Daily Current Affairs in Telugu -12-10-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -12-10-2019

rrb ntpc online exams in telugu

విశాఖ పోర్ట్ చైర్మన్ గా రామ మోహన్ రావు:

విశాఖ నౌకాశ్రయ చైర్మన్ గా ఉత్తర్ ప్రదేశ్ కేడర్ కు చెందిన కె.రామమోహన్ రావు ను నియమిస్తూ   డి.ఓ.పి.టి అధికారులు ఉత్తర్వులు  జారి చేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ డివిజినల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. 1994 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఆ రాష్ట్రంలో మూడు జిల్లాలకు సబ్ కలెక్టర్ గా పది జిల్లాలకు ముఖ్య అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : విశాఖ పోర్ట్ చైర్మన్ గా రామ మోహన్ రావు ఎప్పుడు : సెప్టెంబర్ 30

ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : కె.రామమోహన్ రావు

ఎక్కడ: విశాఖ పోర్ట్

హైదరాబద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ :

దేశంలోని మొదటి నేషనల్ డిజైన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాక మంత్రి కె.టి రామారావు అక్టోబర్ 12న తెలిపారు. హైదరాబాద్ ను అత్యుత్తమ అంతర్జాతీయ డిజైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హైదరాబద్ లో నేషనల్ డిజైన్ సెంటర్

ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : కె.టి రామారావు

ఎక్కడ: హైదరాబాద్

సిమి ఉగ్రవాది అజహరుద్దీన్ అరెస్ట్:

నిషేదిత ఉగ్రవాద సంస్థ సిమి ( స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) సభ్యడు అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని చత్తిస్ ఘడ్ పోలీసులు అక్టోబర్ 12 న అర్దరాత్రి శంషాబాద్ లో అరెస్ట్ చేశారు.గయాతో పాటు పాట్నాలో ఆరేళ్ళ క్రితం జరిగిన బాంబు పేలుళ్ళతో సంబంధాలున్నయంటూ అతని పై కేసు నమోదు చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : సిమి ఉగ్రవాది అజహరుద్దీన్ అరెస్ట్

ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని

ఎక్కడ: శంషాబాద్ , హైదరాబాద్

మోది,షి జిన్ పింగ్ ల 2 రోజుల చర్చలు సఫలం:

భారత ప్రదాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ల మధ్య రెండు రోజుల పాటు ఏడు గంటల సేపు సాగిన చర్చలు సఫలం అయ్యాయి. దాదపు 16 అంశాల పై మోడీ మరియు షి జిన్ పింగ్ ల ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పెట్టుబడుల రంగాల్లో సమస్యలను అధిగమించడానికి రెండు దేశాల మంత్రుల అధ్వర్యంలో ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నది కీలక నిర్ణయం. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో భారత్ కు ఉన్న లోటును తగ్గించడానికి కృషిచేస్తామని చైనా హామీ ఇవ్వడం మరో పరిణామం. సైన్యాల మధ్య కుడా సమాచారం ఉండాలని నిర్ణయించుకొవడం కుడా మరో ముఖ్య నిర్ణయం.

క్విక్ రివ్యు :

ఏమిటి : మోది,షి జిన్ పింగ్ ల 2 రోజుల చర్చలు సఫలం

ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్

ఎక్కడ: మామల్లపురం,తమిళనాడు

ఊపిరితిత్తుల ఆరోగ్యం పై అంతర్జాతీయ సదస్సు:

ఊపిరితిత్తుల ఆరోగ్యం – క్షయ అంశంపై  హైదరబాద్ లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు పారిస్ లోని టి.బి నిర్మూలన అంతర్జాతీయ సమాఖ్య తో కలిసి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య సమాఖ్య(టేక్కి) అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఊపిరితిత్తుల ఆరోగ్యం పై అంతర్జాతీయ సదస్సు

ఎప్పుడు : అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు

ఎవరు : తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య సమాఖ్య(టేక్కి)

ఎక్కడ: మామల్ల హైదరబాద్

ప్రపంచ యూత్ చెస్ లో తెలంగాణ కుర్రాడు కు కాంస్య పతకం:

ప్రపంచ యూత్ చెస్ లో తెలంగాణ కుర్రాడు శ్రీశ్వాన్ సత్తా చాటాడు. అండర్ – 14 విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. టోర్నిలో ఓ దశలో వెనుకబడ్డట్లు కనిపించిన శ్రీశ్వాన్ తిరిగి పుంజుకున్నాడు. చివరి రౌండ్లో అభినందన్ పై విజయం సాధించాడు. మొత్తం 11 రౌండ్ల నుంచి ఎనిమిది పాయింట్లు రాబట్టిన అతను మూడో స్థానంలో నిలిచాడు. 13 ఏళ్ళకే ఇంటర్ నేషనల్ మాస్టర్ గా నిలిచి తెలంగాణ నుంచి అతి పిన్న వయసులో ఆ ఘనత సాధించిన క్రీడాకారుడిగా ఇదివరకే శ్రీశ్వాన్ రికార్డు సృష్టించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ యూత్ చెస్ లో తెలంగాణ కుర్రాడు కు కాంస్య పతకం

ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : శ్రీశ్వాన్

ఎక్కడ: ముంబై, ఇండియా

ప్రపంచ బిలియార్డ్స్ రన్నరప్ కొటారి:

ప్రపంచ బిలియార్డ్స్ టైటిల్ ను నిలబెట్టుకోవాలనుకున్న సౌరబ్ కొటారి ఆశ తీరలేదు. ఈ టోర్నీ ప్రి క్వార్టర్స్ లో ఫేవరేట్ పంకజ్ అద్వానీకి షాక్ ఇచ్చి ఫైనల్ దూసుకొచ్చిన కొటారి తుది సమరంలో ఆ జోరు కొనసాగించలేకపోయాడు. అక్టోబర్ 12న జరిగిన ఫైనల్ లో కొటారి 967 – 1307 తో మాజీ చాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడాడు. ఆరేళ్ళ విరామం తర్వాత పీటర్ ఈ టైటిల్ గెలవడం విశేషం.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ బిలియార్డ్స్ రన్నరప్ కొటారి

 ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు సౌరబ్ కొటారి

ఎక్కడ: మెల్ బోర్న్

రెండు గంటల్లోపే  మారథాన్ :

కెన్యా అథ్లెట్ ఎలియాడ్ కీప్ చోగ్ చరిత్ర సృష్టించాడు. రెండు గంటల లోపే మారథాన్ (41.195 కిలో మీటర్లు) ను పూర్తీ చేసి ఈ ఘనత ను సాధించిన తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు. అక్టోబర్ 12 న వియాన్న లోని ప్రేటర్ పార్క్ లో ప్రత్యేక సౌకర్యాల మధ్య నిర్వహించిన మారథాన్ రేసు ను అతను గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో పూర్తీ చేశాడు. ఇది అధికారిక రేసు కాదు కాబట్టి ఈ రికార్డు ను పరిగణించే అవకాశం లేదు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కెన్యా అథ్లెట్ ఎలియాడ్ కీప్ చోగ్ చరిత్ర సృష్టించాడు. రెండు గంటల లోపే మారథాన్ (41.195 కిలో మీటర్లు) ను పూర్తీ చేసి ఈ ఘనత ను సాధించిన తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు

 ఎప్పుడు : అక్టోబర్ 12

ఎవరు : కెన్యా అథ్లెట్ ఎలియాడ్ కీప్ చోగ్

ఎక్కడ వియాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *