
Daily Current Affairs in Telugu 10-03-2020
గాప్ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం :

ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 186వ స్థానాల్ల్లో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అయిన గాప్ ఇంక్ సియివో గా భారత సంతతి మహిళ సోనియా సింఘాల్ నియమితులయ్యారు. గాప్ ఇంక్ లో 2004 లో చేరిన 49 ఏళ్ల సింఘాల్ గ్రూప్ లో ఓల్డ్ నేవీ సియివో గా గాప్ ఇంక్ యూరప్ ఎండి గా ఉన్నారు.అంతకు ముందు సంస్థ మైక్రో సిస్టమ్స్ పోర్ట్ మోటార్స్ లో 15 ఏళ్ల పాటు పనిచేశారు. భారత్ లో పుట్టి సింఘాల్ కుటుంబం ఆమె చిన్నతనంలోనే కెనడా కు తర్వాత అమెరికాకు వెళ్ళింది.సింఘాల్ కెట్టరింగ్ వర్సిటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ , స్తాన్ ఫోర్డ్ వర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. గాప్ ఇంక్ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ల డాలర్లు అమెరికాలో సహా విదేషలో 3,722 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగుల పనిచేశారు.ఫార్చ్యూన్ 500 కంపెనిలలో ఎన్నడు లేని విధంగా అత్యధికంగా 33మంది మహిళలు ప్రస్తుతం సియివో లు గా ఉన్న్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : గాప్ ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం
ఎవరు: సోనియా సింఘాల్
ఎప్పడు: మార్చ్ 10
ఎస్.బి.ఐ సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) చీఫ్ ఫైనాన్సియల్ ఆఫిసర్ గా చలసాని వెంకట నాగేశ్వర్ అదనపు బాద్యతలు చేపట్టారు.ప్రస్తుతం ఈయన ఎస్బిఐ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఇక నుంచి చలసాని ఎస్.బి.ఐ డిప్యుటీ ఎండి .సిఎఫ్ ఓ గా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తారని బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ కు అందించిన సమాచారంలో బ్యాంక్ పేర్కొంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఎస్.బి.ఐ సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం
ఎవరు: వెంకట నాగేశ్వర్
ఎప్పడు: మార్చ్ 10
G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తగ్గిస్తుంది.- మూడిస్ సంస్థ:

మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ 2020 లో జి-20 దేశాలు 2.1%పెరుగుతాయని అంచనా వేసింది.మూడి స్ మునుపటి అంచనా కంటే 0.3 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.కరోనా వైరస్ యొక్క ప్రపంచ వ్యాప్తి వల్ల ఏక కాలంలో సరఫరా మరియు డిమాండ్ షాక్ లు వస్తున్నాయి.ప్రపంచ మాంద్యం ప్రమాదాలు పెరిగాయని కూడా ఇది హెచ్చరించింది.గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి భాగంలో 2020 ఈ షాక్ లను బౌతికంగా మందగించే ఆర్ధిక కార్యకలాపాలను ఆశిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తాగ్గిస్తుంది.- మూడి స్
ఎవరు: మూడి స్
ఎప్పడు: మార్చ్ 10
కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హన్స్ రాజ్ బరద్వాజ్ గారు గుండె పోటుతో మరణిచారు.హన్స్ రాజ్ బరద్వాజ్ వయసు 83 సంవత్సరాలు .హన్స్ రాజ్ బరద్వాజ్ హర్యానలోని రోహ్తక్ జిల్లాలోని గార్హి సంప్ల్లా గ్రామంలో జన్మించారు.అతను ఏప్రిల్ 1982 నుండి జూన్ 2009 వరకు ఐదు సార్లు రాజ్య సభ సబ్యుడిగా ఉన్నారు.రాజీవ్ గాంధీ ,పివి మంత్రి వర్గాల్లో న్యాయ శాఖ సహాయ మంత్రిగా ,యుపిఎ హయంలో కేబినేట్ మంత్రిగా పదవులు చేపట్టారు.2009 నుంచి 2014 వరకు కర్ణాటక గవర్నర్ గా కూడా పనిచేసారు .
క్విక్ రివ్యు:
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత
ఎవరు: కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్
ఎప్పడు:మార్చ్ 10
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్ :

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరికోం టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.మార్చ్ 10 ఆసియా లో బాక్సింగ్ క్వాలిఫైర్ మహిళా 51కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ లో మేరి 5-0 తో ఐరిస్ మాగ్నో (ఫైలిఫ్ఫిన్స్) ను ఓడించింది. ఫైనల్లో స్థానం కోసం ఆమె యుం చాంగ్ (చైనా)తో తలపడనుంది.60కేజీల క్వార్టర్స్‌లో సిమ్రత్ జిత్ కౌర్ 5-0 తో సుమున్ (మంగోలియా) పై గెలిచి టోక్యో కే వెళ్లనున్నాడు.52 కేజీల క్వార్టర్ స్లో అతను 4-1 తో కార్లో ఫాలం (ఫైలిఫ్ఫిన్స్)పై నెగ్గాడు .మరో భారత కుర్రాడు మనిష కోశిక్ (63కేజీలు) 2-3 తో చిన్ జోరింగ్ (మంగోలియా) చేతిలో ఓడినప్పటికి రెండు ఒలింపిక్ స్థానాల కోసం నలుగురు క్వార్టర్ ఫైనల్ పరాజితులు పోటీ పడుతున్న నేపద్యంలో అతడికి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించడానికి అవకాశం ఉంది.మేరికోం ,అమిత్ ,సిమ్రాన్ ల కంటే ముందు వికాష్ కృష్ణన్ ,పుజారాణి ,సతీష్ కుమార్ ,లవ్లీనా ,ఆశిష్ కుమార్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్
ఎక్కడ:జోర్డాన్
ఎవరు:మేరికోం.అమిత్
ఎప్పడు:మార్చ్ 10
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |