Daily Current Affairs in Telugu -21-11-2019
హైదరాబాద్ లో అమిటి విశ్వవిద్యాలయం
ప్రముక ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అమిటి వర్శిటీ హైదరాబాద్లో మరో విశ్వవిద్యాలయాన్ని స్తాపించనుంది. ఈ మేరకు అమిటి గ్రూప్ విద్యాశాఖ కు తాజా గా దరఖాస్తు చేసుకుంది. పస్తుతం ఈ సంస్థ ప్రదాన ప్రాంగణం నోయిడాలో ఉండగా ముంబాయి,పూనే ,కోలకత్త,పాట్న,రాయ్ పూర్,లఖనావు,రాంచి,తదితర దేశంలోని 10 నగరాల్లో అమిటి విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఉన్నాయి. కొత్తగా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ నడుపుతుంది.కేంద్ర ప్రబుత్వం ప్రతి సంవత్సరం ఇచే జాతీయ ర్యాంకింగ్ లో ఈ వర్శిటీ 100 లోపు స్థానంలో నిలుస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్ లో అమిటి విశ్వవిద్యాలయం
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: నవంబర్ 21
పోలీస్ కమాండ్ సెంటర్ కెసిఆర్ మానస పుత్రిక
హైదరాబాద్లో తెలంగాణా ప్రబుత్వం నిర్మిస్తున్న పోలిస్ కమాండ్ సెంటర్ యావత్ దేశం దృష్టి ని ఆకర్షిస్తుందని మంత్రి కేటిఅర్ నవంబర్ 21 న ట్వీటర్ లో వ్యాక్యలు చేశారు. ఇది మనోహర దృశ్యం కాదు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో దీన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పోలీస్ కమాండ్ సెంటర్ కెసిఆర్ మానస పుత్రిక
ఎవరు: కెసిఆర్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: నవంబర్ 21
కెనడా మంత్రులుగా నలుగురు భారతీయులు
కెనడా ప్రధానిగా మరోసారి బాద్యతలు చేపట్టిన జస్టిస్ ట్రూడో నలుగురు బారత సంతతి కి చెందిన వ్యక్తులకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అనిత ఆనంద్ (50),బర్దిష్ చగ్గర్(39),నవదేప్ బైన్స్(42),హర్షిత్ సజ్జన్(49) లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కెనడాలో మంత్రి పదవి చేపట్టిన తొలి హిందూ మహిళా అనిత కావడం విశేషం. మిగిలిన ముగ్గురు సిక్కులు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కెనడా మంత్రులుగా నలుగురు భారతీయులు
ఎక్కడ: కెనడా
ఎప్పుడు: నవంబర్ 21
నౌకాదళంలో తొలి మహిళా పైలట్
భారత నౌకాదళ తొలి మహిళా పైలట్ గా లెఫ్టినెంట్ శివంగి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకుంది. శిక్షణ పూర్తీ చేసుకొని డిసెంబర్ 2న ఆమె కోచిలో విధుల్లో చేరబోతున్నారు. శివంగి దొర్నియర్ విమానాలను నడపనున్నారు. ఆమె స్వస్తలం బీహార్లోని ముజఫరపూర్.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నౌకాదళంలో తొలి మహిళా పైలట్
ఎవరు: లెఫ్టినెంట్ శివంగి
ఎప్పుడు: నవంబర్ 21
అజీం ప్రేమ్ జి కి బిజినెస్స్ లీడర్షిప్ అవార్డ్
నాలుగేళ్ళకొకసారి మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఎంఎంఎ) అమల్గా మేషణ్ గ్రూప్ సంయుక్తంగా అందిస్తున్న బిజినెస్స్ లీడర్ షిప్ అవార్డ్ ని ఈ సంవత్సరానికి విప్రో అధినేత అజీం ప్రేమజి కి అందించారు. పలు రంగాల్లో ఉత్తమ కృషి కి గుర్తింపుగా ఈ పురస్కారం తో ఆయన్ను సత్కరించినట్లు అమల్గామేషణ్ గ్రూప్ చైర్మన్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. అమాల్గామేషణ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఎంఎంఎ మాజీ అద్యక్షుడు అనతక్రిష్ణన్ జ్ఞాపకార్తం ఈ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాదికి గాను నవంబర్21 న చెన్నై లో జరిగిన కార్యక్రమంలో అజీం ప్రేమ్ జి కి అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అజీం ప్రేమ్ జి కి బిజినెస్స్ లీడర్షిప్ అవార్డ్
ఎవరు: అజీం ప్రేమజి
ఎప్పుడు: నవంబర్ 21
ఇన్సులిన్ ను కనిపెట్టుకునే ప్రోటీన్
మదుమేహ వ్యాధి నియంత్రణ కు సెంటర్ ఫర్ సెలులార్ అండ్ మలికులర్ బయాలజీ (సిసిఎంబి) శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో కీలక పురోగతి లభించింది. శరీరానికి కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ క్రమబద్దికరించడంలో సేక్రతోగోగిన్ అనే ప్రోటీన్ ముక్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. ఈ ప్రోటీన్ పని తీరు ఆవిష్కరణ మదుమేహ చికిత్స లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం సూచిస్తుందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.స్తూలకాయంతో వస్తున్నా మధుమేహాన్ని ఇది నియంత్రిస్తుందని గుర్తించారు. ఈ ప్రోటీన్ జివ కణాల్లో వివిధ ఒత్తిళ్లు n తగ్గిస్తూ శరీరానికి కావాల్సిన మేరకు ఇన్సులిన్ ను విడుదల చేసేలా చూస్తుందని కనుగొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇన్సులిన్ ను కనిపెట్టుకునే ప్రోటీన్
ఎప్పుడు: నవంబర్ 21
డయేరియ నివారణకు టీకా :ప్రతిబావంతంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పరిశోధకులు
ప్రపంచ వ్యాప్తంగా ఏటా వేల మంది చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న డయేరియ (నీల్ల విరేచనాలు) కు అడ్డు కట్ట వేయగల సరికొత్త టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. చిన్నారుల్లో అది ప్రబవవంతంగా పని చేస్తుందని దాని వినియోగం సురక్షితమని బంగ్లాదేశ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో తేలింది. సాదరణంగా విషపూరిత ఇ- కోలి బాక్టీరియా కారణంగా డయేరియా వస్తుంది. దాన్ని నివారించే టీకా లేవి ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నేపద్యం లో స్వీడన్ లో ని గుతెన్ బెర్గ్ విశ్వవిద్యాలయం పరిశోద కులతో కూడిన బృందం “ఎటాక్స్” అనే టీకాను అబివృద్ది చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డయేరియ నివారణకు తేకా :ప్రతిబావంతంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పరిశోధకులు
ఎక్కడ: స్వీడన్ లో
ఎప్పుడు: నవంబర్ 21
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
హర్యానా నమూనాలోనే ఆంధ్రప్రదేశ్ నైపున్యాబివ్రుద్ది విశ్వ విద్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పాటు చేయ తలపెట్టిన నైపున్యాబినృద్ది విశ్వవిద్యాలయానికి హరియనలోని విశ్వకర్మ నైపుణ్య వర్శిటీ నమూనాను ఎంచుకున్నారు.రాజస్థాన్ లోని భారతీయ హర్యానా లోని విశ్వ కర్మ ,ఓడిశాలోని సెంచూరియన్ వర్శిటీ లను పరిశీలించిన రాష్ట్ర నైపుణ్యా అబివృద్ది సంస్థ అధ్యన బృందం చివరకు హర్యానా నమూనా వైపు మొగ్గు చూపింది. రాజస్థాన్లోని స్వచంద సంస్థ ,ఓడిశాలోని ప్రైవేటు సంస్థ వర్శిటీ లకు నిర్వహిస్తుండగా హరియాన లో ప్రభుత్వ సహకారం తో కొనసాగుతోంది. విశ్వకర్మ ప్రబుత్వ ఆద్వర్యంలో కొనసాగడం పరిశ్రమలతో ఒప్పందాలు డిప్లొమా,డిగ్రీ లు ఇస్తున్నందున ఈ విదానంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అబిప్రాయపడింది..
క్విక్ రివ్యూ:
ఏమిటి: హర్యానా నమూనాలోనే ఆంధ్రప్రదేశ్ నైపున్యాబివ్రుద్ది విశ్వ విద్యాలయం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 21
కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా సంస్థ వేటింగ్ హౌస్ దివాలా ప్రమాదం నుంచి బయటపడిందని ఇకపై ఈ విద్యత్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతుందని కేంద్ర అను ఇందన శాఖ మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. 2006 లో బారత్ అమెరికా మద్య కుదురిన పౌర అను ఒప్పందం ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని నవంబర్ 21 న రాజ్యసభలో అడిగిన ఓ లికిత పూర్వక ప్రశ్నకు సమాదానమిచ్చారు. అను విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన బూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు,స్థలపరిశీలన ,సాంకేతిక వాణిజ్య సంప్రతింపులు పురోతిలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం
ఎక్కడ: కొవ్వాడ(ఆంధ్రప్రదేశ్)
ఎప్పుడు: నవంబర్ 21
భారతమ్మ బృందానికి ఐఎల్ఎఫ్ అవార్డ్
కుష్టు బాదితులు వారి కుటుంబాల ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన ససకావ –ఇండియన్ లెప్రసీ ఫౌండేషన్ (ఐఎల్ఎఫ్) ఆధ్వర్యంలో రైజింగ్ టు డిగ్నిటీ -2019 అవార్డ్ లు అందజేశారు. నవంబర్ 21 న నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లెప్రసీ కాలనికి చెందిన భారతమ్మ బృందానికి అవార్డ్ దక్కినధి. ముక్య అతిథిగా హాజరైన మహాత్మా గాంధి మనవడు రాజ్ మోహన్ గాంధి అవార్డ్ తో పాటు లక్ష రూ. నగదు బహుమతిని బారతమ్మ బృందానికి అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారతమ్మ బృందానికి ఐఎల్ఎఫ్ అవార్డ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 21
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |