Daily Current Affairs in Telugu -20-11-2019
రాష్ట్ర రాజదానిలో ఇరిపెం శిక్షణ కేంద్రం:
రైల్వె శాఖలో ఓ కీలకమైన శిక్షణ సంస్థ హైదరాబాద్ లో కొలువుథేరనుంది. రూ60.46 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇండియన్ రైల్ల్వేస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఇరిపెం) నిర్మాణం దాదాపు పూర్తయింది. ఆర్ధిక పరమైన అంశాల్లో సూపర్వైజేర్ నుంచి ఐఆర్ఎ టిస్ స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ తరహ లో దేశంలో ఏర్పాటవనున్న మొట్ట మొదటి శిక్షణ కేంద్రం ఇదేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ లోని మౌలాలి లోని డిజిల్ లోకో షెడ్ ఎదురుగా ఇరిఫెం శిక్షణ కేంద్రం ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రాష్ట్ర రాజదానిలో ఇరిపెం శిక్షణ కేంద్రం
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: నవంబర్ 20
పీఎస్ఎల్వి సి-47 ప్రయోగం వాయిదా :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లాలోని బారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 25 న తలపెట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-47 ప్రయోగం వాయిదా పడింది. అదే తిరిగి 27 న ప్రయోగానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. వాహక నౌక లోని విబి సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలకు అనుమానం రావడం తో ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎస్ఎల్వి సి-47 ప్రయోగం వాయిదా
ఎక్కడ:నెల్లూర్
ఎవరు: ఇస్రో
ఎప్పుడు: నవంబర్ 20
కాకినాడలో బారత్ -అమెరికా త్రివిద దళాల విన్యాసాలు.:
సాగర తీరంలో బారీ యుద్దనౌక ల మోహరింపు నింగిలో హెలికాప్టర్ల చక్కర్ల నేలపై బారత్ , అమెరికా సైనికుల పహారా నవంబర్20 న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో సాగర తీరం లో ఆవిష్కృతమైనది ఈ దృశ్యం . బారత్ –అమెరికా తొలి సారిగా త్రివిద దళాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ టైగర్ ట్రయంప్ “ కార్యక్రమం ఆకట్టుకుంది. తుపాన్లు ,టోర్నడోలు, సునామి, భూకంపాలు, వంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఎలా స్పందించాలో నవంబర్ 20 న కసరత్తు చేశారు.ఈ నెల 13 నుంచి 16 వరకు విశాఖ హర్బెర్లో సాగిన విన్యాసాలు 17 నుంచి 21 వరకు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కాకినాడలో బారత్ ,అమెరిక త్రివిడ దళాల విన్యాసాలు
ఎక్కడ: కాకినాడ
ఎవరు: భారత్ – అమెరిక
ఎప్పుడు: నవంబర్ 20
జపాన్ ప్రదాని షింజో అబె రికార్డు :
జపాన్ చరిత్రలో సుదీర్గ కాలం సేవలు అందించిన ప్రధానిగా షింజో అబే నిలిచిపోనున్నారు. ఆయన ప్రధానిగా బాద్యతలు స్వీకరించి నవంబర్ 20 నాటికి 2887 రోజులు పూర్తింది. గత ప్రదాని తారో కట్సుర రికార్డును షింజో అబే అధిగమించారు. తారో కట్సుర 1901 -1913 మద్య మూడు సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జపాన్ ప్రదాని షింజో అబే రికార్డు
ఎక్కడ: జపాన్
ఎవరు: షింజో అబే
ఎప్పుడు: నవంబర్ 20
గురుగ్రహ చందమామ ఫై నీటి ఆవిరి ఉందని గుర్తించిన నాసా :
గురుగ్రహ చందమామ “యూరోపా” పై దట్టమైన మంచు పలకం దిగువన ద్రవరూప మహాసముద్రం ఉందని సిద్దాంతాన్ని బలపరచే అదారాన్ని అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా శాస్త్రవేత్తలు సేకరించారు. యురోపా ఉపరితలంపై నీటి ఆవిరి ని తొలిసారి గా గుర్తించారు. హవాయి లోని డబ్లు ఎం.కేక్ అబ్సేర్వటేరి ద్వారా జరిపిన పరిశోదనలో ఆ నీటి ఆవిరి ఉనికిని నిర్తారించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గురుగ్రహ చందమామ ఫై నీటి ఆవిరి ఉందని గుర్తించిన నాసా
ఎక్కడ: అమెరికా
ఎవరు: నాసా
ఎప్పుడు: నవంబర్ 20
దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక భారతియులందరికి ఇందులో స్థానం:
దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్ -ఎన్.ఆర్.సి.) రూపకల్పన జరగనునదని కుల, మతాలకు అతీతంగా ఈ దేశ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం ఉంటుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చెప్పారు. నవంబర్ 20 న ఆయన రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పౌర సత్వ సవరణ బిల్లుతో ఎన్.అర్.సి ప్రక్రియ జరిగిందని దేశవ్యాప్తంగా మొదలు పెట్టినపుడు అక్కడ మరోసారి ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. పౌర పట్టిక లో అందర్నీ చేర్చే వ్యవస్థ ఉన్నందున దాని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక బరతియులందరికి ఇందులో స్థానం
ఎక్కడ: ఢిల్లీ
ఎవరు: అమిత్ షా
ఎప్పుడు: నవంబర్ 20
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఫార్చున్ వ్యాపారవేత్తల జాబితాలో సత్యనాదేల్ల మొదటిస్థానం:
ఫార్చున్ వెల్లడించిన బిజినెస్ పర్సన్ అఫ్ ది ఇయర్ -2019 జాబితాలో మైక్రో సాఫ్ట్ సి.ఇ.ఓ సత్యనదేళ్ళ అగ్ర స్థానంలో నిలిచారు. మాస్టర్ కార్డు సి.ఇ.ఓ అజయ్ బంగా ,అరిస్తా అధిపతి జయశ్రీ ఉల్లాల్ లు కూడా ఈ జాబితాలో చోటు లబించింది.. సత్య నాదెళ్ళ తో పాటు బంగా ,ఉల్లాల్ లు కూడా బారత సంతతికి చెందిన వ్యక్తులు కావడం విశేషం. అసాద్యమైన సవాళ్ళను ఎదుర్కొని వినూత్న పరిష్కారాలు కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఈ జాబితాకు ఎంపిక చేసినట్లు ఫార్చున్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఫార్చున్ వ్యాపారవేత్తల జాబితాలో సత్యనాదేల్ల మొదటిస్థానం
ఎక్కడ: న్యూయార్క్
ఎవరు: సత్యనాదేళ్ళ
ఎప్పుడు: నవంబర్ 20
రెండేళ్లలో ఇమేజ్ టవర్స్ –“ఇండియా జాయ్ 2019” లో కేటిఆర్ వెల్లడి:
అంతర్జాతీయంగా యానిమేషన్,గేముంగ్,వి.ఎఫ్.ఎక్స్. పరిశ్రమలకు తెలంగాణా హబ్ గా మారబోతుందని మంత్రి కేటిఅర్ అన్నారు. ప్రబుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూలమైన విదానాలతో పాటు ఇక్కడ కల్పించిన ప్రపంచ స్థాయి మౌలిక వసతులు , అపారమైన మానవ వనరుల కారణంగా ఇది సాద్యమవుతుందని చెప్పారు. యానిమేషన్ గేమింగ్, పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యం తో ప్రబుత్వం రూ 1000 కోట్ల పెట్టుబడితో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమేజ్ టవర్స్ నిర్మాణం చేపట్టిందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిత మవుతున్న ఇమేజ్ టవర్స్ 2022 నాటికీ అందుబాటులోకి వస్తుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రెండేళ్లలో ఇమేజ్ టవర్స్ –“ఇండియా జాయ్ 2019” లో కేటిఆర్ వెల్లడి
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: కేటిఆర్
ఎప్పుడు: నవంబర్ 20
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |