
ఎపిపియస్సి మరియు టియస్పియస్సి పరిక్షల కోసం ప్రత్యేకంగా రూపోందించిన ప్రశ్నలు:
ఇండియన్ జియోగ్రఫీ ప్రాక్టిస్ బిట్స్ :
- ప్రతిపాదన (ఎ) : భారతదేశ తూర్పుకొనకు, పశ్చిమకొనకు 2 గం.ల కాల వ్యత్యాసం ఉంటుంది.
కారణం (ఆర్) : దేశ తూర్పుకొనకు, పశ్చిమ కొనకు మధ్యసుమారు 40° రేఖాంశాల తేడా ఉంది.
1) (ఎ) మరియు (ఆర్) సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.
2) (ఎ) మరియు (ఆర్) రెండూ సరైనవే మరియు (ఆర్) (ఎ) కు సరైన వివరణ కాదు.
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం.
2. ప్రతిపాదన (ఎ) : భారతదేశంలో కెల్లా అతిపురాతనమైన భూస్వరూపం ద్వీపకల్ప పీఠభూమి
కారణం (ఆర్) : ద్వీపకల్ప పీఠభూమి ప్లిస్టోసీన్ కాలంలో ఏర్పడింది.
1) (ఎ) మరియు (ఆర్) సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.
2) (ఎ) మరియు (ఆర్) రెండూ సరైనవే మరియు (ఆర్) (ఎ) కు సరైన వివరణ కాదు.
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం.
3. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము?
ఎ. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్నది నర్మదా నది.
బి. ద్వీపకల్ప పీఠభూమికి వాయువ్యంలో ఆరావళి పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి.
సి. ద్వీపకల్ప పీఠభూమికి ఈశాన్యంలో ఉన్న సరిహద్దు రాజమహల్ కొండలు
1) ఎ& బి
2) ఎ&సి
3) బి& సి
4) ఏ. బి,సి
4. ప్రతిపాదన (ఎ) : వేసవి కాలంలో దక్షిణం నుండి ఉత్తరంకు పోయే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
కారణం (ఆర్) : దక్షిణ భారతదేశం సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది.
సరైన దానిని గుర్తించుము?
1) (ఎ) మరియు (ఆర్) సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.
2) (ఎ) మరియు (ఆర్) రెండూ సరైనవే మరియు (ఆర్) (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం.
5. నల్ల రేగడి నేలలకు సంబధించి క్రింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఇవి మహారాష్ట్రలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
బి. ఇవి అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణ వలన ఏర్పడ్డాయి.
సి. ఇవి గ్రానైట్, నీస్ శిలలు శైథిల్యం చెందడం వలన ఏర్పడతాయి.
1) ఎ & బి
2) బి& సి
3) ఎ & సి
4) ఎ, బి & సీ
6. 2019 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ?
1) మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, అరుణాచల్ ప్రదేశ్
2) మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్
3) అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్
4) అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్
7. కింది వాటిని జతపరచుము ?
i. సిమ్లిపాల్ : a ఉత్తరప్రదేశ్
ii. బందిపూర్ : b. ఓడిశా
iii. మానస్ : c . కర్నాటక
iv. చంద్రప్రభ : d. అసోం
1) i – c, ii-d, iii – a, iv – b
2) i – d, ii-c, iii – b, iv – a
3) i -b, ii-c, iii – d, iv – a
4) i- a, ii – b, iii – c, iv – d
8. కింది వాటిని జతపరచుము ?
i. కావేరి నది : a. బాలాఘాట్ కొండలు
ii. పెన్నా నది : b. వరాహ కొండలు
iii. మంజీరా నది : c. బ్రహ్మ గిరి కొండలు
iv. తుంగబద్ర నది : d. నంది దుర్గ కొండలు
1) i – b, ii-d, iii – a, iv – c
2) i – d, ii-c, iii – a, iv – b
3) i -b, ii-d, iii – c, iv – a
4) i- c, ii – d, iii – a, iv – b
9. క్రింది వాటిలో సరికానిది ఏది?
1) సింధూ నది టిబెట్, భారతదేశం, పాకిస్థాన్ ల గుండా ప్రవహిస్తుంది.
2) సింధు నది పరివాహక ప్రాంతం 5,14,300 చ.కి.మీ
3) సింధు నది పాకిస్థాన్ లోని ‘సింధుతల్బల’ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
4) అరేబియా సముద్రంలో కలిసే నదులలో సింధు నది అతి పొడవైనది.
10. క్రింది వాటిలో సరికానిది ఏది?
1) బియాస్ ప్రాజెక్టును మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలుస్తారు.
2) కోసి ప్రాజెక్టు వలన బిహార్ మరియు భూటాన్ లు లబ్ది పొందుతున్నాయి.
3) గండక్ ప్రాజెక్టు వలన బీహార్ లో మరియు నేపాల్ లు లబ్ది పొందుతున్నాయి.
4) ఇందిరాసాగర్ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
Key:
1. 3 | 2. 3 | 3. 4 | 4. 4 | 5. 4 |
6. 2 | 7. 3 | 8. 4 | 9. 2 | 10. 2 |