Daily Current Affairs in Telugu 24-06-2020
అంతరిక్షం లో ప్రైవేటు రంగం కు భాగస్వామ్య ఒప్పందం కు భారత ప్రభుత్వం ఆమోదం :
భారత అంతరిక్ష పరిశోదన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినేట్ జూన్ 24 న ఆమోదం తెలిపింది.ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యరమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లబించనుంది. ప్రదాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్ర గారు వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకుందుకు అనుసందాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ (సెంటర్ ఇన్స్పైస్) వ్యవహరిస్తుంది. భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ న్యు స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) వీలు కల్పిస్తుందన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతరిక్షం లో ప్రైవేటు రంగం కు భాగస్వామ్య ఒప్పందం కు భారత ప్రభుత్వం ఆమోదం
ఎవరు; భారత ప్రభుత్వం
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జూన్ 24
రష్యా దేశ 75 వ వార్షిక ఉత్సవ విక్టరీ పరేడ్లో పాల్గొన్న భారత సైనికులు :
భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరి డే అయిన 75 వ వార్షిక ఉత్సవ పరేడ్ లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని ఇవి తన కు సంతోష కరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా అధినేత పుతిన్ సమక్షంలో జరిగిన ఈ పరేడ్ కు రాజ్ నాథ్ గారు హాజరయ్యారు. 1941-1945 మద్య వీరోచితంగా జరిగిన యుద్దంలో సోవియెట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రష్యా విక్టరి పరేడ్ ఓ రష్యా సైనిక దళాలతో పాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17దేశాలకు చెందిన సైనికులు కూడా పాల్గొన్నారు.ఈ పరేడ్ ఏట మే 9 వ తేదిన నిర్వహిస్తారు.కరోనా కారణంగా ఈ సారి జూన్ లో నిర్వహంచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యా దేశ 75 వ వార్షిక ఉత్సవ విక్టరీ పరేడ్లో పాల్గొన్న భారత సైనికులు
ఎవరు; భారత సైనికులు
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: జూన్ 24
ఎం సిసి పీటం పై తొలిసారి అధిరోహించనున్న ఒక మహిళా :
233 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) కు తొలిసారి ఓ మహిళా అధ్యక్ష పీటం ను అధిరోహించనుంది.ఇంగ్లాండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ అయిన క్లేర్ కానర్ ఈ పదవికి చేపట్టనుంది. ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర వచ్చే ఏడాది నుంచి పదవి నుంచి దిగిపోయిన తరువాత కానర్ ఆ బాద్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎండి (మహిళల క్రికెట్) గా ఉన్న ఆమె పేరును అధ్యక్ష పదవి కోసం స్వయంగా సంగక్కరనే ప్రతిపాదించడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎం సిసి పీటం పై తొలిసారి అధిరోహించానున్న ఒక మహిళా
ఎవరు; క్లేర్ కానర్
ఎప్పుడు: జూన్ 24
ఉత్తరాఖండ్ క్రికెట్ జత్తూ ప్రదాన కోచ్ గా నియమితులయిన వసీం జాఫర్ :
క్రికెట్ టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వసీం జాపర్ ను ఉత్తరాఖండ్ జట్టు ప్రదాన కోచ్ గా నియంమితులయ్యారు. రెండు దశాబ్దాల పాటు దేశ వాలి క్రికెట్ లో అలరించిన జాఫర్ ఈ ఏడాది మార్చిలో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రధాన కోచ్ గా నియమితులవడం ఇదే తొలి సారి. ఆట గాడిగా కెరీర్ ముగిసిన వెంటనే కోచ్ గా మారుతున్న కొత్త బాద్యతలు నాకు సవాలే అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ క్రికెట్ జత్తూ ప్రదాన కోచ్ గా నియమితులయిన వసీం జాఫర్
ఎవరు; వసీం జాఫర్
ఎప్పుడు: జూన్ 24
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |