Daily Current Affairs in Telugu 17&18-07-2021
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియామకం :
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిస్తున్నట్టు జులై 18 న పార్టీ అధిష్టానం ప్రకటించింది.. వివిధ వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా. నియమించింది పవన్ గోయల్, సుఖ్వీం దర్ సింగ్ డానీ, సంగత్ సింగ్ గల్గియాన్ లకు ఈ పదవులు దక్కాయి. ఈ మేరకు పార్టీ సంస్థా గత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణు గోపాల్’ ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియామకం
ఎవరు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు : జులై 17
బ్రిటిష్ గ్రాండ్ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్ :
ప్రపంచ నంబరవన్ లూయిస్ హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. తన సొంతగడ్డపై జరిగిన బ్రిటిష్ గ్రాండ్ టైటిల్ ను అతడు సొంతం చేసుకున్నాడు. జులై 18 న జరిగిన తుది పోరులో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ అగ్రస్థానంలో నిలిచాడు. లీక్లార్క్ (ఫెరారీ), బొటాస్ (మెర్సిడెజ్) రెండు, మూడు స్థానాలు సాధించారు. అయితే ఈ రేసులో మాక్స్ వెరెపెన్ ను ఢీకొనడంతో హామిల్టన్ కు 10 సెకన్ల పెనాల్టీ పడింది. అయినా కూడా పుంజుకుని గెలవడం విశేషం. బ్రిటీష్ గ్రాండ్ గెలవడం అతడికిది ఎనిమిదోసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటిష్ గ్రాండ్ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎప్పుడు : జులై 18
అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడిగా సంతోష్ జార్జ్ :
కేరళకు. చెందిన ప్రసిద్ధ పర్యటకుడు సంతోష్ జార్జ్ కులంగర అంతరిక్ష యాత్రకు వెళ్లను న్నారు. ఇందుకు అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో టికెట్ బుక్ చేసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి బండ్ల శిరీష సహా పలువురు దిగ్విజయంగా అంతరిక్షయాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తరహా యాత్రలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో సంతోష్ రోదసియాత్ర చేయన న్నారు. కాగా ఇది కొద్ది నెలల్లో అది జరుగుతుంది. ఇందుకోసం 2.5 లక్షల డాలర్ల (రూ.1.8 కోట్లు)ను ఆయన వ్యయం చేయనున్నారు. దీంతో టికెట్ కొని రోదసియాత్ర చేసిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. తనతో పాటు ఓ కెమెరానూ తీసుకెళ్లనున్నట్లు సంతోష్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాలీల తరపున ఈ యాత్రను చేపడుతున్నానని పేర్కొన్నారు. ‘సంచారం’ పేరుతో యాత్రా విశేషాలను వివరించే కార్యక్రమాన్ని సంతోష్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు. ఇప్పటివరకు 24 ఏళ్ల వ్యవధిలో 130కి పైగా దేశాలను తిరిగి వచ్చారు. 2007 నుంచి అంతరిక్ష యాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడిగా సంతోష్ జార్జ్
ఎవరు: సంతోష్ జార్జ్
ఎప్పుడు : జులై 18
సిరియా దేశ అధ్యక్షునిగా బషర్ అసద్ ప్రమాణ స్వీకారం :
యుద్ధభూమిగా మారిన సిరియా దేశ అధ్యక్షునిగా బషర్ అసద్ జులై 17 న ప్రమాణ స్వీకారం. చేశారు. అధ్యక్షుని పదవీ కాలం ఏడేళ్లు కాగా, ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా నాలుగో సారి. 2000 నుంచి ఆయనే అధికారంలో ఉంటున్నారు. 1970లో ఆయన తండ్రి హఫెజ్ సైనిక తిరుగుబాటు ద్వారా అధి కారం దక్కించుకున్నారు. 2000లో ఆయన మరణించడంతో అసద్ అధ్యక్షుడయ్యారు. మే నెలలో జరిగిన ఎన్ని కల్లో ఆయన 951 శాతం ఓట్లు పొంది ఘన విజయం సాధించారు ఇదంతా అక్రమమని విపక్షాలు విమర్శించిన గత పదేళ్లుగా’ దేశంలో యుద్ధం జరుగుతునే ఉంది. 2011లో ప్రతిపక్షాలు జరిపిన శాంతియుత ప్రదర్శ నలపై ప్రభుత్వం విరుచుకుపడడం అంతర్యుద్ధానికి దారి తీసింది. అసద్ కు రష్యా, ఇరాన్లు, విపక్షాలకు అమెరికా దేశాలు మద్దతు ఇస్తున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: సిరియా దేశ అధ్యక్షునిగా బషర్ అసద్ ప్రమాణ స్వీకారం
ఎవరు: బషర్ అసద్
ఎక్కడ: సిరియా దేశం
ఎప్పుడు : జులై 18
, విశ్వ హిందూ పరిషత్ అద్యక్షుడిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్ సింగ్ ఎంపిక :
వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్ సింగ్ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) కొత్త అధ్యక్షు డిగా ఎంపికయ్యారు. బిహార కు చెందిన ఈయన కొన్నేళ్లుగా సంస్థ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వీహెచ్వీ ప్రస్తుత అధ్యక్షులు విష్ణు సదాశివ్ (82): స్థానంలో ఆర్.ఎన్. సింగ్ను జులై 17 న ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నట్లు సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ వెల్లడించారు. ప్రధాన కార్యదర్శిగా మిలింద్ పరాందే. మరోసారి ఎన్నికయ్యారు. సామాజిక, వైద్య రంగాల్లో విశేష సేవలు అందించిన నారాయణ్ సింగ్ 2010లో కేంద్ర ప్రభుత్వం నుంచి, పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. వీహెచ్పీ గవర్నింగ్ కౌన్సిల్, ట్రస్టీల మండలి రెండు రోజుల సమావేశాలు శని వారం ఫరీదాబాద్ లో ప్రారంభమయ్యాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: విశ్వ హిందూ పరిషత్ అద్యక్షుడిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్ సింగ్ ఎంపిక
ఎవరు: రవీంద్ర నారాయణ్ సింగ్
ఎప్పుడు : జులై 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |