
Daily Current Affairs in Telugu 13-07-2021
నేపాల్ దేశ ప్రధాన మంత్రిగా షేర్ బహదూర్ దేవ బ ప్రమాణ స్వీకారం :

నేపాల్ దేశ ప్రధానమంత్రిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐన షేర్ బహదూర్ దేవ్ బా (75) జులై 13 న ప్రమాణం చేశారు. ఆయన ప్రధాని పీఠ౦ ఎక్కడం ఇది ఐదోసారి. నేపాల్లో పార్లమెంటులో ప్రతినిధుల సభను పునరుద్ధరిం చిన సుప్రీం కోర్టు.ప్రధానిగా దేవ్ బా ను నియమించాలంటూ ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారి. దేవ్ బా ను ప్రధానిగా నియమించారు. ఆయన 30 రోజుల్లోగా విశ్వాస పరీక్ష నెగ్గాల్సి ఉంటుంది. దేవ్ బా ను ప్రధానిగా నియమిస్తూ దేశాధ్యక్షురాలు ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టంగా లేకపోవడంతో తొలుత కొంతసేపు గందరగోళం నెలకొంది. రాజ్యాంగంలోని 76(5) ఆర్టికల్ ప్రకారం దేవ్ బా కు ప్రధాని పగ్గాలను అప్పగించాలని సుప్రీం కోర్టు సోమ వారం సూచించింది. ఆ ఆర్టికల్ను అధ్యక్షురాలు ప్రస్తా వించకపోవడాన్ని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: నేపాల్ దేశ ప్రధాన మంత్రిగా షేర్ బహదూర్ దేవ బ ప్రమాణ స్వీకారం
ఎవరు: షేర్ బహదూర్ దేవ బ
ఎక్కడ: నేపాల్ దేశం
ఎప్పుడు: జులై 13
భారత జిమ్నాస్టిక్స్ జడ్జి గా దీపక్ కాబ్రా ఎంపిక :

భారత జిమ్నాస్టిక్స్ జడ్జి దీపక్ కాబ్రా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో జడ్జిగా వ్యవహరించనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నాడు. టోక్యో క్రీడల్లో పురుషుల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపక్ కాబ్ర జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నిరుడు మార్చిలో ఆహ్వానం అందింది. కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఏడాది పాటు ఆత్రుతగా ఎదురు చూడాల్సొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో మరోసారి పిలుపొచ్చింది. అయితే కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఒలింపిక్స్ పై ఇప్పటికీ అనిశ్చితి ఉంది. ఏదేమైనా ఒలిం పిక్స్ స్వప్నం సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉంది” అని దీపక్ తెలిపాడు
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత జిమ్నాస్టిక్స్ జడ్జి గా దీపక్ కాబ్రా ఎంపిక
ఎవరు: దీపక్ కాబ్రా
ఎప్పుడు: జులై 13
టెక్ దిగ్గజం సిస్కో భారత్ ప్రెసిడెంట్ గా డైసి చిట్టిలపల్లి బాద్యతలు :

టెక్ దిగ్గజం సిస్కో భారత్, సార్క్ భారత్, సార్క్ దేశాల ప్రెసిడెంట్ గా డైసీ చిట్టిలపల్లికి పదోన్నతి కల్పించింది. ప్రస్తుత ప్రెసి సమీర్ గర్డ్ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి డైసీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. డైసీ చిట్టిలపల్లికి టెక్నాలజీ పరిశ్రమలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సిస్కోలోనే 17 ఏళ్ల పాటు పలు నాయకత్వ పదవులు నిర్వహించారు. భారత్. సార్క్ దేశాల్లో కంపెనీ వ్యూహాలు, అమ్మకాలు. కార్యకలాపాలు, దీర్ఘకాలంలో వృద్ధికి పెట్టుబ డులు వంటి వాటిని డైసీ పర్యవేక్షిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: టెక్ దిగ్గజం సిస్కో భారత్ ప్రెసిడెంట్ గా డైసి చిట్టిలపల్లి బాద్యతలు
ఎవరు: డైసి చిట్టిలపల్లి
ఎప్పుడు: జులై 13
భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీని నియామకం :

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ మేయర్ గా పని చేస్తున్న ఎరిక్ గార్సెటీని భారత్ లో అమెరికా రాయబారిగా నియమించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖరారు చేశారు. సెనేట్ ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తే భారత్ లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం భారత్ లో అమెరికా రాయబారిగా ట్రంప్ ప్రభుత్వం నియమించిన కెనెత్ జస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 50 ఏళ్ల ఎరిక్. దాదాపు 12 ఏళ్ల పాటు లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నారు డెమొక్రటిక్ పార్టీకి చెందిన 50 ఏళ్ల ఎరిక్ దాదాపు 12 ఏళ్ల పాటు లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నారు. అందులోనూ ఆరేళ్ల పాటు కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2013 నుంచి లాస్ ఏంజెల్స్ నగర మేయర్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన భారత్ ల్ ఏడాది పాటు ఉండి హిందీ, ఉర్దూ భాషలపై అధ్యయనం కూడా చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీని నియామకం
ఎవరు: ఎరిక్ గార్సెటీ
ఎప్పుడు: జులై 13
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ-2021 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన యాష్లే బర్టీ :

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ-2021 మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ విజేతగా నిలిచింది ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జూలై 10న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 25 ఏళ్ల బార్టీ. 6–3, 6–7 (4/7), 6-3తో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్ టైటిల్ ను గెలుచుకుంది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ.17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బార్టీ కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ గెలిచిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ ఆట నుంచి బ్రేక్ తీసుకుంది. 2015-2016లో బిగ్ బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్ బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్ పునరాగమనం చేసింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ-2021 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన యాష్లే బర్టీ
ఎవరు: యాష్లే బర్టీ
ఎప్పుడు: జులై 13
మాజీ క్రికెటర్ ప్రముఖ ఆటగాడు యష్ పాల్ కన్నుమూత :

1983 ప్రపంచకప్ లో భారత విజయాల్లో కీలకపాత్ర పోషిం చిన యశ్ పాల్ శర్మ కన్నుమూసారు. జులై 13 న గుండెపోటుతో ఆయన మరణించాడు. ఉదయం వ్యాయామానికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోనే కుప్ప కూలాడు. భారత్ తరఫున 37 టెస్టులు, 42 వన్డేలు ఆడిన ఈ మిడిలా ర్డర్ బ్యాట్స్ మన్ టెస్టుల్లో 1606 పరుగులు, వన్డేల్లో 883. పరుగులు చేశాడు. 1983 ప్రపంచకప్ లో ఓల్డ్ ఫోర్ట్ లో ఇంగ్లాండ్లో జరిగిన సెమి ఫైననల్లో ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేసిన యశ్. పాల్ శర్మ జట్టు విజయం లో ప్రముఖ పాత్ర పోషించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మాజీ క్రికెటర్ ప్రముఖ ఆటగాడు యష్ పాల్ కన్నుమూత
ఎవరు: యష్ పాల్ శర్మ
ఎప్పుడు: జులై 13
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |