
Daily Current Affairs in Telugu 11-03-2020
ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి మహిళా డిఐజిగా నుపూర్ కుల శ్రేష్ట :

ఇండియన్ కోస్ట్ గార్డ్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) గా పదోన్నతి పొందిన మొదటి మహిళగా నుపూర్ కులశ్రేష్ట నిలిచింది. ఆమె 1999 లోఇండియన్ కోస్ట్ గార్డ్ లో చేరారు.ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక బహుళ మిషన్ సంస్థ,సముద్రంలో రౌండ్ ది ఇయర్ రియల్ లైఫ్ ఆపరేషన్ ను నిర్వహిస్తుంది.ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏడాది పొడవున వివిధ మిషన్లునిర్వహిస్తున్న సంస్థ .ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ఇండిపెండెంట్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియాగా 18 ఆగస్టు 1978 న కోస్ట్ గార్డ్ చట్టం ,1978 రాజ్యాంగం ద్వారా స్తాపించబడింది. ఇది రక్షణ శాఖ కింద పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి మహిలా డిఐజి గా నుపూర్ కుల శ్రేష్ట :
ఎక్కడ: న్యు డిల్లి
ఎవరు: నుపూర్ కుల శ్రేష్టి
ఎప్పుడు: మార్చి 11
2017-19 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును గెలుచుకున్న వి.ప్రవీణ్ రావు :

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వైస్ చాన్సలర్ వి.ప్రవీణ్ రాఫు 7వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును గెలుచుకున్న్నారు. ఈయన 2017-19సంవత్సరకాలానికి అవార్డును గెలుచుకున్నారు.వ్యవసాయ పరిశోదన,బోధన,పొడగింపు మరియు పరిపాలన రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లబించింది. భారత దేశం,ఇజ్రాయిల్ మరియు దక్షిణాఫ్రికాలో సూక్ష్మ సేద్యం పై 13 పరిశోదన మరియు 6 కన్సల్టేన్సి ప్రాజెక్టులను ప్రవీణ్ రావు గారు నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2017-19 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును గెలుచుకున్న వి.ప్రవీణ్ రావు
ఎవరు: వి.ప్రవీణ్ రావు
ఎప్పుడు: మర్చి 11
డబ్ల్యుఈఎఫ్ రూపొందించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలోభారతియులైన అయిదురు కి చోటు:

ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఈ ఎఫ్) రూపొందిన యాంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారత్ నుంచి ఆయిదుగిరికి చోటు లబించిది.అందులో బైజుస్ క్లాసెస్ వ్యవస్థాపకుడు బైజు రవీందర్,జోమతో సహావ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా లతో పాటు మరో ముగ్గురికి చోటు దక్కింది.52 దేశాల్లో వివిధ రంగాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన 115 మంది యువకుల (40ఏళ్ల లోపు వాళ్ళు)తో కూడిన జాబితాను జెనివా కు చెందిన డబ్ల్యుఈఎఫ్ రూపొందించింది. జాబితాలో అంటారా సీనియర్ లవింగ్ సిఈవో తారాసింగ్ వచాని,వినతి అర్గానిక్స్ ఎండి,సియివో వినతి,లోరా ఎకలజికల్ సొల్యుషన్స్ సియివో స్వపన్ మేహ్రాలు కూడా భారత్ కు చెందిన వారే .
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యు ఈఎఫ్ రూపొందించిన యాంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతియులకు అయిదురు కి చోటు:
ఎక్కడ: న్యు డిల్లి
ఎప్పుడు: మార్చ్ 11
కోశియస్కో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తుకారం :

తెలంగాణ యువకుడు పర్వతారోహకుడు అన్గోత్ తుకారం మరో అరుదైన రికార్డు సృష్టించాడు.ఆస్ట్రేలియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తైన పర్వతమైన కోషియాస్కో ను మార్చి 10న అధిరోహించాడు.ఏడూ ఖండలలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలానే లక్ష్యంతో పర్వతారోహణ మొట్టమొదట మొదలుపెట్టిన అంగోతు తుకారం ఇప్పటికేనాలుగు ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు.తాజాగా కోశియాస్కో ను అధిరోహించడంతో ఐదు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.ఆస్ట్రేలియా లోని కోశియాస్కో పర్వతాన్ని అధిరోహించడానికి మార్చి5 హైదరాబద్ నుంచి బయలుదేరిన తుకారం8న అక్కడికి చేరుకున్నారు.మార్చి 8 న సాహస యాత్ర ప్రారంబించి 10వ తేదికి పూర్తి చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోశియస్కో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తుకారం
ఎక్కడ: ఆస్త్రేలియ
ఎవరు: తుకారాం
ఎప్పుడు:మర్చి 11
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న పి.వి సింధు :

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పి.వి సింధు 2019 సంవత్సరానికి బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రారంబ ఎడిషన్ ను గెలుచుకుంది. న్యుడిల్లి లో జరిగిన బిబిసి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు లబించింది.పారా – బ్యాడ్మింటన్ ప్లేయర్ మనసి జోషి బాక్సర్ మేరి కొం స్ప్రింటర్ ద్యుతి చంద్ మరియు రెజ్లర్ వినేష్ పోఘాట్ తో పాటు మరో నలుగురు పోటీ దారులతో ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. పివి సింధు ఒలింపిక్ రజత పథకం సాధించిన తొలి భారతీయ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరియు స్విట్జర్ లాండ్ లోని బాసెల్‌లో జరిగిన 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు కూడా సింధు కావడం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి:
ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న పి.వి సింధు :
ఎక్కడ:న్యుడిల్లి
ఎవరు: పి.వి సింధు
ఎప్పుడు:మార్చి 11
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |