
Daily Current Affairs in Telugu 06-09-2020
ఐటా అద్యక్షుడిగా నియమితులయిన అనిల్ జైన్ :

అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కు అద్యక్షుడిగా భారతీయ జనత పార్టీ (బిజెపి) రాజ్యసభ సబ్య్దుడు అయిన అనిల్ జైన్ ఎన్నికయ్యారు.ఈ మేరకు సెప్టెంబర్ 06 న జరిగిన ఐటా వార్షిక సమవేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మధ్యప్రదేశ్ టెన్నిస్ సంఘం (ఎంపిటిఎ) అద్యక్షుడిగా ఉన్న అనిల్ దూప్ర్ ను సెక్రటరి జనరల్ గా భారత మాజీ డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్ పాల్ ను కోశాధికారిగా ఎన్నికున్నారు.వీరు 2024 వరకు ఆ పదవుల్లో కొనసాగనున్నారు.
క్విక్ రివ్యు :
ఎమిటి: ఐటా అద్యక్షుడిగా నియమితులయిన అనిల్ జైన్
ఎవరు: అనిల్ జైన్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 06
ఇటాలియన్ ఓపెన్ గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన పెరి గస్లి :

ఇటాలియన్ గ్రాండ్ ప్రీ లో ఆశ్చర్యకర ఫలితం చోటుచేసుకుంది. ఆల్ఫా తాల్ డ్రైవర్ పెరీ గల్లీ రేసులో విజేతగా నిలిచాడు .24 ఏళ్ల గస్లీకి ఇదే తొలి ఫార్ములా వన్ విజయం. కార్లోస్ సైంజ్ (మెక్ లారెన్), లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్) రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అలవోకగానే గెలిచేలా కనిపించాడు. కానీ మూసి ఉంచిన పిట్ లేన్‌లోకి వెళ్లినందుకు పది సెకన్ల పెనాల్టీ పడడంతో వెనుకబడిపోయాడు.
క్విక్ రివ్యు :
ఎమిటి: ఇటాలియన్ ఓపెన్ గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన పెరి గస్లి
ఎవరు: పెరి గస్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 06
కేశవనంద భారతి కేసులో కీలక వ్యక్తి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త కేశవనంద భారతి కన్నుమూత :

రాజ్యాంగ పరిరక్షణ కేసులో కీలక వ్యక్తి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాసర్ గడ్(కేరళ)లోని ఎడ్ నీర్ మఠం నిర్వాహకులు స్వామీజీ కేశవ నంద భారతి(79) సెప్టెంబర్ కన్నుమూశారు వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు కారణంగా ఇక్కడ కన్నుమూశారు. రాజ్యాంగం సర్వోన్నతను ధ్రువపరిచిన కేసు ద్వారా కేశవానంద భారతి ఈ దేశానికి సుపరిచితులు. ఆయన 19వ ఏట సన్యాసం స్వీకరించి 1961లో ఎడ్నీర్ ర్ మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్ర మాలతో పాటు, సామాజిక సేవలోనూ పాల్గొన్నారు. కన్నడ, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాసంస్థలు వేద పాఠశాలలు నెలకొల్పారు. కర్ణాటకలో ప్రాచీన కళ అయిన యజ్ఞ గానాన్ని పునరుద్ధరించి చారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన రచయిత కూడా.
క్విక్ రివ్యు :
ఎమిటి: కేశవనంద భారతి కేసులో కీలక వ్యక్తి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త కేశవనంద భారతి కన్నుమూత
ఎవరు: కేశవనంద భారతి
ఎక్కడ:కాసర్ గడ్ (కేరళ)
ఎప్పుడు: సెప్టెంబర్ 06
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ కాపెల్ కన్నుమూత :

ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్, లెజెండరీ క్రికెటర్ డేవిడ్ కాపెల్ కన్నుమూశారు. అతను 1987 నుండి 1990 వరకు ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 టెస్టు మ్యాచ్ లు మరియు 23 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్ లు ఆడాడు. 1987 లో పాకిస్థాన్‌పై టెస్ట్ ఇంగ్లాండ్ జట్టు లో అరంగేట్రం చేశాడు.
క్విక్ రివ్యు :
ఎమిటి: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ కాపెల్ కన్నుమూత :
ఎవరు: డేవిడ్ కాపెల్
ఎక్కడ: ఇంగ్లాండ్
ఎప్పుడు: సెప్టెంబర్ 06
ఐపిపిఆర్ సబ్యురాలిగా ప్రేతి సుడాన్ నియామకం :

కరోన మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ వో ఏర్పాటుచేసిన స్వతంత్ర ప్యానెల్ లో సబ్యురలిగా కేంద్ర ఆరోగ్య శాఖా మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులయ్యారు.ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ ప్యాండ మిక్ ప్రిపెర్డ్‌నెస్ రెస్పాన్స్ (ఐపిపిఆర్ ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆమెతో పాటు మొత్తం 11సబ్యులు ఉన్నారు. భారత్ లో కోవిద్ వ్యాప్తి ని నియంత్రించేందుకు తొలి నాళ్లలో ప్రీతీ తీవ్రంగా కృషి చేసారు.ఆమె అనుభవం ప్రపంచానికి ఎంతో అవసరం అని బావించిన ప్యానెల్ నేతలు న్యూజిలాండ్ మాజీ ప్రదానమంత్రి హెలెన్ క్లార్క్ లైబీరియా మాజీ అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సభ్యురాలిగా అవకాశం కల్పించారు.
క్విక్ రివ్యు :
ఎమిటి: ఐపిపిఆర్ సబ్యురాలిగా ప్రేతి సుడాన్ నియామకం
ఎవరు: ప్రేతి సుడాన్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 06
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |