Daily Current Affairs in Telugu 16-07-2021
అమెరిక కార్మిక శాఖ సొలిసిటర్ గా భారత న్యాయవాది సీమా నందా ఎంపిక :

అమెరికా కార్మిక శాఖ భారతీయ ప్రముఖ న్యాయవాది సొలిసిటర్ అమెరికన్, పౌర హక్కుల న్యాయవాదిగా సీమా నందా నియమితులయ్యారు. 53-46 ఓట్ల తేడాతో సెనేట్ జులై 16 న ఆమె నియామకాన్ని ఖరారు చేసింది. 48 ఏళ్ల సీమా గతంలో 15 ఏళ్లకు పైగా కార్మిక అంశాలకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా గారి హయాంలో కూడా కార్మిక శాఖ డిప్యూటీ సొలిసిటర్ గా సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరిక కార్మిక శాఖ సొలిసిటర్ గా భారత న్యాయవాది సీమా నందా ఎంపిక
ఎవరు: సీమా నందా
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: జులై 16
టోక్యో పారాలింపి క్స్ లో భారత్ తరఫున బరిలో దిగనున్న ఐఏఎస్ అధికారి :

టోక్యో పారాలింపి క్స్ లో భారత్ తరఫున ఒక ఐఏఎస్ అధికారి బరిలో నిలిచారు. నొయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్. పారా బ్యాడ్మింటన్ లో పోటీపడేందుకు అర్హత సాధించారు. గతంలో ఆసియా పారా బ్యాడ్మింటన్ లో కాంస్యం గెలిచిన యతి రాజ్. కరోనా సమయంలో 16 నెలల పాటు సేవలందించారు. “నొయిడా జిల్లా మెజిస్ట్రే ట్ కరోనా సమయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. కానీ ఈ సమయంలోనూ శిక్షణ మాత్రం ఆపలేదు. త్వరలో జరిగే పారాలింపి క్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నా అని యతిరాజ్ చెప్పారు. మనోజ్ సర్కార్ కూడా బ్యాడ్మింటన్‌లో పారా లింపిక్స్ బెర్తు దక్కించుకున్నారు. వీళ్లిద్దరూ సింగిల్స్ ఆడనున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపి క్స్ లో భారత్ తరఫున బరిలో దిగనున్న ఐఏఎస్ అధికారి
ఎవరు: సుహాస్ యతిరాజ్
ఎప్పుడు: జులై 16
శ్రీలంక క్రికెట్ టీం నూతన కెప్టెన్ గా దాసుణ్ షనక ఎంపిక ;

భారత్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం ఎట్టకేలకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎస్సీ) జట్టును ప్రకటించింది. క్రీడల శాఖ మంత్రి నమల్ రాజపక్స ఆమోదం తెలపడంతో 23 మందితో కూడిన జట్టును పేర్లను జులై 16 న విడుదల చేసింది. దాసున్ షనకను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత నాలుగేళ్లలో శ్రీలంక జట్టుకు షనక పదో కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. . భారత్ తో సిరీస్ లో శ్రీలంక మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది. తొలి వన్డే జులై 18 న జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: శ్రీలంక క్రికెట్ టీం నూతన కెప్టెన్ గా దాసుణ్ షనక ఎంపిక
ఎవరు: దాసుణ్ షనక
ఎప్పుడు: జులై 16
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖ సిఖ్రి కన్నుమూత :

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖ సిఖి(75) కన్ను మూశారు. కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అనా రోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జులై 16 న ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సిక్రీ ‘కిస్సా కుర్సీకా’ చిత్రంతో వెండితెరకు పరిచయ మయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయ నటిగా ప్రేక్షకుల్ని మెప్పించారు. పలు ధారావాహికల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మమ్మో’, ‘తమస్’, ‘బధాయి హో చిత్రాలకు గానూ మూడుసార్లు ఉత్తమ సహాయనటిగా జాతీయ పురస్కారం అందుకున్నారామె. బుల్లి తెరపై పలు ధారావాహికల్లో నటించిన ఆమె ‘బాలికా వదు (చిన్నారి పెళ్లికూతురు) లో బామ్మ పాత్రలో నటించి అందరికీ మరింత చేరువయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖ సిఖ్రి కన్నుమూత
ఎవరు: నటి సురేఖ సిఖ్రి
ఎప్పుడు: జులై 16
14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన బ్యాట్స్ మాన్ గా నిలిచినా బాబర్ అజాం :

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన బ్యాట్స్ మాన్ గా నిలిచారు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై సాధించిన సెంచరీతో రికార్డు ను తిరగరాశాడు. .ఇన్నింగ్స్ పరంగా 14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన బ్యాట్స్ మాన్ అయ్యాడు, క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ లను అధిగమించాడు. పాకిస్తాన్ కెప్టెన్ తన 81 వ వన్డే ఇన్నింగ్స్ లో చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆమ్లా ఇంతకుముందు 84 ఇన్నింగ్స్‌లు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. తన 14 వ వన్డే టన్ను పొందడానికి వార్నర్ 98 ఇన్నింగ్స్ తీసుకున్నాడు, కోహ్లీ 103 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన బ్యాట్స్ మాన్ గా నిలిచినా బాబర్ అజాం
ఎవరు: బాబర్ అజాం :
ఎప్పుడు: జులై 16
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |