Daily Current Affairs in Telugu 26&27-08-2021
ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టిన కేంద్ర రక్షణ శాఖ :
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో మెరిసిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను కేంద్ర రక్షణ శాఖ ఘనంగా సన్మానించింది. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టింది. ఒలింపిక్స్ లో పాల్గొన్న భద్రత దళాల క్రీడాకారులకు ఇటీవల జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. నీరజ్ (అథ్లెటిక్స్) తో పాటు తరుణ్ రాయ్, ప్రవీణ్ జాధవ్ (ఆర్చరీ), అమిత్, మనీష్ కౌశిక్, సతీశ్ కుమార్, కుట్టప్ప (బాక్సింగ్ కోచ్), చోటేలాల్ యాదవ్ (బాక్సర్ మేరీకోమ్ తో నీరజ్ కోచ్, దీపక్ పునియా (రెజ్లింగ్), అర్జున్ లాల్, అరవింద్సెంగ్ (రోయింగ్), విష్ణు శరవణన్ (సెయిలింగ్)లను రాజ్ నాథ్ సింగ్ గారు సత్కరించారు. ఏఎస్ఐ స్టేడియానికి నీరజ్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపియన్లు సంతకాలు చేసిన శాలువాను కేంద్ర మంత్రికి అందజేశారు.
- కేంద్ర రక్షణ శాఖా మంత్రి :రాజ్ నాథ్ సింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టిన కేంద్ర రక్షణ శాఖ
ఎవరు: కేంద్ర రక్షణ శాఖ
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా అజయ్ కుమార్ నియామకం :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 ఆగస్టు 20 నుండి అమలులోకి వచ్చేలా శ్రీ అజయ్ కుమార్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) గా నియమించింది. ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందడానికి ముందు, శ్రీ అజయ్ కుమార్ రీజనల్ డైరెక్టర్‌గా బ్యాంక్ యొక్క న్యూఢిల్లీ ప్రాంతీయ కార్యాలయానికి అధిపతిగా ఉన్నారు. ఈయన మూడు దశాబ్దాల వ్యవధిలో, విదేశీ మారకం, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఆర్థిక చేరిక, కరెన్సీ నిర్వహణ మరియు రిజర్వ్ బ్యాంక్‌లోని ఇతర రంగాలలో సేవలందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, శ్రీ కుమార్ కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్ మరియు ప్రాంగణ శాఖను చూసుకుంటారు. శ్రీ కుమార్ పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్, ICFAI నుండి MS మరియు బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ మరియు రీసెర్చ్ నుండి సర్టిఫైడ్ బ్యాంక్ మేనేజర్. అతను చికాగోలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను చేపట్టాడు మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ (CAIIB) సర్టిఫైడ్ అసోసియేట్‌తో సహా ఇతర వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉన్నాడు.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన : 1935 ఏప్రిల్ 01 కోల్ కతా లో
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం : ముంబై
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ : శక్తి కాంత దాస్
క్విక్ రివ్యు :
ఏమిటి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా అజయ్ కుమార్ నియామకం
ఎవరు: అజయ్ కుమార్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షి తిరిగి నియామకం :
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షిని తిరిగి నియమించడానికి ఆర్బిఐ ఆమోదం తెలిపింది కాగా సందీప్ భక్షిని తిరిగి ఎండి మరియు సిఇఒగా నియమించాలనే నిర్ణయం దాదాపు రెండు సంవత్సరాల క్రితం వాటాదారుల ఆమోదం పొందినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. “ఆగష్టు 9, 2019 న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారు. ఇప్పటికే అక్టోబర్ 15, 2018 నుండి అక్టోబర్ 3, 2023 వరకు అమలులో ఉన్న కాలానికి మిస్టర్ సందీప్ బక్షి నియామకాన్ని ఆమోదించారు” అని ఎన్‌సిఇఐ ఫైలింగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొంది.
- ఐ.సి.సి.ఐ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం : వదోదర
- ఐ.సి.సి.ఐ బ్యాంక్ స్థాపన : 1994 జూన్ వదోదర
- ఐ.సి.సి.ఐ బ్యాంక్ యొక్క ఎండి & సిఇఒ : సందీప్ భక్షి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షి తిరిగి నియామకం
ఎవరు: సందీప్ భక్షిని
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు నియామకం :
తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు (మామి డన్న సత్యరత్న శ్రీరామ చంద్రరావు) గారు నియమితు లయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన నాలుగు హైకోర్టుల న్యాయమూర్తుల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతు హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్థానంలో ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమిం చారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ ‘విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి గారి స్థానంలో జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె. కె. మహేశ్వరి స్థానంలో జస్టిస్ మీనాక్షి మదన రాయ్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా స్థానంలో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్ బాధ్యతల నుంచి వైదొలగాక జస్టిస్ వినీత్ కొఠారి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ విధులు పర్యవేక్షిస్తారని, జస్టిస్ కొఠారి సెప్టెంబరు ఒకటిన పదవీ విరమణ చేయనుండడంతో జస్టిస్ రష్మిన్ మన్హర్భాయ్ ఛాయ ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబరు 2 నుంచి బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
- తెలంగాణరాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర్ రాజన్
- తెలంగాణా రాష్ట్ర ప్రస్తుత హైకోర్ట్ న్యాయ మూర్తి : ఎం. ఎస్. రామచంద్రరావు
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు నియామకం
ఎవరు: ఎం. ఎస్. రామచంద్రరావు
ఎప్పుడు : ఆగస్ట్ 26
డిల్లి ప్రభుత్వం ప్రారంబించిన దేశ్ కా మెంటార్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ నియామకం :
కరోనా కల్లోల సమయంలో ఎంతో మందికి సాయం చేసి, ‘రియల్ ప్రశంసలు అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను దిల్లీ సీఎం కేజీవాల్ ప్రభుత్వ తాము ప్రారంభించిన ‘దేశ్ కా మెంటార్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడ ర్ గా నియమించింది. ఈ బాధ్యతల్లో భాగంగా ఢిల్లీ విద్యార్థులకు సోనూ సూద్ మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తమ ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల్లోని విద్యార్థుల పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కేజ్రివాల్ తెలిపారు.
- డిల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి : అరవింద్ కేజ్రి వాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లి ప్రభుత్వం ప్రారంబించిన దేశ్ కా మెంటార్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ నియామకం
ఎవరు: సోను సూద్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఆగస్ట్ 26
ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ :
కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య శాఖ సహకారంతో ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) నిర్వహించిన “ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్” ను ప్రారంభించారు. ఇంజనీరింగ్ వాణిజ్యం మరియు పెట్టుబడులలో భారతదేశం-ఆసియాన్ భాగస్వామ్యంపై భారతీయ పరిశ్రమ నిమగ్నమవ్వడానికి సమ్మిట్ ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్
ఎవరు: కేంద్ర విదేశీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఆగస్ట్ 26
టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకం గెలుచుకున్న దేశంగా నిలిచిన ఆస్ట్రేలియా :
టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకాన్ని ఆస్ట్రేలియా దేశం గెలుచుకుంది. ఆ దేశానికి చెందిన సైకిలిస్టు పేయిగ్ గెకో 3 వేల మీటర్ల మహిళల వ్యక్తిగత ఈవెంట్లో విజయం సాధించి స్వర్ణం నెగ్గింది. మహిళల క్లాస్1-3 కేటగిరిలో పోటీ పడిన గ్రెకో గతంలో తాను సాధించిన రికార్డును తానే తిరగరాసింది. 3 నిమిషాల 50.81 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి పసిడి పథకం ను ముద్దాడింది. ఇక వాంగ్ జియోమి (చైనా) రజతం నెగ్గగా డెనిస్ షిండ్లర్ (జర్మనీ) కాంస్యం పతకం గెలుచుకున్నారు.
- టోక్యో పారలిపిక్స్ ప్రారంబం :24 ఆగస్ట్ 2021- సెప్టెంబర్ 05 2021
- టోక్యో పారాలింపిక్స్ జరుగు దేశం :జపాన్
- టోక్యో పారాలింపిక్స్ థీం : యునైటెడ్ బై ఎమోషన్
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకం గెలుచుకున్న దేశంగా నిలిచిన ఆస్ట్రేలియా
ఎవరు: ఆస్ట్రేలియా
ఎక్కడ: టోక్యో (జపాన్ )
ఎప్పుడు : ఆగస్ట్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |