Daily Current Affairs in Telugu -13-10-2019
Click here for Daily Current Affairs in Telugu
ఇన్ స్టాగ్రామ్ రారాజు మోది:
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.ఫోటో షేరింగ్ యాప్ ‘ఇన్ స్టాగ్రామ్’ లో ఆయన్ను అనుసరిస్తున్నవారి సంఖ్య 3కోట్లు దాటింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్’ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా నిలిచారు. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య మూడు కోట్లు దాటిన తొలి నేత మోది కావడం విశేషం. భాజపా కార్యనిర్వాక అధ్యక్షుడు జెపి.నడ్డా ఓ ట్విట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. యువతలో మోదికు ఉన్న ఆదరణ తాజా ఘనత ఓ సాక్ష్యమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో వెనుకే ఉన్నారు. ట్విటర్ లో ప్రధానిని అనుసరిస్తున్న వారి సంఖ్య నెల క్రితమే 5 కోట్లు దాటింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఇన్ స్టాగ్రామ్’ లో ఆయన్ను అనుసరిస్తున్నవారి సంఖ్య 3కోట్లు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోది
ఎక్కడ: ఇన్ స్టాగ్రామ్
తమిళనాడులో మరో ‘చిన్న’ శ్రీహరికోట:
రోదసి ప్రయోగాల కోసం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తుంది. ఇందుకు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కులశేఖరపట్నం వేదిక కానుంది. ఇక్కడ చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో మాత్రమె అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది.ఇక్కడనుంచి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు జరుగుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : తమిళనాడులో మరో ‘చిన్న’ శ్రీహరికోట ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తుంది
ఎవరు : ఇస్రో
ఎక్కడ: కులశేఖరపట్నం, తూత్తుకుడి జిల్లాలో(తమిళనాడు)
ఆర్ధిక వృద్ది రేటు 6 శాతమే : ప్రపంచ బ్యాంకు:
అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రభావం భారత్ పైన కనిపిస్తుంది. అందుకే 2019-20 లో వృద్దిరేటు అంచనాలను 6.9 నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. 2020-21 లో వృద్దిరేటు 6.9 శాతం, 2021-22 నాటికి 7.2 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశాల నేపథ్యంలో, దక్షిణాసియాలోని పలు దేశాల ఆర్ధిక పరిస్థితి పై ప్రపంచ బ్యాక్ నివేదిక రుపొంచింది. 2018-19 లో జిడిపి 6.8 శాతం, 2017-18 లో 7.2 శాతం నమోదు కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఆర్ధిక వృద్ది రేటు 6 శాతమే : ప్రపంచ బ్యాంకు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రపంచబ్యాంక్
ఎక్కడ: వాషింగ్ టణ్ డిసి
ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో మంజు రాణి కి రజతం :
ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించాలనుకున్న మంజు రాణి కల చెదిరింది. ఫైనల్లో ఓడిన ఆమె రజతంతో సంతృప్తి చెందింది. అక్టోబర్ 13 న జరిగిన 48 కేజీల విభాగం తుది సమరంలో మంజు 1-4 తో ఏక్తా రీనా పల్ట్ సెవా (రష్యా) చేతోలో ఓడింది. పాల్గొన్న తొలి ప్రపంచ చాంపియన్ షిప్ లో రజతం గెలవడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో మంజు రాణి కి రజతం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : మంజు రాణి
ఎక్కడ: ఉలాన్ ఉదే రష్యా
బైల్స్ ఆల్ టైం రికార్డు :
అమెరికా సంచలన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఆల్ టైమ్ గ్రేట్ గా మారింది. 23 ప్రపంచ పతకాలతో బెలారస్ దిగ్గజం వితలి షేర్ బో సరసన నిలిచిన బైల్స్ ..అక్టోబర్ 13 న జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో బీమ్, ఫ్లోర్ విభాగాల్లో స్వర్ణాలను సొంతం చేసుకుంది. దీంతో 25 పతకాలతో ఆల్ టైం గ్రేట్ గా నిలిచింది. ఇందులో 19 స్వర్ణాలే కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : బైల్స్ ఆల్ టైం రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : సిమోన్ బైల్స్
ఎక్కడ: స్టట్ గార్ట్ (జర్మని)
డచ్ విజేత లక్ష్యసేన్ :
భారత యువ షేట్లర్ లక్ష్యసేన్ కేరిలో లో తొలి బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ ను గెలుచుకున్నాడు. అతడు డచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 13న జరిగిన పైనల్ లో లక్ష్యసేన్ 15-21.21-14, 21-15 తో జపాన్ కు చెందిన యసుకె ఒనోడేరా పై విజయం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లక్ష్యసేన్ డచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : లక్ష్యసేన్
ఎక్కడ: అల్మేర్ (నెదర్లాండ్స్)
భారత్ రికార్డు విజయం :
భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్ లో మరే జట్టుకు సాధ్యం కానీ విధంగా స్వదేశంలో వరుసగా 11 టెస్ట్ సిరిస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 13 న ముగిసిన రెండో టెస్ట్ లో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో నెగ్గిన టీమ్ ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్ ను 2-0 తో సొంతం చేసుకుంది. స్వదేశంలో 2013 లో మొదలైన జైత్రయాత్ర నిరాటంకంగా సాగుతుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై సాధించిన పది వరుస సిరిస్ విజయాల ప్రపంచ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత క్రికెట్ జట్టు స్వదేశంలో వరుసగా 11 టెస్ట్ సిరిస్ విజయం సాధించింది
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత క్రికెట్ జట్టు
ఎక్కడ: ఇండియా