Daily Current Affairs in Telugu -15-11-2019
ఆసు యంత్రం సృష్టికర్తకు డాక్టరేట్ ప్రదానం:
ఆసు యంత్ర్ర సృష్టికర్త చింతకింది మల్లేషం కు గీతం విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. పటాన్ చేరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పదో స్నాతకోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిదిగా ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐవీఐఎస్ టి) కులపతి డాక్టర్ బిఎన్ సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ తో పాటు డాక్టర్ గుళ్ళపల్లి ఎం రావు డాక్టర్ అఫ్ సైన్సు డిగ్రీ ఆసుయంత్రం సృష్టికర్త చింతకింది మల్లెశానికి డాక్టర్ అఫ్ లెటర్స్ డిగ్రీ లను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఆసు యంత్రం సృష్టికర్తకు డాక్టరేట్ ప్రదానం:
ఎవరు: చింతకింది మల్లేశం
ఎక్కడ: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో
ఎప్పడు: నవంబర్15 2019
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఆహ్మాదాబాద్ లో జాతీయ సదస్సు :
అహ్మదాబాద్లో ఈ నవంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సు లో తెలంగాణ లో విజయవంతంగా అమలు చేస్తున్న ఆరోగ్య పతకాలను ప్రదర్శించనున్నారు. వృద్దులు ,క్యాన్సర్ రోగులు మంచానపడినపుడు సాంత్వన అందించే పాలివెటివ్ కేర్ ఆన్లైన్ విధానంలో సమగ్ర వైద్యారోగ్య సమాచారాన్ని పొందుపర్చనున్న ఈ –బర్త్ పోర్టల్ హెల్త్ ప్రొఫైల్ తదితర ఐటి కార్యక్రమాలు క్షయ వ్యాది నిర్మూలనలో సాదించిన ప్రగతి , ఐదు వేల జనాబా ఉన్న పట్టన మురికివాడలో అందిస్తోన్న వైద్యసేవలు బస్తి దవఖాన వంటి పథకాల అమలు తీరు పై ప్రదర్శన ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఆహ్మాదాబాద్ లో జాతీయ సదస్సు
ఎక్కడ: ఆహ్మాదాబాద్
ఎప్పడు: నవంబర్ 15
ఇంటింటికి తాగు నీటికి ఇజ్రాయిల్ చేయూత :
భారత్ లో ని ప్రతి ఇంటింటికి 2024 నాటికల్లా నల్ల నీటి సౌకర్యం కల్పించే అంశం పై ఇజ్రాయెల్ సహకారాన్ని కేంద్రం తీసుకోనుంది. ఇందులో బాగంగా భారత జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావాట్ ఈ నెల నవంబర్ 17 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటీంచనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఇంటింటికి తాగు నీటికి ఇజ్రాయిల్ చేయూత
ఎవరు: జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావాట్
ఎప్పడు:నవంబర్ 15
భారత్ లో న్యుమోనియా మరణాలెక్కువ -ఐక్య రాజ్య సమితి :
ప్రపంచం మొత్తం మీద 2018 లో న్యుమోనియా తో మరణించిన ఐదేళ్లలో పు చిన్నారుల సంఖ్య విషయంలో భారత్ ద్వితీయ స్తానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి (ఐ.ర.స.) తాజా నివేదిక లో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: భారత్ లో న్యుమోనియా మరణాలెక్కువ -ఐక్య రాజ్య సమితి
ఎవరు: భారత్
ఎప్పడు:నవంబర్ 15
ఇక ఏడాది కొకసారి పులుల గణన దేశంలో మొదటిసారిగా తెలంగాణలో శ్రీకారం :
ప్రతి 200 చదరపు కిలో మీటర్ల ప్రాంతం ఓ అటవీ బ్లాకుగా వరిగి వర్గీకరించి ప్రతి చ.కి.మీ.కి పరిధి లో రెండేసి కెమరాలు. ఆ మార్గంలో పెద్దపులి సంచరిస్తే రెండువైపుల నుంచి క్లిక్ చేసి ఇలా ఒక్కో బ్లాకులో 45 రోజుల పాటు కెమరాలతో పులుల్ని లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు జంతు గణన నాలుగేళ్లకోకసారి జరుపుతోంది. ఇపుడు దేశంలోనే తొలి సారిగా జరగుతోంది. ఇపుడు దేశంలోనే తొలి సారిగా తెలంగాణ ఏటా ఈ కసరత్తు చేసేందుకు సిద్దమవుతుంది. అక్టోబర్ నేలాఖరుకు ఫేజ్ -4 మానిటరింగ్ కు శ్రీకారం చుట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఇక ఏడాది కొకసారి పులుల గణనన దేశంలో మొదటిసారిగా తెలంగాణలో శ్రీకారం
ఎక్కడ:తెలంగాణ
ఎప్పడు: నవంబర్ 15
ఒకే దేశం ఒకే వేతన దినం అమలులో కేంద్రం యోచన :
సంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు ప్రయోజనాలు ద్రుష్టిలో పెట్టుకోని వారందరి కి ఒకే రోజు వేతనం లభించేలా చూసేందుకు ఒకేదేశం ఒకే వేతన దినం విదానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు.సెంట్రల్ అసోసియేషాన్ అఫ్ ప్రైవేటు ఇండస్ట్రి నిర్వహించిన భద్రతా నాయకత్వ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ రంగాల్లో కార్మికులందరికీ సకాలంలో జీతాలు అందేలా చూడడానికి దేశవ్యాప్తంగా ప్రతి నెల వేతన చెల్లింపు దినం ఒకే రోజున ఉండాలి . చట్టం చేయాలనీ ప్రదాని మోది పట్టుదల గా ఉన్నారు అని మంత్రి తెలిపారు. కార్మికులు మెరుగైన జీవనాన్ని పొందేందుకు వీలుగా అన్ని రంగాల్లో ను ఎకికృతంగా కనీస వేతనాలు లభించేలా చూడలనుకుంటున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఒకే దేశం ఒకే వేతన దినం అమలులో కేంద్రం యోచన
ఎవరు: కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
ఎక్కడ:ఢిల్లీ
ఎప్పడు:నవంబర్ 15
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పదవీ విరమణ :
భారత ప్రధాన న్యయమూర్తి సిజే ఐ జస్టిస్ రంజన్ గగోయ్ నవంబర్ 17 న ఆయన పదవికి వీడ్కోలు చెప్పనున్నారు. ఢిల్లీ లో జరిగిన ఈ వీడ్కోలు సభలో కాబోయే జస్టిస్ సిజేఐ బొబ్డే , సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎంవి రమణ ,అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ , సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అద్యక్షుడు రాకేశ్ కుమార్, ఖన్నా లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జస్టిస్ గగోయ్ అన్ని హైకోర్ట్ లకు చెందిన మొత్తం 650 మంది న్యాయమూర్తులు దేశంలో 15 వేల మంది జిల్లా తాలుకు స్తాయి న్యాయాధికారులతో నవంబర్15 న వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
జుస్తిస్ గగోయ్ పేరు చరిత్రలో ప్రముఖంగా నిలిచిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రప్రథమంగా సుప్రీం కోర్ట్ ప్రదాన న్యాయమూర్తి గా బాద్యతలు చేపట్టిన వ్యక్తీ ఆయనే కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి: సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పదవీ విరమణ
ఎవరు జస్టిస్ రంజన్ గగోయ్
ఎక్కడ:ఢిల్లీ
ఎప్పడు:నవంబర్ 15
రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్ర లో భాజాప యేతర ప్రబుత్వం కొలువు:
రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్టలో బాజాపాయేతర సర్కారు కొలువు తీరడానికి అడుగులు పడుతుంది. శివసేన , నేషనలిస్టు కాంగ్రెస్ , కాంగ్రెస్ ల సంకీర్ణాన్ని మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసేందుకు ఆ మూడు పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు,. బిన్న భావజాలాలున్న ఈ మూడు పార్టీల్లో ప్రభుత్వానికి నేతృత్వం వహించేది శివసేననే అని సంబదిత వర్గాలు చెబుతున్నాయి. సంకిర్న సర్కారు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిద పార్టీల అగ్రనేతలకు పంపించునున్నారు. శివసేన అధికార ప్రతినిది సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్రలో తదుపరి సర్కారు తమ పార్ర్టీయే నేతృత్వం వహిస్తుందని అది 25 ఎల్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్ర లో బాజాప యేతర ప్రబుత్వం కొలువు
ఎక్కడ:ఢిల్లీ
ఎప్పడు:నవంబర్ 15
ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో ఎక్సెల్ సివిల్స్ అకాడమి :
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం హైదరాబాద్ ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ లో ఎక్సెల్ సివిల్స్ అకాడమిని ఏర్పాటు చేసారు. దీనిని నవంబర్ 15 న తేదేపా అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతిమని మేనేజింగ్ ట్రస్ట్ నార భువనేశ్వరి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత సర్వీసులకు వెళ్ళాలనే విద్యార్థులను ఈ అకాడమి లో శిక్షణ పొందడం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఎన్టిఆర్ ట్రస్ట్ అద్వర్యంలో నిర్వహించే ఈ అకాడమిలో మొదటి బ్యాచ్ వచ్చె నెలలో ప్రారంబమవుతుందని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో ఎక్సెల్ సివిల్స్ అకాడమి
ఎక్కడ:ఢిల్లీ
ఎప్పడు:నవంబర్ 15
19 మందికి సికేఆర్ అవార్డులు :
పశువైద్యులకు ఏట ఇచ్చే ప్రతిష్టాత్మక డాక్టర్ సి.కృష్ణారావు ఎండోమెంట్ ట్రస్ట్ పురస్కారాలను ఈ ఏడాది 19 మందికి అందజేయనున్నారు. ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన పశువైద్యులకు శాంతి నగర్ వెబ్స్ హోమ్లో నిర్వహించి సమావేశంలో శనివారం ఈ అవార్డ్ లు ప్రదానం చేయనున్నారు. పశుసంవర్డక శాఖ సంచాలకులకు లక్ష్మారెడ్డి తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: 19 మందికి సికేఆర్ అవార్డులు
ఎక్కడ:ఢిల్లీ
ఎప్పడు:నవంబర్ 15
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |