Daily Current Affairs in Telugu 24&25-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams like APPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం గెలుచుకున్న సీనియర్ పాత్రికే యులు ఏబీకే ప్రసాద్ :
సీనియర్ పాత్రికే యులు ఏబీకే ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జీవన సాఫల్య పుర స్కారం అందజేసింది. హైదరాబాద్లో డిసెంబర్ 24 నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ ‘పత్రికా’ రంగంలో పనిచేసిన, చేస్తున్న న సహచరులందరికీ దక్కిన గౌరవంగా ఈ పరస్కారాన్ని భావిస్తున్నా. సీఎం జగనికి, ఎంపిక కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అని అన్నారు. పరస్కారంతో పాటు రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి. అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివా సులు, విశాలాంధ్ర సంపాదకులు ఆర్వీ రామారావు పాల్గొన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం గెలుచుకున్న సీనియర్ పాత్రికే యులు ఏబీకే ప్రసాద్ :
ఎవరు: ఏబీకే ప్రసాద్
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 25
గూగుల్ పై .750 కోట్ల జరిమానా విధి౦చిన రష్యాలోని జిల్లా న్యాయస్థానం :
గూగుల్ పై 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్ల జరిమానా విధిస్తూ రష్యాలోని జిల్లా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా నిషేధించిన కంటెంట్ ను తొలగించడం లో గూగుల్ విఫలమైనందున ఈ జరిమానా విధించింది. నిషేధించిన కంటెంట్ ను తొలగించమని ఎన్ని సార్లు సూచించిన గూగుల్ పట్టించుకోక పోవడం తో టగాన్ స్కై జిల్లా న్యాయ స్థానం అడ్మినిస్ట్రేటివ్ ఫైన్ కింద 720 కోట్ల రూబెల్స్ (రూ750 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వుల్ని పరిశీలించి తదుపరి చర్యలను చేపట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గూగుల్ పై .750 కోట్ల జరిమానా విధి౦చిన రష్యాలోని జిల్లా న్యాయస్థానం
ఎవరు: రష్యా
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: డిసెంబర్ 25
దక్షిణాఫ్రికా మేటి వ్యక్తిగా భారత సంతతి వితరణశీలి డాక్టర్ ఇంతియాజ్ సూలిమా :
భారత సంతతి వితరణశీలి డాక్టర్ ఇంతియాజ్ సూలిమాను ఈ ఏడాది దక్షిణాఫ్రికా మేటి వ్యక్తిగా పురస్కారం లభించింది. ‘గిఫ్ట్ ఆఫ్ ది గివర్స్’ సంస్థ వ్యవస్థాపకుడైన ఆయన అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా మెవెరిక్ వార్తాపత్రిక ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు సంభవించినప్పుడు బాధితులకు సేవలు అందించడంలో ఇంతియాజ్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్, పాకిస్థాన్ సహా 44 దేశాల్లో ఇప్పటివరకు 26 కోట్ల డాలర్ల రూ.1960 కోట్లు సహాయక చర్యలు అందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణాఫ్రికా మేటి వ్యక్తిగా భారత సంతతి వితరణశీలి డాక్టర్ ఇంతియాజ్ సూలిమా
ఎవరు: డాక్టర్ ఇంతియాజ్ సూలిమా
ఎక్కడ:ఎప్పుడు: డిసెంబర్ 25
వాయు స్వాస్థ్య సేవ లను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి :
ఒడిశా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి వాయు స్వాస్థ్య సేవ (ఎయిర్ హెల్త్ సర్వీసెస్)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ పథకం కింద, స్పెషలిస్ట్ డాక్టర్లు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వారి సంబంధిత జిల్లా ప్రధాన ఆసుపత్రులలో చేరిన రోగులకు చికిత్స అందించబడతారు. కటక్, భువనేశ్వర్లకు చెందిన చాలా మంది ప్రముఖ వైద్యులు విధులపై ఈ జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ హెల్త్ సర్వీస్ ను ప్రారంభించింది.
- ఓడిశా రాష్ట్ర రాజదాని : భువనేశ్వర్
- ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి :నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ :గనేషి లాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: వాయు స్వాస్థ్య సేవ లను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎవరు: ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎక్కడ: ఓడిశా
ఎప్పుడు: డిసెంబర్ 26
మిసెస్ ఇండియాగా నిలిచిన తెలుగమ్మాయి మల్లికా బిల్లుపాటి :
విజయవాడ నగరా నికి చెందిన మల్లికా బిల్లుపాటి ‘ఇటీవల మిసెస్ ఇండియా’గా ఎంపికయ్యారు. రాజస్థాన్ లో ని ఉదయపూర్ పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 9వ సీజన్ (2021-22) మిసెస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా 24 మంది హాజరవగా, తుది విడతకు 12 మందిని : ఎంపిక చేశారు. ఈ నెల 23న జరిగిన పైనల్ లో మల్లికా బిల్లుపాటి విజేతగా నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మిసెస్ ఇండియాగా నిలిచిన తెలుగమ్మాయి మల్లికా బిల్లుపాటి
ఎవరు: మల్లికా బిల్లుపాటి
ఎప్పుడు: డిసెంబర్ 26
సుపరిపాలన సూచిలో మొదటి స్థానం లో నిలిచిన గుజరాత్ రాష్ట్రము :
దేశంలోని సుపరిపాలన సూచీలో గుజరాత్, మహారాష్ట్ర తొలి రెండు స్థానాలు పొందగా.తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 9, 10 స్థానాల్లో నిలిచాయి. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణలశాఖ రూపొందించిన సుపరిపాలన సూచీని (జీజీఎ) కేంద్ర హోంశాఖ మంత్రి అమితా విడుదల చేశారు. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. గ్రూప్-ఎలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హరియాణా,, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్-ఎలో గుజరాత్ గ్రూప్-బిలో మధ్యప్రదేశ్, ఈశాన్య పర్వత రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.
- గుజరాత్ రాష్ట్ర రాజదాని :గాంధీ నగర్
- గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి : భూపేంద్ర భాయ్ పటేల్
- గుజరాత్ రాష్ట్ర గవర్నర్ :ఆచార్య దేవ్ వ్రథ్
క్విక్ రివ్యు :
ఏమిటి: సుపరిపాలన సూచిలో మొదటి స్థానం లో నిలిచిన గుజరాత్ రాష్ట్రము
ఎవరు: గుజరాత్ రాష్ట్రము
ఎప్పుడు: డిసెంబర్ 26
వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (VIP)ను ప్రారంబించిన నీతి అయోగ్ :
నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) లో భాగంగా వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (VIP) అనే ను ప్రారంభించి౦ది. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గారు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు సాధికారత కల్పించాలనే ఆశయంతో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), NITI ఆయోగ్ తొలిసారిగా వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (VIP)తో ముందుకు తీసుకువచ్చింది, ఇది భారతదేశంలోని ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు ప్రాప్యతను కలిగిస్తుంది. భారత ప్రభుత్వంచే 22 షెడ్యూల్డ్ భాషలలో రూపొందించబడిన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ.
- నీతి అయోగ్ స్థాపన :జనవరి 01 2015
- నీతి అయోగ్ సియివో : అమితాబ్ కాంత్
- నీతి అయోగ్ చైర్ పర్సన్ :నరేంద్ర మోడి
క్విక్ రివ్యు :
ఏమిటి: వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (VIP)ను ప్రారంబించిన నీతి అయోగ్
ఎవరు: నీతి అయోగ్
ఎప్పుడు: డిసెంబర్ 26
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |