Daily Current Affairs in Telugu 27&28-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
వైద్య రంగంలో చేసిన కృషికి గాను కార్డియాలజీ ఎక్స్లెన్స్ అవార్డును గెలుచుకున్న డాక్టర్ రమేష్ బాబు :
వైద్య రంగంలో చేసిన పరిశోధనలకు గానూ ప్రముఖ హృద్రోగ నిపు ణుడు, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ పి.రమేష్ బాబుకు మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డా.కె.శరణ్ కార్డియాలజీ ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో పాట్నాలో జరిగిన ఐఎంఏ 96వ వార్షిక జాతీయ సదస్సులో అవార్డు అందజేశారు. వైద్య పరిశోధనల్లో గత 14 ఏళ్లుగా చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్టు రమేష్ హాస్పిటల్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలి పింది. వివిధ ఔషధాలకు సంబంధించి ఎఫ్ఏ అనుమతితో అంతర్జాతీయంగా జరిగిన మూడో దశ క్లినికల్ ట్రయల్లో రమేష్ హాస్పిటల్స్ పరిశోధన విభాగం పాలుపంచుకుందని డా. రమేష్ బాబు ‘తెలిపారు. ఈ 14 ఏళ్లలో మొత్తం 28 రకాల ఔషధాలపై పరిశోధనలు నిర్వహించినట్లు తెలిపారు.వాటిలో హృద్రోగ నివారణ, రక్తాన్ని పలచగా ఉంచేందుకు తోడ్పడేవి, కొలెస్ట్రాల్ తగ్గించేవి, పక్షవాతం వచ్చినవారికి, మధుమేహ రోగులకు వాడేవి నాడీ సంబంధిత సమస్యులకు వినియోగించే ఔషదాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఔషదాలు మార్కెట్లోకి విడుదల చేయడానికి దాదాపు రెండేళ్ల ముందు జరిగే క్లినికల్ ట్రయల్స్ రమేష్ హాస్పిటల్స్ పరిశోధన విభాగం పాలుపంచుకున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైద్య రంగంలో చేసిన కృషికి గాను కార్డియాలజీ ఎక్స్లెన్స్ అవార్డును గెలుచుకున్న డాక్టర్ రమేష్ బాబు
ఎవరు: డాక్టర్ రమేష్ బాబు
ఎప్పుడు : డిసెంబర్ 27
గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజెన్ అవార్డు 2021 గెలుచుకున్న సుదీర్ భాయ్ దేశాయ్ :
సూరత్ కు చెందిన పారిశ్రామికవేత్త వైరల్ సుధీర్భయ్ దేశాయ్, గుజరాత్లో ని గ్రీన్ మ్యాన్ లేదా గ్రీన్ మ్యాన్ ప్రసిద్ధి చెందారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజెన్ అవార్డు 2021తో ఈయన సత్కరించబడ్డారు. 11 దేశాల (యునైటెడ్ కింగ్డమ్ తో సహా నుండి 28 మంది వ్యక్తులలో (UK), యునైటెడ్ స్టేట్స్ (US), న్యూజిలాండ్, ఫ్రాన్స్ మరియు మలేషియా) ఈ అవార్డుతో సత్కరించబడ్డారు, వాతావరణ మార్పుల కోసం కృషికి గౌరవంగా ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు వైరల్ సుదీర్ భాయ్ దేశాయ్.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజెన్ అవార్డు 2021 గెలుచుకున్న సుదీర్ భాయ్ దేశాయ్
ఎవరు: సుదీర్ భాయ్ దేశాయ్
ఎప్పుడు :డిసెంబర్ 27
ఎన్నికల కమిషన్ ను రద్దు చేసిన ఆఫ్గనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం :
అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషనన్ ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషనన్ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి డిప్యూటీ) బిలాల్ కరీమి వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్ లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు.
- ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని : కాబుల్
- ఆఫ్గనిస్తాన్ దేశ కరెన్సీ :ఆఫ్గాన్ ఆఫ్గని
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్నికల కమిషన్ ను రద్దు చేసిన ఆఫ్గనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం
ఎవరు: ఆఫ్గనిస్తాన్
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్
ఎప్పుడు : డిసెంబర్ 27
చైనా కు చెందిన ఐదురకాల ఉత్పత్తుల యాంటి డోపింగ్ డ్యూటీ ని విధించానున్న భారత్ :
డ్రాగన్ కు భారత్ మరోమారు షాక్ ఇచ్చింది.చైనాకు చెందిన ఐదు రకాల ఉత్పత్తులపై ఐదేండ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పొరుగుదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు చౌక ధరలకే లభిస్తుండటంతో దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి. దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్, సిలికాన్ సీలెంట్, హైడ్రోఫ్లోరో కార్బన్, కాంపొనెంట్ ఆర్-32, హైడ్రోఫ్లోరో కార్బస్ మిశ్రమాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీలు విధిస్తారు. చౌక దిగుమతులతో దేశీయ కంపెనీలు దెబ్బతినకుండా ఈ డ్యూటీ వసూలు చేస్తారు. దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే, భారత్, చైనాలు డబ్ల్యూటీవోలో సభ్యదేశాలే కావడం గమనార్హం.
- చైనా దేశ రాజధాని :బీజింగ్
- చైనా దేశ కరెన్సీ :రెన్ మిన్ బి
- చైనా దేశ అద్యక్షుడు :జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: చైనా కు చెందిన ఐదురకాల ఉత్పత్తుల యాంటి డోపింగ్ డ్యూటీ ని విధించానున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు : డిసెంబర్ 28
హిమాచల్ ప్రదేశ్లోని రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టు ప్రారంబించిన ప్రధాని :
హిమాచల్ ప్రదేశ్లోని రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టు కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసారు. ఇది సిర్మౌర్ జిల్లాలోని గిరి నదిపై రూ. 6,700 కోట్ల ప్రాజెక్టు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, 40 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన ఉపరితల పవర్ హౌస్ లో 200 మిలియన్ యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. హిమాచల్ పరదేశ్ లో రూ.11,281 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా పనధాన మంత్రి శంకుస్థాపన చేసారు. హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ రెండో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకకు కూడా ఆయన అధ్యక్ష వహించారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని :సిమ్లా (వేసవి ) ధర్మ శాల (శీతాకాలం )
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : జైరాం ఠాకూర్
క్విక్ రివ్యు :
ఏమిటి: హిమాచల్ ప్రదేశ్లోని రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టు ప్రారంబించిన ప్రధాని
ఎవరు: ప్రధాని నరేంద్ర మోడి
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్లోని
ఎప్పుడు : డిసెంబర్ 28
దేశవ్యాప్త ౦ గా ప్రకటించిన ఆరోగ్య సూచీలో మొదటి స్థానం లో నిలిచిన కేరళ రాష్ట్రం :
దేశవ్యాప్త ఆరోగ్య సూచీ (2019 20లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. 2018 -19లో మూడో స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 69, 35 స్కోర్ తో ఒకస్థానం కిందికి దిగింది. అదే సమయంలో తెలంగాణ ఒక స్థానాన్ని మెరుగుపరచు కుని 69.96 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది ‘ఆరోగ్య రాష్ట్రాలు- ప్రగతిశీల భారతదేశం’ పేరుతో రాష్ట్రాల 1వ ఆరోగ్య సూచీ-2019-20 నివేది కను- నీతిఆయోగ్ డిసెంబర్ 27 న విడుదల చేసింది. ఈ సూచీలో కేరళ(82.20), తమిళనాడు (72.42) మొదటి రెండు స్థానాలు దక్కించుకోగా.. ఉత్తర్ ప్ర దేశ్ (30,57), బిహార్ (31) అట్టడుగున నిలిచాయి. మహారాష్ట్ర (69.11) ఆయిదో స్థానం దక్కించుకుంది. 2018-19లో 68.88 స్కోర్ తో వార్షిక సూచీలో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 107 స్కోర్ పెంచుకొని మూడో స్థానం లో 69.05 సాధించిన తెలంగాణ మెరుగు పడటంతో 4వస్థానానికి పడిపోయింది. ఆరోగ్యరంగం పనితీరులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయి.
- కేరళా రాష్ట్ర రాజధాని : తిరువనంత పురం
- కేరళా రాష్ట్ర ముఖ్యమంత్రి : పినరాయి విజయన్
- కేరళా రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ అహ్మద్ ఖాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశవ్యాప్త ౦ గా ప్రకటించిన ఆరోగ్య సూచీలో మొదటి స్థానం లో నిలిచిన కేరళ రాష్ట్రం
ఎవరు: కేరళ రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 28
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా విక్రమ్ మిశ్రి నియామకం :
చైనాకు భారత మాజీ రాయబారి విక్రమ్ మిశ్రి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 1989 ఐఎఫ్ఎస్ బ్యాచ్ సభ్యుడైన మిత్రి.. 2019లో రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య రాయబారిగా కీలక సేవలు అందించారు. విదేశాంగశాఖ, దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో విస్తృత సేవలందించారు మిశ్రి. 2014మే జులై 6మంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవారు చైనాకు భారత రాయబారిగా విక్రమ్ మిశ్రి స్థానంలో ప్రదీప్ కుమార్ రావత్ నియమిస్తూ ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా విక్రమ్ మిర్రి నియామకం
ఎవరు: విక్రమ్ మిర్రి
ఎప్పుడు : డిసెంబర్ 28
.
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |