Daily Current Affairs in Telugu 29-04-2020

Daily Current Affairs in Telugu 29-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

G-20 ప్రారంబించిన కోవిద్ -19 టూల్స్ యాక్సలెటర్కు యాక్సెస్:

జి-20. సౌది అరేబియా అద్యక్షతన కోవిద్-19 టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ అనే ఈ కొత్త  కార్యక్రమాన్ని ప్రారంబించింది. కొత్త చొరవ కోవిద్ -19టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ కనెక్షన్లను మెరుగుపరచడానికి అనే చర్య కోసం ప్రపంచ వేదికగా పని చేస్తుంది. అలాగే సమిష్టి భాగస్వామ్యం  మరియు సమీకరణ,సమస్య పరిష్కారం మరియు కొత్త కోవిద్-19 డయగ్నోస్తిక్స్,చికిత్స ల కోసం పెట్టుబడుల కోసం పరస్పర అధారితాలను ప్రభావితం చేస్తుంది. ఇందులోని సబ్యులందరికీ అన్ని సాధనాల యోక్క్ సమాన యాక్సెస్ అందించడం కూడా దీని యొక్క లక్ష్యం .

క్విక్ రివ్యు :

ఏమిటి : G-20 ప్రారంబించిన కోవిద్ -19 టూల్స్ యాక్సలెటర్ కు యాక్సెస్

ఎవరు: G-20

ఎప్పుడు: ఏప్రిల్ 28

ఆంద్ర ప్రదేశ్ లో ప్రారంబించిన జగనన్న విద్యదీవేన పథకం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నూతనంగా జగనన్న విద్యాదీవెన అనే నూతన పథకాన్ని ప్రారంబించారు. ఈ పథకం కింద రాబోయే 2020-21 విద్యా సంవత్సరంలో కళాశాల యాజమన్య ఖాతాలకు కాకుండా వాటి బదులుగా ఫీజు రియింబర్స్ మెంట్ నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ అవుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆంద్ర ప్రదేశ్ లో ప్రారంబించిన జగనన్న విద్యదీవేన పథకం

ఎవరు: ఆంద్ర ప్రదేశ్

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: ఏప్రిల్ 28

న్యుయార్క్ సలహా మండలి లో ముగ్గురు భారతీయులకు చోటు :

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ లోఆర్హ్తిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్దరించెందుకు  అవసరమైన సిపార్సులు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అండ్రూ కౌమో ఏర్పాటు చేసిన వ్యూహాత్మక కమిటీ లో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. మాస్టర్ కార్ట్ సియివో అజయ్ బంగ,టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్ అధినేత్రి చంద్రికా టాండన్,న్యూయార్క్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ దండపాణి లకు ఈ గౌరవం లబించింది. ది న్యూయార్క్ ఫార్వార్డ్ రీ ఓపెనింగ్  అడ్వయిజరీ బోర్డు పేరుతో ఏర్పాటు చేసిన  ఈ సలహా మండలిలో మొత్తం 100 మంది సబ్యులు ఉంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : న్యుయార్స్ సలహా మండలి లో ముగ్గురు భారతీయులకు చోటు

ఎక్కడ: న్యుయార్స్

ఎప్పుడు: ఏప్రిల్ 28

ఐరాసా భారత శాశ్వత ప్రతినిధిగా తిరుముర్హ్తి నియామకం:

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా టిఎస్ తిరుమూర్తి ని నియమిస్తూ ప్రబుత్వం ఏప్రిల్ 28 న ఉత్తర్వులు జారే చేసింది. 1985 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన ఈ అధికారి ప్రస్తుతం విదేశీ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్నసయ్యద్ అక్బరుద్ద్దిన్ స్థానంలో తిరుమూర్తిగారు బాద్యతలు చేపట్టనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐరాసా భారత శాశ్వత ప్రతినిధిగా తిరుముర్హ్తి నియామకం

ఎవరు: తిరుముర్హ్తి

ఎప్పుడు: ఏప్రిల్ 28

బాంబే హైకోర్ట్ చీఫ్  జస్టిస్ గా  దీపాంకర్ దత్తా  ప్రమాణ స్వీకారం:

మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోష్యారి దీపాంకర్ దత్తా గారితో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  ఉద్దావ్ థాక్రే గారు హాజరయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన జస్టిస్ భూషణ్ ధర్మాధికారి ఏప్రిల్ 27 న రిటైర్ అయ్యారు, ఆయన స్థానంలో వచ్చిన దీపాంకర్ దత్తా 1965 ఫిబ్రవరి 09 న జన్మించారు. 1989 నవంబర్ 14 న న్యాయవాదిగా బాధ్యతలు స్వీకేరించారు. కలకత్తా హైకోర్ట్ శాశ్వత జడ్జి గా 2006 జూన్ 22 న నియమితులయ్యారు. కలకత్తా లో జడ్జి కావడానికి ముందు గుహవతి ఆ హైకోర్ట్ ,జార్కండ్ హైకోర్ట్ ,సుప్రీం కోర్ట్ లో 16 సంవత్సరాలు పని చేశారు. రాజ్యాంగం,కార్మికులు,సర్వీసు విభాగాల్లో నిపుణులైన జస్టిస్ దీపాంకర్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గాను ,యునివర్సిటీ  ఆఫ్ వెస్ట్ బెంగాల్ ,వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లో లాయర్ ఇన్ చార్జ్ గా పని చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బాంబే హైకోర్ట్ చీఫ్  జస్టిస్ గా  దీపాంకర్ దత్తా  ప్రమాణ స్వీకారం

ఎవరు: దీపాంకర్ దత్తా 

ఎక్కడ: బాంబే (మహారాష్ట్ర)

ఎప్పుడు: ఏప్రిల్ 28

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *