
Daily Current Affairs in Telugu 24-02-2020
రచయిత్రి పి.సత్యవతి కి సాహిత్య అకాడమి అవార్డు:

ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి పోచిరాజు సత్యవతికి కేంద్రసాహిత్య అకాడమి 2019 అనువాద అవార్డు దక్కింది.జనవరి 1 ,2013నుంచి డిసెంబర్ 2017 వరకు అనువాదం చేసిన పుస్తకాల్లో వివిద భాషలకు చెందిన 23 మంది రచయితలను జ్యూరి సబ్యులు కేంద్ర సాహిత్య అకాడమి 2019 అనువాద అవార్డులకు ఎంపిక చేసినట్లు అకాడమి కార్యదర్శి కే.శ్రీనివాస రావు ఫిబ్రవరి 24 న ఒక ప్రకటన విడుదల చేశారు.విజేతలకు రూ.50వేల నగదు తామర పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.ఎ.రేవతి రచించిన “ది ట్రూత్ ఎబౌట్ మీ :ఎ హిజ్ర లైఫ్ స్టొరీ “ని సత్యవతి “ఓ హిజ్ర ఆత్మకథగా” తెలుగులోకి అనువాదం చేసిన ఆమెకి సాహిత్య అకాడమి అనువాద పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: రచయిత్రి పి.సత్యవతి కి సాహిత్య అకాడమి అవార్డు:
ఎవరు: రచయిత్రి పి.సత్యవతి
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు:ఫిబ్రవరి 24
టీసిఎస్ కు ఇన్ఫియాన్ బెస్ట్ సప్లయర్ అవార్డు :

టాటా కన్సల్తేన్చి సర్వీసెస్ (టిసిఎస్)కు 2018-19 సంవత్సరానికి సెమి కండక్టర్ సోల్యుషన్ లో అగ్రగామి సంస్థ అయిన ఇన్ఫియాన్ టెక్నాలజీస్ ఎజి,నుంచి బెస్ట్ సప్లయర్ అవార్డు (ఐటిఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ )లబించింది.టిసిఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న జర్మనీలో ని ఫ్రాంక్ ఫర్డ్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.గత మూడేళ్ళ లో టిసిఎస్ ఈ అవార్డును గెలుచు కోవటం ఇది రెండవసారి .టిసిఎస్ 2008 నుంచి ఇన్ఫియాన్ తో వ్యూహాత్మక భాగస్వామిగా పనిచేస్తోంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: టీసిఎస్ కు ఇన్ఫియాన్ బెస్ట్ సప్లయర్ అవార్డు
ఎవరు: టీసిఎస్
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు ఫిబ్రవరి 24:
ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ,లారిస్ ల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మ అవార్డులు:

హైదరాబాద్ కు చెందిన రెండు ఫార్మ కంపెని లకు ఈ ఏడాది ఇండియా ఫార్మా అవార్డులు లబించాయి.ఇందులో ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ,లారిస్ ల్యాబ్స్ ఉన్నాయి.ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ కు ఇండియన్ “ఫార్మా బల్క్ డ్రగ్ కంపెని ఆఫ్ ది ఇయర్ “అవార్డు రాగా లారిస్ ల్యాబ్స్ ఇండియన్ ఫార్మా” ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్” ఆవార్డు గెలుచుకుంది.ఈ అవార్డులను విజేతలకు మార్చ్ నెల 5వ తేదిన అహ్మాదాబాద్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రబుత్వం ఆరోగ్య శాఖ మంత్రి సదానంద గౌడ బాహుకరిస్తారు.దేశీయ ఔషద ,వైద్య ఉపకరణాల తయారి కంపెనీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రబుత్వం లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మా సుటికల్స్ గత అయిదేళ్ళ నుంచి ఏటా ఈ అవార్డులు అందజేస్తోంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఎస్ ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ,లారిస్ ల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మ అవార్డులు
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 24
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట రెడ్డి ఐదో సారి ఎన్నిక:

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తెలంగాణా ఆవిర్భావం నుంచి ఆయనే పార్టీ రాష్ట్ర కార్య దర్శిగా వ్యవహరించనున్నారు.ప్రస్తుతం అయిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మూడు రోజుల పాటు జరుగుతున్న సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఫిబ్రవరి 24ముగిసాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట రెడ్డి ఐదో సారి ఎన్నిక
ఎవరు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట రెడ్డి
ఎప్పుడు:ఫిబ్రవరి 24
ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు కు జాతీయ అవార్డు :

వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనుర్ సహకార గ్రామీన పరపతి సంఘానికి జాతీయ అవుట్ లుక్ వార్తా పత్రిక జాతీయ అవార్డు ను ప్రకటించింది.ఫిబ్రవరి 24 డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ చేతుల మీదుగా సంఘం అద్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈ పురస్కారం ను అందుకున్నారు.వ్యవసాయ రంగంలో అత్యన్నత ప్రగతి సాధిస్తున్న సంఘాలకు అవుట్ లుక్ వ్యవసాయ కాన్ క్లేవ్ ,స్వరాజ్ అవార్డు 2020 పేరిట ఏటా ఈ పురస్కారాలను అందజేస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ములకనూర్ సహకార గగ్రామీణ బ్యాంకు కు జాతీయ అవార్డు
ఎక్కడ:వరంగల్
ఎప్పుడు: ఫిబ్రవరి 24
ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ కు ఆథిత్యం ఇవ్వనున్న డిల్లి:

ప్రదాని మోది ప్రసంగించిన అంతర్జాతీయ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ కు న్యుడిల్లి ఆథిత్యం ఇచ్చింది.”జెండర్ జస్ట్ వరల్డ్” అనే ఇతివ్ర్తుత్తంతో ఈ సమావేశం జరిగింది.వన్డే కాన్ఫరెన్స్ అంశం న్యాయ వ్యవస్థ మరియు మారుతున్న ప్రపంచం సైనిక సేవలో మహిళల నియామకం ,ఫైటర్ పైలట్ల ఎంపిక ప్రక్రియలో మార్పులు ,గనులలో రాత్రి పని చేసే స్వేచ్చతో సహా లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి భారత ప్రబుత్వం చేసిన మార్పులు గురించి ఈ సమావేశంలో చర్చించబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ కు ఆథిత్యం ఇవ్వనున్న డిల్లి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు:ఫిబ్రవరి 24
మలేసియ ప్రదాని మహతీర్ రాజీనామా :

మలేసియాలో జరుగుతున్న పరిణామా దృష్ట్యా ఆదేశ ప్రదాని మహతీర్ మహమ్మద్ అనూహ్యంగా ఫిబ్రవరి 24 న తన పదవికి రాజీనామా చేశారు.దీంతో రాజకీయంగా గంధర గోల పరిస్థితులు నెలకొన్నాయి.అన్వర్ ఇబ్రహీం ను అధికారంలో రాకుండా అడ్డుకునెందుకు గాను ఆయన కొత్త సంకేర్న ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం .2018 లో చారిత్రిక విజయం సాధించిన ఫ్యాక్ట్ ఆఫ్ హాఫ్ సంక్కీర్ణం లోని కొందరు గత కొన్ని రోజులుగా అన్వర్ ఇబ్రహీం కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు .మహతీర్ మహమ్మద్ ,అన్వర్ ల మద్య విబేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నపటికీ 2018 లో వారిరివురు చేతులు కలిపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రబుత్వాన్ని గద్దె దించారు.అధికార పగ్గాలు అన్వర్ కు అప్పగిస్తామని మహతీర్ ఎన్నికల కంటే ముందే హామీ ఇచ్చినప్పటికి అది ఈపుడు ఆన్నది నిర్దిష్టంగా తెలపలేదు .మహతీర్ రాజీనామా కంటే ముందు బేషరతు పార్టీ అధకార సంకీర్న కూటమి నుంచి వైదోలగాతున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మలేసియ ప్రదాని మహతీర్ రాజీనామా
ఎవరు: ప్రదాని మహతీర్
ఎక్కడ: మలేసియ
ఎప్పుడు: ఫిబ్రవరి 24
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |