Daily Current Affairs in Telugu 25-09-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 25-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

సోమాలియా దేశ నూతన ప్రధానిగా నియమితులయిన మొహమ్మద్ హుస్సేన్ రోబుల్:

సోమాలియా దేశ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లాహి మొహమ్మద్ మొహమ్మద్ హుస్సేన్ రోబుల్‌ను సోమాలియా నూతన ప్రధానిగా నియమించారు. అయన కార్యాలయం నుంచి సెప్టెంబర్ 25న ప్రకటించింది.వచ్చే ఏడాది  జరగబోయే ఎన్నికలకు ముందు అధికారాన్ని  ముదిపెట్టింది.ఈయన గతంలో  ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే యునైటెడ్ నేషన్స్ ఏజన్సీ లో పని చేసారు.ఫిబ్రవరి 2021 లోపు ఎన్నికలకు  సంబంధించిన అధికార న్యాయ పోరాటం ఫై  జూలైలో తొలగించ బడిన మాజీ ప్రధాని హసన్ అలీ ఖైర్‌ స్థానం లో ఆయన భర్తీ చేయనున్నారు. అధ్యక్షుడు ఫర్మాజో అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన 215 మంది ఎంపీలందరూ హుస్సేన్ రోబుల్‌ను ప్రధానిగా నియమించడాన్ని సమర్థించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి; సోమాలియా కొత్త ప్రధానిగా నియమితులయిన మొహమ్మద్ హుస్సేన్ రోబుల్

ఎవరు: మొహమ్మద్ హుస్సేన్ రోబుల్

ఎక్కడ: సోమాలియా

ఎప్పుడు: సెప్టెంబర్  25

 ‘మోక్ష కలష్ యోజన -2020’ పథకం ను ఆమోదించిన రాజస్థాన్ సిఎం ‘;

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యొక్క ‘మోక్ష కలాష్ యోజన -2020’ అనే పథకాన్ని ఆమోదించారు.హరిద్వార్‌లోని గంగాలో తమ ప్రియమైనవారి బూడిదను కలపడానికి మరణించిన వారి కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించడమే ఈ మోక్ష కలాష్ యోజన లక్ష్యం. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర రహదారి రవాణా సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది మరియు ఖర్చులను దేవస్థాన్ శాఖ భరిస్తుంది. ప్రయాణీకులు చనిపోయిన వ్యక్తి గురించి వివరాలను అందించడం ద్వారా సౌకర్యం పొందటానికి నమోదు చేసుకోవాలి. సంబంధిత పత్రాల యొక్క కాపీని బూడిదను మోసే వారితో ఉంచాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఆర్‌టిసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది, ప్రయాణానికి వారి గమ్యస్థానానికి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది మరియు ప్రయాణంలో ఇతర సౌకర్యాలను కూడా ఈ పతకం ద్వారా అందిస్తుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి; ‘మోక్ష కలాష్ యోజన -2020’ ను ఆమోదించిన  రాజస్థాన్ సిఎం

ఎవరు: రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్

ఎక్కడ: రాజస్థాన్

ఎప్పుడు: సెప్టెంబర్  25

“ముఖ్యమంత్రి గ్రామ్యా పరిబాహన్ అచోని యోజన” ను ప్రారంభించిన అస్సాం ప్రభుత్వం ;

అస్సాం ముఖ్యమంత్రి అయిన సర్బానంద సోనోవాల్ రాష్ట్ర రవాణా శాఖ యొక్క “ముఖ్యామంత్రి గ్రామ్యా పరిబాహన్ అచోని యోజన” ను ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రామీణ అనుసంధానం మెరుగుపరచడానికి మరియు గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో లైట్ మోటారు వాహన సేవలను ప్రారంభించనున్నారు. ఈ పతకం ప్రతి గ్రామానికి ఒక లబ్ధిదారునికి ఒక వాహనం అందించబడుతుంది. ఈ పథకం యొక్క మొదటి దశలో 10,000 గ్రామాలకు 100 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయం ఉంటుంది. అర్హత కలిగిన పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం వాహనం ఖర్చులో 25 శాతం లేదా రూ.1 లక్షలతో, ఏది తక్కువైతే వారికి ఆర్థికంగా సహాయం చేస్తుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి; ముఖ్యమంత్రి గ్రామ్యా పరిబాహన్ అచోని యోజన” ను ప్రారంభించిన అస్సాం ప్రభుత్వం

ఎవరు: అస్సాం ప్రభుత్వం

ఎక్కడ: అస్సాం

ఎప్పుడు: సెప్టెంబర్  25

సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రమణ్యం కన్నుమూత :

సుప్రసిద్ధ గాయకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25 తుది శ్వాస విడిచారు. స్వల్ప కరోనా లక్షణాలతో అయన ఆగస్ట్ 5న తేదిన చెన్నై లోని ఎం.జి.ఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో చేరారు. చిన్నపాటి లక్షణాలే ఉన్నాయని తనకేలాంటి సమస్యలు లెవ్వని ఎవరు ఆందోళన చెందవద్దని తొలి రోజును స్వయంగా విడియో ద్వారా తెలియజేశారు. బాలసుబ్రమణ్యంగారు ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. వెంటిలెటర్ ఎక్మో సాయంతో చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ సెప్టెంబర్ 25న అయన ఆస్పత్రిలోనే కన్నుమూసారు. ఉత్తమ గాయకుడిగా బాలసుబ్రమణ్యం గారికి ఆరు జాతీయ బహుమతులు అందుకున్నారు. పలు చిత్రాలలో గాయకుడిగా పని చేసి జాతీయ పురస్కారాలకు అందుకున్నారు. ఉత్తమ గాయకుడిగా ఏడు ఫిలింఫేర్  పురస్కారాన్ని దక్షిణ భారత సినిమాలలో ఉత్తమ గాయకుడిగా ఏడు ఫిలిం ఫేర్ పురస్కార౦ అందుకున్నారు.భారత ప్రభుత్వం 2001 లో పద్మ శ్రీ ,2011 లో పద్మ భూషణ్ పురస్కారాలను ఈయనను గౌరవించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి; సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం కన్నుమూత

ఎవరు: ఎస్.పి బాలసుబ్రమణ్యం

ఎప్పుడు: సెప్టెంబర్  25

ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ అద్యక్షుడిగా కే.మాధవన్  నియామక౦:

భారత బ్రాడ్ కాస్టర్ల అత్యున్నత సంఘం ది ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్)కొత్త అద్యక్షుడిగా స్టార్ అండ్ డిస్నీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  కే.మాధవన్ ఎన్నికయ్యారు.ప్రస్తుత అద్యక్షుడైన సోని పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్సిక్యుటివ్  బోర్డు ముగ్గురు ఉపాధ్యక్షులుగా ఇండియా టీవి చైర్మన్ రజత్ శర్మ  టర్నర్  ఇంటర్నేషనల్  మేనేజింగ్ డైరెక్టర్ గా(దక్షిణాసియ )సిద్దార్థ్ జైన్ వయాకాం 18 మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషిలను ఎంపిక చేసింది. ఐబిఎఫ్ పరపతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని మాదవన్ పేర్కొన్నారు. 2012 నుంచి ఐబిఎఫ్ లో అయన క్రియాశీల సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

క్విక్ రివ్యు:

ఏమిటి; ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ అద్యక్షుడిగా కే.మాధవన్  నియామక౦

ఎవరు: కే.మాధవన్ 

ఎక్కడ:న్యుడిల్లి

ఎప్పుడు:సెప్టెంబర్  25

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *