Daily Current Affairs in Telugu -12-11-2019
ఆ సాలీడు పేరు …. సచిన్ :
గుజరాత్ ఎకాలజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జీఆర్ ) కు చెందిన పరిశోదకుడు దృవ్ ప్రజాపతి తాను కొత్తగా కనుగొన్న ఓ జాతి సాలీడు కు చెందిన భారత్ క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారు . ఆయనతో పాటు పరిశోదనలు సాగిస్తున్న మరో శాస్త్రవేత్త మరో సాలీడు జాతిని కొత్తగా కనుగొన్నప్పటికీ అందుకు సంబందిచిన విస్తృత పరిశోదన అంతా కూడా ప్రజాపతే సాగించారు . కేరళలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన సెయింట్ కురియకోస్ ఎలియాస్ చవరటేర పేరు దానికి పెట్టారు . ఒక జాతి సాలీడు పేరు మారెంగో సచిన్ టెండూల్కర్ కాగా,రెండో దాని పేరు ఇండో మారెంగో చవరపటేర. మరంగో టెండూల్కర్ రకం కేరళ , తమిల్ నాడు , గుజరాత్ రాష్ట్రాల్లో కనిపిస్తుందని ప్రజాపతి చెప్పారు .
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆ సాలీడు పేరు …. సచిన్
ఎవరు: దృవ్ ప్రజాపతి
ఎక్కడ: గుజరాత్ ఎకాలజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్
ఎప్పుడు: నవంబర్ 12-2019
మారిషస్ ప్రధానిగా ప్రవింద్ జగన్నాద్ ప్రమాణస్వీకారం
మారిషస్ ప్రధానిగా ప్రవింద్ జగన్నాద్ (57) నవంబర్12 న ప్రమాణస్వీకారం చేశారు. అద్యక్షుడు బెర్గెన్ వ్యాపురి అధికారిక నివాసం లో జగన్నాద్ ప్రమానస్వీకారోత్సవం జరిగింది. ఎన్నికల్లో ఆయన సారద్యం లో సంకీర్ణ విజయం సాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మారిషస్ ప్రధానిగా ప్రవింద్ జగన్నాద్ ప్రమాణస్వీకారం
ఎవరు: ప్రవింద్ జగన్నాద్
ఎక్కడ: మారిషస్
ఎప్పుడు: నవంబర్ 12-2019
జీడిపి వృద్ది 5 శాతమే 2019-20 పై ఎస్ బీఐ నివేదిక అంచన :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) లో భారత వృద్ది 5 శాతానికి పరిమితం కావోచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇంతకు ముందు జీడిపి వృద్ది అంచనా అయిన 6.1 శాతానికి సవరించింది . బలహీన వాహన విక్రయాలు ,మౌలిక రంగం డీలా పడడం, నిర్మాణ రంగం లో పెట్టుబడులు తగ్గడం లో రెండో త్రిమసికంలో వృద్ది 4.2 శాతానికి దిగాజరోచ్చని నివేదికలో అభిప్రాయపడింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) లో వృద్ది 6.2 శాతానికి పుంజుకోవచ్చని పేర్కొంది. ఆర్ధిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ డిసెంబర్ ద్రవ్య పరపతి విదాన సమీక్షలో భారీగా రేట్ల కోతలు విదించవచ్చని అంచనా వేసింది.సెప్టెంబర్ లో పారిశ్రామికొత్పత్తి 4.3 శాతానికి చేరడం పట్ల ఎస్బిఐ నివేదిక ఆందోలన వ్యక్తం చేసింది .
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీడిపి వృద్ది 5 శాతమే 2019-20 పై ఎస్ బీఐ నివేదిక అంచన
ఎవరు ఎస్బీఐ
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు:నవంబర్ 12-2019
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్కిటెక్చర్ , ,ఫైన్ఆర్ట్స్ వర్శిటీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఆర్కిటెక్చర్ ,ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు . ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో జవర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ , షైన్ వర్శిటీ ఉంది. విభజన అనతరం ఎపి లో ప్రత్యేక వర్శిటీ ని ఏర్పాటు చేయాల్సి ఉంది . వచ్చే విద్య సంవత్సరం నుంచి సేవలు అందించేలా ఆర్కిటెక్చర్ ,షైన్ వర్శిటీ ని అందుభాటులో కి తీసుకున్నారు . దీనికి వై ఎస్ . రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్కిటెక్చర్ , ,ఫైన్ఆర్ట్స్ వర్శిటీ
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి రాఘ వాచారి పేరు :
పత్రిక రంగం లో రాఘవా చారి చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు అని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవుల పల్లి అమర్ ప్రకటించారు . నవంబర్ 12 న విజయవాడలో ప్రముఖ పాత్రికేయుడు ,విశాలాంద్ర పూర్వ సంపాదకుడు రాఘవాచారి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక నుంచి ప్రెస్ అకాడమి ని రాఘవాచారి ప్రెస్ అకాడమిగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి రాఘ వాచారి పేరు
ఎవరు : రాఘవా చారి
ఎక్కడ: విజయవాడ
ఎప్పుడు:నవంబర్ 12-2019
Daily Current Affairs in Telugu -11-11-2019
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |