Daily Current Affairs in Telugu 16-09-2020
.
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఊబర్ కప్ ఫైనల్స్ నిర్వహణ వాయిదా వేసిన బిడబ్ల్యుఎఫ్ :
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబర్ కప్ ఫైనల్స్ వాయిదా పడింది.కరోనా మహమ్మారి భయంతో అగ్రశ్రేణి జట్లు ఒక్కొటిగా వైదోలుగుతుందడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ఈ టోర్నీ ని వచ్చే ఏడాది 2021 కి వాయిదా వేసింది.అక్టోబర్ 3నుంచి 11వరకు డెన్మార్క్ లో జరగాల్సిన ఈటోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సెప్టెంబర్ 15 న ఇండోనేషియ దక్షిణ కొరియాలు ప్రకటించాయి. అంతకు ముందు థాయ్ లాండ్ ,ఆస్ట్రేలియా చైనీస్ తైఫీ ,అల్జీరియ దేశాలు వైదోలిగాయి.జపాన్ కూడా అదే దారిలో ఉండగా ప్రబుత్వం అనుమతి కోసం చైనా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపద్యంలో సెప్టెంబర్ 16 న బిడబ్ల్యుఎఫ్ అత్యవసర వర్చువల్ మీటింగ్ ను నిర్వహించింది.అతిత్య డెన్మార్క్ తో సంప్రదింపుల అనంతరం థామస్ అండ్ ఉబర్ కప్ ఫైనల్ ను వాయిదా వేస్తునట్లు బిడబ్ల్యుఎఫ్ కటిన నిర్ణయ౦ తీసుకుంది. టోర్నీ నిర్వహణకు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నాం. 2021 కంటే ముందు ఈ టోర్నీ నిర్వహించ బడదు అని బిడబ్ల్యుఎఫ్ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఊబర్ కప్ ఫైనల్స్ నిర్వహణ వాయిదా వేసిన బిడబ్ల్యుఎఫ్
ఎవరు: బిడబ్ల్యుఎఫ్
ఎప్పుడు: సెప్టెంబర్ 16
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అద్యక్షుడికి రెండేళ్ళ జైలు శిక్ష :
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఏఎఫ్) మాజీ అద్యక్షుడు లామినే దియాక్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది.రష్యా డోపిలను నిషేదించకుండా పోటీలలో పాల్గొనేల అవినీతి కి పాల్పడడంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్ ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది.సెనెగల్ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్గ కాలం పాటు ఐఏఎఎఫ్ లోనే అత్యంత ప్రభావవంత మైన అధ్యక్షుడిగా పని చేసారు.అయితే పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని పై విచారించిన కోర్టు జైలు శిక్ష పాటు 5 లక్షల యురోలు (రూ.4కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అద్యక్షుడికి రెండేళ్ళ జైలు శిక్ష
ఎవరు: లామినే దియాక్
ఎప్పుడు: సెప్టెంబర్ 16
ఖేలో ఇండియా పథకంలో దక్కిన తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యెక గుర్తింపు:
భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్స్ తయారు చేయడంతో కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా చేపట్టిన ఖెలో ఇండియా పథకం లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాఫ్తంగా ఎనిమిది రాష్ట్రాలలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కేఐఎస్సిఈ) కేంద్రాలు అబివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్దమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణ తో పాటు ఓడిశా,మిజోరాం,మణిపూర్ ,నాగాలాండ్ ,అరుణాచల్ ప్రదేశ్,కర్ణాటక,కేరళ,రాష్ట్రాలలో ఈ కేంద్రాలను అబివృద్ది చేయనున్నారు.ఇందుకు గాను రూ.95.15 కోట్ల బడ్జెట్ క్రీడా శాఖ వేచ్చిచ్చింది. ఇందులోని ప్రతి ఎక్సలెన్స్ కేంద్రం 14 ఒలింపిక్స్ క్రీడాంశాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఖేలో ఇండియా పథకంలో దక్కిన తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యెక గుర్తింపు
ఎవరు: తెలంగాణా రాష్ట్రానికి
ఎప్పుడు: సెప్టెంబర్ 16
ఓజోన్ సంరక్షణ దినోత్సవంగా సెప్టెంబర్ 16 :
1994 లో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 1987 సెప్టెంబర్‌లో ఓజోన్ పొరను పరిరక్షించే ఉద్దేశం తో ఓజోన్ సంరక్షణ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది, 1987 లో ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ (తీర్మానం 49/114) సంతకం చేసిన తేదీని గుర్తుచేసుకుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రధాన లక్ష్యం ఓజోన్ పొరను రక్షించడం, మొత్తం ప్రపంచ ఉత్పత్తిని మరియు దాని వల్ల ఓజోన్ ను క్షీణింపజేసే పదార్థాల వినియోగాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం, శాస్త్రీయ జ్ఞానం మరియు సాంకేతిక సమాచారంలో అభివృద్ధి ఆధారంగా వాటి తొలగింపు యొక్క అంతిమ లక్ష్యంతో ఈ రోజును ఓజోన్ సంరక్షణ దినోత్సవం గా జరుపుకుంటున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఓజోన్ సంరక్షణ దినోత్సవంగా సెప్టెంబర్ 16
ఎవరు: ఐక్యరాజ్యసమితి
ఎప్పుడు: సెప్టెంబర్ 16
ప్రముఖ కళా పోషకురాలు కపిల్ వాత్సయిన్ కన్నుమూత :
భారతీయ శాస్త్రీయ నృత్య పండితురాలు పద్మ విభూషణ్ గ్రహీత కపిల్ వత్సాయిన్ సెప్టెంబర్ 16న మృతి చెందారు.ఆమె వయసు 92సంవత్సరాలు ఆమె తన నివాసం గుల్ మొహర్ ఎంక్లెవ్ లో ఉదయం 9గంటలకు చని పోయారు.కపిల్ వాత్సయిన్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ జీవిత కాల సభ్యురాలుగా ఉంది. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కు వ్యవస్థాపక డైరెక్టర్ గాను రాజ్యసభ కు రెండు సార్లు నామినేట్ అయ్యారు.చరిత్ర వాస్తుకల శాస్త్ర్య నృత్యాలలో అపార అనుభవ శాలి .1928 లో జన్మించిన కపిల్ వాత్సయిన్ డిల్లి విశ్వవిద్యాలయం లో ఆంగ్ల సాహిత్య౦ లో మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. బనారస్ హిందు విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నారు. సంప్రదాయ భారతీయ నృత్యాలు చరిత్ర కలలపై ఆమె 20 కు పైగా పుస్తకాలు రాశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ కళా పోషకురాలు కపిల్ వాత్సయిన్ కన్నుమూత
ఎవరు: కపిల్ వాత్సయిన్
ఎప్పుడు: సెప్టెంబర్ 16
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |