Daily Current Affairs in Telugu -25-11-2019

Daily Current Affairs in Telugu -24-11-2019

ఆంధ్రపదేశ్ లో ఉపాధి హామీ పథకానికి రూ.315 కోట్లు

గ్రామీణ  ఉపాధి హామీ పథకం  కింద రూ.315.86 కోట్ల మంజూరు చేస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వం  పాలన అనుమతులనిచ్చింది. అడ్వాన్సుల కింద సెప్టెంబర్ లో రూ.1459 కోట్లకు గాను రూ.1143 కోట్లు మంజూరు చేశారని  మిగిలిన రూ.315 .86 కోట్లను మంజూరు చేయాలని  పంచాయితి రాజ్ ,గ్రామీణ అభివృద్ధి  శాఖ కమిషనర్ విజ్ఞప్తి మేరకు  ప్రబుత్వం  ఈ అనుమతినిచ్చింది

క్విక్ రివ్యూ

ఏమిటి :  ఆంధ్రపదేశ్ లో ఉపాధి హామీ పథకానికి రూ.315 కోట్లు

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: నవంబర్ 25

జెమ్ పకడ్బంది నిర్వహణకు పర్యవేక్షణ కమిటీ

ఆంధ్రప్రదేశ్  ప్రబుత్వం లోని వివిధ శాఖలు,సంస్థలకు  అవసరమైన వస్తువులు కొనుగోలును  ప్రబుత్వ ఈ మార్కెట్  వ్యవస్థ  (జేమ్).ద్వారా చేపట్టాలని  కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ  నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా  కొనుగోళ్ళ  అంశాన్ని  పర్యవేక్షించేందుకు  ఖజానా శాఖ  సంచాలకుడు  చైర్మెన్ గా సంయుక్త కార్యదర్శిగా  సబ్యాకార్యదర్శిగా  మరో నలుగురు  సభ్యులతో  ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ  ఆర్ధిక శాఖ ముక్య కార్యదర్శిగా  రావత్ ఉత్తర్వులు ఇచ్చారు

క్విక్ రివ్యూ

ఏమిటి : జెమ్ పకడ్బంది నిర్వహణకు పర్యవేక్షణ కమిటీ

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:  నవంబర్ 25

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి  పిర్యాదులకు 14400

అవినీతి పై ప్రజల  నుంచి పిర్యాదుల  స్వీకరణకు  ప్రత్యెక  కాల్ సెంటర్ నెంబర్ 14400 ను ఎపి రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులోకి  తీసుకోచ్చింది. తాడేపల్లి  లోని క్యాంపు కార్యాలయంలోని  ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  నవంబర్ 25 న  దీన్ని ప్రారంబించారు. అనంతరం ఆయనే  స్వయంగా  కాల్ సెంటర్ కు పోన్ చేసి  పనితీరు  వివరాలు  తెలుసుకున్నారు. ఈ సందర్బంగా  సిఎం జగన్  మాట్లాడుతూ  పిర్యాదు  అందిన  15 నుంచి  30 రోజుల్లో దర్యాప్తు  పూర్తి చేసి  తగిన చర్యలు తీసుకోవాలి.బాదితుల పిర్యాదులను  ఎట్టి పరిస్థుల్లోను నిర్లక్ష్యం చేయకూడదు. జవాబుదారితనంతో పని చేసి  పిర్యాదులకు  పరిష్కారం  చూసినపుడే  వ్యవస్థ  పై  నమ్మకం కలుగుతుంది. అని అన్నారు.

క్విక్ రివ్యూ

ఏమిటి :  .ఆంధ్రప్రదేశ్ లో అవినీతి  పిర్యాదులకు 14400

ఎక్కడ:  ఆంద్రప్రదేశ్

ఎప్పుడు: నవంబర్ 25

తెలంగాణ ఆహార బద్రత మిషన్ కు రూ.51 కోట్లు  విడుదల

జాతీయ ఆహారబద్రత  మిషన్  (ఎఫ్ఎస్ఎం) పథకం అమలు కోసం రూ 51.65 కోట్లను విడుదలచేస్తూ వ్యవసాయ శాఖ  నవంబర్ 24 న  ఉత్తర్వులు జారి చేసింది. వారి పప్పు దాన్యాలు పంటలు పండించే  రైతులకు  రాయితీలు ఇచ్చేందుకు  ఈ పతాకాన్ని  కేంద్రం అమలు చేస్తుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి  తొలుత బడ్జెట్ లో రూ.12.66 కోట్లే కేటాయించారు. అవి సరిపోవని  వ్యవసాయ శాఖ  తెలపడంతో  పంటల ధిగుబడిని పెంచడానికి  విత్తనాలు ,ఎరువులు  వంటి వాటిని  రాయితీ  పై రైతులకు  ఈ పథకం  కింద ఇస్తారు.

క్విక్ రివ్యూ

ఏమిటి :  ఆహార బద్రత మిషన్ కు రూ.51 కోట్లు  విడుదల

ఎక్కడ:తెలంగాణ

ఎప్పుడు:  నవంబర్ 25

నవంబర్ 26 న రాజ్యంగ ఆమోద దినోత్సవం 

బారత  రాజ్యాంగాన్ని  ఆమోదించి  70 ఏళ్ళు అవుతున్న  సందర్భంగా  నవంబర్ 26 న పార్లిమెంట్ సెంట్రల్ హాల్  లో రాజ్యంగ దినోత్సవం  (సంవిదాన్  దివస్) జరగనుంది. రాజ్యసభ  250వ సమావేశాలు గుర్తుగా  రూపొందించిన  రూ250 విలువైన  వెండి నాణాన్ని  ఈ సందర్భంగా  రాష్టపతి  రామ్ నాథ్ కోవింద్ ,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,ప్రదాని  మోది ఆవిష్కరిస్తారు. ఇప్పటి వరకు  జరిగిన  106 రాజ్యంగా సవరణలకు  సంబంధించిన వివరాలతో కూడిన  సంకలనాన్ని  వారు విడుదల  చేస్తారు. “రాజ్యసభ  ది జర్నీ సీన్స్ 1952” శీర్షికన దీన్ని  సిద్దం చేసినట్లు  రాజ్యసభ  సచివాలయం  తెలిపింది. రాజ్యాంగాన్ని  తొలిసారిగా  1951 లో ఎస్సి,ఎస్టి,బీసి ల సంక్షీమార్థం  సవరించాగ చివరిసారిగా  ఆర్థికంగ  వెనుకబడిన  వారికి  విద్య ,ఉద్యోగ  అవకాశాల్లో  10% రిజర్వేషన్  కల్పిస్తూ 103 వ సవరణ చేసినట్లు  వివరించింది.

క్విక్ రివ్యూ

ఏమిటి :  నవంబర్ 26 న రాజ్యంగ ఆమోద దినోత్సవం 

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 26

స్పెయిన్ దే డేవిస్ కప్

స్పెయిన్ జట్టు  ఆరోసారి  డేవిస్ కప్ టైటిల్ ను  చేజేక్కిన్చుకుంది. ఫైనల్స్ లో డబుల్స్ మ్యాచ్ తో పని లేకుండానే కెనడా పై విజయం సాధించింది. రెండో సింగిల్స్ లో  రాఫెల్ నాడెల్ 6.-3 ,7-6 (9-7) షపోవ లొవ్ ను ఓడించడం తో  స్పెయిన్  2-0 తో  తిరుగులేని  ఆదిక్యం  సాదించి  విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్ లో రాబర్తో బాటిస్టా 7-6 (7-3) ,6-3 తో ఫెలిక్స్ అగర  అలియసిం పై  విజయం సాదించాడు.  19 సార్లు  గ్రాండ్ స్లాం చాంపియన్  నాదల్ కు ఇది నాలుగో  డేవిస్ కప్  టైటిల్ . ఇంతకముందు 2004,2009 2011 లో డేవిస్ కప్ గెలిచిన స్పెయిన్  జట్టులో ఉన్నాడు

క్విక్ రివ్యూ

ఏమిటి :  స్పెయిన్ దే డేవిస్ కప్

ఎక్కడ: మాడ్రిడ్

ఎప్పుడు: నవంబర్ 25

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *