Daily Current Affairs in Telugu 24-09-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 24-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఐపిఎల్ 13లో తొలి సెంచరి సాధించిన బ్యాట్స్ మెన్ గా నిలిచిన కే.ఎల్ రాహుల్ :

ఇటీవల జరిగిన మ్యాచ్ లో పంజాబ్ యొక్క తొలి మ్యాచ్ లో సూపర్ ఓవర్ తో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు  రెండో మ్యాచ్ లో భారీ విజయంతో సత్తా చాటింది.సెప్టెంబర్ 24న పోరులో పంజాబ్ 97పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పై ఘనవిజయం సాధించింది.ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 206 పరుగులు 20 ఓవర్లలో చేసింది. కెప్టెన్ కే.ఎల్ రాహుల్  “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” 69 బాల్స్ లో 132 పరుగులు నాటౌట్ గా నిలిచాడు.ఈ ఐపిఎల్ మ్యాచ్ లో తొలి సెంచరి నమోదు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా లోకేష్ రాహుల్ నిలిచాడు. బారీ లక్ష్య చేదనలో దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 17ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఐపిఎల్ 13లో తొలి సెంచరి సాధించిన బ్యాట్స్ మెన్ గా నిలిచిన కే.ఎల్ రాహుల్

ఎవరు: కే.ఎల్ రాహుల్

ఎప్పుడు: సెప్టెంబర్ 24

ఎన్.ఎం.సి చైర్మన్ గా సురేష్ చంద్ర నియామకం :

జాతీయ వైద్య కమిషన్ (ఎన్.ఎం.సి) చైర్మన్ గా డాక్టర్ సురేష్ చంద్ర శర్మ నియమితులయ్యారు.మూడేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  సెప్టెంబర్ 24న ఈ మేరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.దేశంలో వైద్య విద్యను ఎన్ఎంసి పర్యవేక్షిస్తుంది.ఇప్పటి వరకు భారతః వైద్య మండలి (ఎంసిఐ) ఈ బాద్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.దాని స్తానంలో ఎన్ఎంసి అమల్లోకి వస్తుంది.ఈ నేపద్యంలో కేంద్రం దానికి పాలక మండలి ఏర్పాటు చేసింది.సురేష్ చంద్ర డిల్లి లోని ఎయిమ్స్ ఈ.ఎన్.టి విభాగాలకు అధిపతిగా పని చేసి విరమణ చేసారు.ఎన్ఎంసి చట్టంలోని నిబందనల ప్రకారం పాలక మండలిలో పది మంది ఎక్స్ అఫిసియో సభ్యులుగా కేంద్రం నియమించింది. సెక్షన్ 4(4) లోని క్లాజ్ ఏ కింద ఇద్దర్ని నాలుగేళ్ళ కాలానికి తాత్కాలిక సభ్యులుగా తీసుకుంది.ఈ  ఇద్దరిలో పుట్ సోల్జర్స్ ఫర్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సియివో ధాత్రి (తల్లి పాల బ్యాంకు )హైదరాబాద్ ఎగ్సిక్యుటివ్  డైరెక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి కి క్లాజ్ బి ప్రకారం 10వైద్య విశ్వ విద్యాలయం ల ఉప కులపతిగా ను రెండేళ్ళ కాలానికి తాత్కాలిక సబ్యులుగా నియమించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఎన్.ఎం.సి చైర్మన్ గా సురేష్ చంద్ర నియామకం

ఎవరు: సురేష్ చంద్ర

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: సెప్టెంబర్ 24

కోవిద్ తో ప్రముఖ అణు శాస్త్రవేత్త శేఖర్ బసు కన్ను మూత :

ప్రముఖ అణు శాస్త్రవేత్త అణు శక్తి కమిషన్ మాజీ చైర్మన్ శేఖర్ బసు (68) సెప్టెంబర్ కోల్ కతా లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మరణి౦చారు. గత కొద్దిరోజులుగా అయన కోవిద్ 19 మూత్ర పిండాల సమస్యలకు చికిత్స పొందుతున్నారు 1952 సెప్టెంబర్ 20న జన్మించారు.ఆయన పాటశాల విధ్యాబ్యాసం కోల్ కతా లో సాగింది.1974 లో మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.ఆ తర్వాత భాబా అణు పరిశోదన కేంద్రంలో అణు శాస్త్రం ఇంజెంరింగ్ విభాగంలో ఏడాది పాటు శిక్షణ  పొందారు.అనంతరం రియాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో చేరారు. దేశ అణు ఇందన కార్యక్రమం లో అయన విశేష సేవలు అందించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: కోవిద్ తో అను శాస్త్రవేత్త శేఖర్ బసు కన్ను మూత :

ఎవరు: శేఖర్ బసు

ఎక్కడ; కోల్ కతా

ఎప్పుడు: సెప్టెంబర్ 24

ఆస్టేలియా మాజీ బ్యాట్స్ మెన్ ప్రముఖ వ్యాఖ్యత డీన్ జోన్స్ కన్నుమూత :

ఆష్ట్రేలియ మాజీ బ్యాట్స్ మెన్ ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59)హతాన్మరణం చెందారు.సెప్టెంబర్ మద్యాహ్నం ముంబాయిలో తీవ్రమైన గుండెపోటుతో డీన్ శ్వాస విడిచాడు.అతడు ప్రస్తుత౦ ముంబాయిలో బయో బబుల్ లో ఉంటూ స్టార్ స్పోర్ట్స్ లో ఐపిఎల్ వ్యాఖ్యాత గా పని చేస్తున్నాడు.సెప్టెంబర్ ముంబాయిలో ఇండియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు డగౌట్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు బాద్యతలు నిర్వర్హ్తిస్తూనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు..డీన్ జోన్స్ పదేళ్ళ అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో చిరస్మరనియ ప్రదర్శనలు ఉన్నాయి.ఆస్టేలియా సాధించిన అనేక విజయాల్లో ఆటలో భాగంగా నిలిచాడు.1987వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసిస్ జట్టులో కీలక పాత్ర పోషించిన డీన్ జోన్స్ కెరీర్ లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలు రాయి గా నిలిచింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఆస్టేలియా మాజీ బ్యాట్స్ మెన్ ప్రముఖ వ్యాఖ్యత డీన్ జోన్స్ కన్నుమూత

ఎవరు: డీన్ జోన్స్

ఎక్కడ; ముంబాయి

ఎప్పుడు: సెప్టెంబర్ 24

 టైమ్ మ్యాగజైన్ యొక్క అత్యంత ప్రభావశీలి  100 మంది ’జాబితాలో PM మోడీ:

టైమ్ మ్యాగజైన్ TIME 100 లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా 2020 ను ఇటీవల  విడుదల చేసింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ జాబితాలో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడుగా నిలిచారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత నాల్గవసారి ఆయన పేరు ఈ టైం అత్యంత ప్రభావ శీలి జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో పయనీర్స్, ఆర్టిస్ట్స్, లీడర్స్, టైటాన్స్, ఐకాన్స్ అనే ఐదు విభాగాలలో  పేర్లను ప్రకటిస్తారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: టైమ్ మ్యాగజైన్ యొక్క అత్యంత ప్రభావశీలి  100 మంది ’జాబితాలో PM మోడీ

ఎవరు: PM మోడీ

ఎప్పుడు :సెప్టెంబర్ 24

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *