Daily Current Affairs in Telugu 23-09-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 23-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలహాదారుగా నియమితులయిన సిమంచల దాష్ :

వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలహాదారుగా సిమంచల దాష్‌ను నియమించే ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాలానికి సిమంచల దాష్ నియమితులయ్యారు. సిబ్బంది, ప్రజా వ్యవహారాల మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వులో “సిమాంచల దాష్‌ను నియమించే ప్రతిపాదనను కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలహాదారుగా నియమితులయిన సిమంచల డాష్

ఎవరు: సిమంచల డాష్

ఎప్పుడు: సెప్టెంబర్ 23

టైమ్స్ 100 మంది జాబితాలో  చోటు దక్కించుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా:

భారతీయ బాలివుడ్ చిత్ర సీమలో ప్రముఖ నటుడిగా ఉన్న ఆయుష్మాన్ ఖురానా కు అరుదైన గౌరవం దక్కింది.దాది ఆఫ్ షహీన్ బాగ్ గా గుర్తింపు తెచ్చుకున్న బిల్కిస్ బాలివుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (36)ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులలో అయుష్మనే పిన్న వయస్కుడు కావడం విశేషం.టైం మ్యాగజిన్  ఈ జాబితాను రూపొందించింది.భారత సంతతికి చెందిన వ్యక్తులైన గూగుల్ సియివో సుందర్ పిచాయ్,లండన్ లో వైద్యుడిగా సేవలందిస్తున్న డా.రవీంద్ర గుప్తా కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: టైమ్స్ 100 మంది జాబితాలో  చోటు దక్కించుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా

ఎవరు: ఆయుష్మాన్ ఖురానా

ఎప్పుడు: సెప్టెంబర్ 23

భారత రక్షణ రంగంలో మరో స్వదేశి క్షిపణి ఏటిజిఎం పరీక్ష విజయవంతం:

భారత రక్షణ రంగంలో మరో మైలురాయిని దేశీయంగా అబివృద్ది చేసిన లేజర్ పరిజ్ఞాన  ఆధారిత  ట్యాంకుల  విద్వంసక  క్షిపణి (ఏటిజిఎం) పరీక్ష విజయవంతమైంది.మహారాష్ట్ర లోని  అహ్మద్ నగర్  లో ఉన్న అర్మర్ట్ కోర్ సెంటర్ అండ్ స్కూల్ (ఎసిసి&ఎస్) లో రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డిఆర్డివో)ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.సుమారు నాలుగు కిమీ పరిధి  వరకు ఈ క్షిపణి దూసుకెల్తుందని లక్ష్యాలను పూర్తి కచ్చితత్వంతో చేదిస్తుందని చెప్పారు.పరీక్షలో భాగంగా దీన్ని మూడో తరానికి చెందిన ఎంబిటి అర్జున్ యుద్ద ట్యాంక్ మీద నుంచి ప్రయోగించినట్లు వెల్లడించారు. దేశీయంగా అబివృద్ది చేసిన ప్రుద్వి -2 క్షిపణి చీకట్లో లక్ష్యాలను చేధించడానికి సిద్దమైంది.ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించేలా రూపొందించేలా ఈ అణు సామర్య్తం క్షిపణి రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ డిఆర్డివో పరీక్షించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: భారత రక్షణ రంగంలో మరో స్వదేశి క్షిపణి ఏటిజిఎం పరీక్ష విజయవంతం

ఎవరు: భారత రక్షణ రంగం

ఎక్కడ: మహారాష్ట్ర లోని  అహ్మద్ నగర్ 

ఎప్పుడు: సెప్టెంబర్ 23

కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూత :

రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి (65 ని కరోనా మహమ్మారి వల్ల కన్నుమూసారు.దిల్లిలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 23రాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు.కరోనా బారిన పడి  కన్నుమూసిన  తొలి కేంద్ర మంత్రి ఆయనే.ఇప్పటికే దేశంలో కనీసం మరో ముగ్గురు ఎంపిలు ,ఆరుగురు ఎమ్మెల్యేలు కోవిద్ దెబ్బకు మృత్యు వాత పడ్డారు.గత నెల ఆగస్ట్ 31 న మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కోరోనా వైరస్ బాధితులే.అంగడి కర్నాటక కు చెందిన బాజాపా నేత బెలగావి నుంచి లోక్ సభ కు ప్రాతినిత్యం వహిస్తున్నారు.అంగడి 1995 జూన్ 01న బెలగావి జిల్లా కొప్పా గ్రామంలో జన్మించారు.న్యాయ విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.1996లో బెలగావి బాజాపా ఉపాద్యక్సుడిగా బాద్యతలు చేపట్టిన ఆయన ఆపై అంచలంచెలుగా ఎదిగారు.2004 లో బెలగావి లోక్ సభ స్థానం నుంచి తొలి సారి ఎంపి గా విజయం సాధించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూత

ఎవరు: సురేష్ అంగడి

ఎక్కడ:కర్ణాటక

ఎప్పుడు: సెప్టెంబర్ 23

ప్రముఖ మరాఠీ నటి ఆశ లతా వబ్‌గావ్కర్ కన్నుమూత:

ప్రఖ్యాత మరాఠీ, హిందీ చిత్రాలు, రంగస్థల నటి ఆశ లతా వబ్గావ్కర్ ఇటీవల కన్నుమూశారు. ఆమె అనేక మరాఠీ చిత్రాలు మరియు నాటకాల్లో నటించింది. బాలీవుడ్‌లో ఆమె ‘అప్నే పరే’, ‘వో సాత్ దిన్’, ‘నమక్ హలాల్’, ‘జంజీర్’ వంటి తదితర చిత్రాల్లో నటించింది మంచి పేరును సంపాదించుకుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ప్రముఖ మరాఠీ నటి ఆశ లతా వబ్‌గావ్కర్ కన్నుమూత

ఎవరు: ఆశ లతా వబ్‌గావ్కర్

ఎక్కడ:మహారాష్ట్ర                   

ఎప్పుడు:సెప్టెంబర్ 23

ప్రపంచవ్యాప్తంగా  రైనో దినోత్సవం గా సెప్టెంబర్ 22:

ప్రపంచ వ్యాఫ్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 ను ప్రపంచ రైనో దినోత్సవం గా జరుపుకుంటారు.ఈ అద్భుతమైన జాతి మనుగడకు పెంచే ఉద్దేశం తో ప్రపంచ వ్యాప్తంగా పెంచడానికి మరియు సురక్షితమైన సహజ ఆవాసాలను నిర్మించడానికి గురించి ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం గా జరుపుకుతారు.మొత్తం ఐదు రకాల జాతుల ఖడ్గ మృగాల  సంరక్షణ గురించి ఈ రోజును జరుపుకుతారు.ఇందులో నలుపు ,తెలుపు ,ఒక కొమ్ము కలిగిన ఖడ్గ మృగం ,సుమిత్రన్ మరియు జవాన్ ఖడ్గమృగాలు సంబందించినవి ఉన్నాయి.ముఖ్యంగా భారతదేశంలో ఈ ఖడ్గమృగాల సంఖ్యా అసోం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో అధికంగా ఉంది.ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఖడ్గ మృగాల కు కలిగిన పార్క్ గా ప్రసిద్ది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ప్రపంచవ్యాప్తంగా  రైనో దినోత్సవం గా సెప్టెంబర్ 22

ఎక్కడ:అసోం

ఎప్పుడు:సెప్టెంబర్ 22

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *