
Daily Current Affairs in Telugu 05-09-2020
పిల్లల ఆరోగ్య అబివృద్ది సూచిలో మొదటి స్థానంలో నిలిచిన కేరళ :

ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్య అబివృద్ది వివరాలలో కేరళ ప్రథమ స్థానంలో నిలవగా బిహార్ చివరి స్థానంలో ఉంది ప్రధానంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, ఎదుగుదల అనే మూడు అంశాలతో పాటు, శిశు మరణాల రేటు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు సంబందించిన స్థానాలను కేటాయించారు 2005-0 లోని ఫలితాలను 2015-16 నాటి ఫలితాలతో పోలుస్తూ రూపొందించిన ఈ నివేదికను యంగ్ చైల్డ్ అవుట్ కమ్స్ ఇండెక్స్ (వైసీఓఐ) వెల్లడించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 04న విడుదల చేసిన స్టేట్ ఆప్ ద యూత్ చైల్డ్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో ఈ నివేదిక పొందుపర్చి ఉంది. బాలల ఆరోగ్య సంక్షేమ సూచీలో 2005-06లో 0.443పాయింట్లు సాధించిన భారత్ 2015-168 కి 0585 వద్ద స్థిరపడింది. వైసీకఐ నివేదికలో కేరళ, గోవా రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా అస్సాం, మేఘాలయ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ బిహార్ చివరి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వైసీఈఐ నివేదికలో వెనకబడి ఉండటం గమనార్హం.ఇందులో వెనుకంజలో ఉన్న త్రిపుర మాత్రం కొంత మేరకు మెరుగుపడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పిల్లల ఆరోగ్య అబివృద్ది సూచిలో మొదటి స్థానంలో నిలిచిన కేరళా
ఎవరు: కేరళా
ఎప్పుడు :సెప్టెంబర్ 05
ఎక్కడ:న్యుడిల్లి
రష్యా లోని మాస్కో వేదికగా జరిగిన ఎన్సివో మంత్రుల సమావేశం :

రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న షా మై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ వీకెన్ పాల్గొన్నారు. ఎస్సీఓలో భారత్, చైనా రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40 శాతం ఉంటుంది. ఈ సమావేశం ద్వారాపరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే ఎస్సీ ఓ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టైజానికి వ్యతిరేకంగా ఎస్సీ ‘రీజనల్ యాంటీ టైజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యా లోని మాస్కో వేదికగా జరిగిన ఎన్సివో మంత్రుల సమావేశం
ఎప్పుడు:సెప్టెంబర్ 05
ఎక్కడ: రష్యా లోని మాస్కో
ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా గా నిలిచిన మెకంజీ స్కాట్ :

ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా ఘనతను దక్కించుకున్నారు అమెజాన్ షేర్లు లాభాలతో మాకెంజీ ధన వంతుల జాబితాలో టాప్ లోకి దూసుకొచ్చారు. స్కాట్ నికర విలువ ఇప్పుడు 68 బిలియన్ డాలర్లుకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం దాత, రచయిత్రి మెకంజీ ప్రపంచ ధనిక మహిళగా నిలిచారు. లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ ను అధిగమించారు లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తో విడాకుల పరిష్కారం సందర్భంగా స్కాట్ అమెజాన్ షేర్లలో 35 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 4 శాతం వాటాను పొందారు.. తాజాగా అమెజాన్ యొక్క షేర్ విలువ భారీగా పెరగడంతో మెకంజీ స్కాట్ సంపద విలువ పుంజుకుంది. దీంతో ఆమె ప్రపంచంలో 12వ సంపన్నురాలుగా నిలిచారు. కాగా ఇప్పటికే 116 సంస్థలకు దాదాపు 1.7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు స్కాట్ జూలైలో ప్రకటించారు. గత మూడు నెలల్లో అమెజాన్ స్టాక్ సుమారు 28శాతం పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 90శాతం కంటే ఎక్కువ పొంగింది. దీంతో బెజోస్ సంపద 202 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో అపర కుబేరుడు బెజోస్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఈ వారం ప్రారంభంలో టెస్ సీఈఓ ఎలన్ మస్క్ మార్క్ జుకర్ బర్గ్ ను అధిగమించి ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా గా నిలిచిన మెకంజీ స్కాట్
ఎవరు: మెకంజీ స్కాట్
ఎప్పుడు:సెప్టెంబర్ 05
సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ :

సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2010 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ మూడో స్థానాలు సాధించాయి. ఏపీ మొదటి ర్యాంకు సాధించగా ఇది వరుసగా మూడోసారి గత ఏడాది 2వ ర్యాంకు సాధించిన తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యా శాఖ మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 05 ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్పర దేశ తెలంగాణ తొలి స్థానంలోనిలి చాయి. గత నాలుగేళ్లుగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండ అండ్ ఇంటర్నల్, ట్రేడ్ ‘విడుదల చేస్తున్న ర్యాంకుల్లో తొలి ఏడాది రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ మిగిలిన మూడు సార్లు తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది.తెలంగాణా తొలి ఏడాది తప్ప్ప మిగిలిన మూడేళ్ళ లోను టాప్ 3 స్థానంలో ఉంది మొత్తం 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల లో గతంతో పోలిస్తే 12రాష్ట్రాలు టాప్ 10 లో స్థానాలు కోల్పోయాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఎవరు: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: సెప్టెంబర్ 05
ఎక్కడ: న్యుడిల్లి
మహిళల హాఫ్ మారథాన్ లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్ పెరెస్ :

మహిళల హాఫ్ మారథాన్ (21,1 కి. మీ) ఈ వెంట్లో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్ ఛిర్చీర్ కొత్త ప్రపంచరకర్డును నీమోదు చేసింది సెప్టెంబర్ 05 ఉదయం జరిగిన ఈ పోటీలో 26 ఏళ్ల పెరెస్ గంటా 5 నిమిషాల 34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పింది గతంలో ఈ రికార్డు ఇథియోపియా అథ్లెట్ నెట్ నెట్ గుడెటా పేరు మీద ఉండగా దాన్ని తాజాగా పెరెస్ దాన్ని సవరించింది. 2016 వరల్డ్ హాఫ్ మార ధాన్ దాంపియన్ సీప్లో మె్సానెట్ పోటీని గంటా ఆ నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసింది. వరల్డ్ రికార్డు ను సవరించడం పట్ల పెరెస్ హర్షం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల హాఫ్ మారథాన్ లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్ పెరెస్
ఎవరు: పెరెస్
ఎప్పుడు: సెప్టెంబర్ 05
ఎక్కడ: ప్రాగ్ (చెక్ రిపబ్లిక్)
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |