ సరికొత్త ప్రపంచ చాంపియన్ గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లలో గుకేశ్ 9వ (9 పాయింట్లు), మిత్రభ గుహ 15వ (8.5), విదిత్ 45వ (7.5) స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాండ్మాస్టర్లు హర్ష (7), హరికృష్ణ (6.5), ఆర్జున్ (6) వరుసగా – 60, 99 110వ ర్యాంకులతో ముగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ర్యాపిడ్ చెస్ చాంపియన్ గా నిలిచిన ఉజ్బెకిస్తాన్ కి చెందిన నోడిర్బెక్
ఎవరు : నోడిర్బెక్
ఎక్కడ:వార్సా
ఎప్పుడు: డిసెంబర్ 29
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |