Daily Current Affairs in Telugu -11-11-2019
హైదరాబాద్ లో ఇండియాజాయ్ సదస్సు 2019:
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి తెలంగాణ వేదిక కానుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో డిజిటల్ మీడియా,యానిమేషన్ , విఎఫ్ఎక్స్ వినోద రంగ సదస్సు “ ఇండియాజాయ్ -2019” జరగనుంది . రాష్ట్ర ప్రబుత్వ సహకారంతో టర్నర్ ఇంటర్నేషనల్ ,వయాకాం 18,సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ,డిస్కవరీకమ్యునికేషన్ శేమారు,పూట్,డీక్యు ఎంటర్ ప్రేన్యుర్ షిప్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్,రిలయన్సు బిగ్ యానిమేషన్ ,హైటెక్ యానిమేషన్ వంటి సంస్తలు దీని నిర్వహణలో పాలు పంచుకున్నాయి . సదస్సు లో వివిధ దేశాల నుంచి దిగ్గజ సంస్తల ప్రతినిధులు , నిపుణులు పాల్గొన్నారు .
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ లో ఇండియా జాయ్ సదస్సు 2019
ఎపుడు : నవంబర్ 20 నుంచి 23
ఎక్కడ: హైదరాబాద్
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా సుబ్రమణ్యం:
తెలంగాణ న్యాయసేవాదికార సంస్ట సభ్య కార్యదర్శిగా మహబూబ్ నగర్ జిల్లా కోర్టు సెషన్స్ న్యాయమూర్తి జీ.వి. సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10 న ఉత్తర్వులు జారీచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా సుబ్రమణ్యం నియామకం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు : జీ.వి . సుబ్రహ్మణ్యం
ఎక్కడ: హైదరాబాద్
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
పార్లమెంటరి స్థాయి సంఘం లో మన్మోహన్ నియామకం :
ఆర్ధిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్థానంలో మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ ను నియమిస్తూ రాజ్యాసభ చైర్మన్ . ఎం . వెంకయ్య నాయుడు ఉత్తర్వులు జారి చేశారు . మన్మోహన్ సింగ్ నియామకానికి వీలుగా దిగ్విజయ్ ఆ పదవికి రాజీనామా చేశారు . పట్టనాబివృద్ది స్థాయి సంఘంలో దిగ్విజయ్ ను నియమించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: పార్లమెంటరి స్థాయి సంఘం లో మన్మోహన్ నియామకం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు మన్మోహన్
ఎక్కడ: ఢిల్లీ
శ్రీ దేవి దేవి రెడ్డికి జాతీయ పురస్కారం :
వరంగల్ కు చెందినా శ్రీదేవి దేవిరెడ్డి కి అరుదైన గౌరవం దక్కింది . ఢిల్లీ లోని ప్రవాసి భవన్ లో జరిగిన జాతీయ ఔత్సహిక వేత్త అవార్డుల కార్యక్రమలో ఆమెకు ప్రైవేటు సెక్టార్ మెంటార్ పురస్కారం లభించింది . జాతీయ నైపున్యాబివ్రుద్ది , ఎంటర్ ప్రేన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో జరిగన కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ మహెంద్రనాద్ పాండే ఈ పురస్కారాన్ని అందించారు .తెలంగాణా నుంచి ఈ అవార్డు పొందిన తొలి మహిళ శ్రీదేవి కావడం గమనార్హం . ఎస్ ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజి వరంగల్ కి ఆమె వ్యవస్తాపక సి.ఇ.ఓ. గా ఉన్నారు .కేవలం రెండేళ్ళలోనే వినూత్న ఎకో సిస్టం ను సృస్తిచడంలో విజయం సాదించారు .
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ దేవి దేవి రెడ్డి కి జాతీయ పురస్కారం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు శ్రీ దేవి దేవి రెడ్డి
ఎక్కడ: ఢిల్లీ
ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో సుందర్ సింగ్ కు స్వర్ణం :
ప్రపంచ పార అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో భారత అథ్లెటిక్ సుందర్ సింగ్ గుర్జార్ సత్తా చాటాడు . పురుషుల ఎఫ్ 46 జవేలిన్ త్రో టైటిల్ ను నిలబెట్టుకున్న అతను టోక్యో 2020 పారా ఒలింపిక్స్ బెర్తును సాధించారు. మూడు ,నాలుగు స్థానాల్లో నిలిఛిన అజిత్ సింగ్ ,రింకూ లు కూడా కోటా స్థానాలు దక్కిన్చుకు న్నారు. నవంబర్ 10 న జరిగిన పోటిలో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో జవేలిన్ ను (61.22) మీటర్ల దూరం విసిరిన సుందర్ పసిడి కైవసం చేసుకున్నారు. ప్రపంచ పారా ఒలింపిక్ చంపియన్ షిప్లో రెండు పతకాలు గెలిచిన భారత అథ్లెట్ గా సుందర్ సింగ్ రికార్డు సృష్టించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో సుందర్ సింగ్ కు స్వర్ణం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు : సౌరబ్ చౌదరి
ఎక్కడ: దుబాయి
ఆసియ చాంపియన్ షిప్ లో సౌరబ్ చౌదరి ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో రజతం కైవసం :
యువ సంచలనం సౌరబ్ చౌదరి ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో రజతం కైవసం చేసుకున్నారు.10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 244.5పాయింట్ లు సాదించిన అతడు రెండో స్థానంలో నిలిచాడు .ఉత్తరకొరియ షూటర్ కిం సాంగ్ ప్రపంచ రికార్డు స్కోర్ (246.5) లో స్వర్ణం నెగ్గాడు. క్వాలిఫయింగ్ లో 583స్కోర్ తో సౌరబ్ చోదరి తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్లో చేరాడు .ఎనిమిది మంది మద్య ఫైనల్లో అభిషేక్ ఐదో స్తానానికి పరిమితంగా కాగ సౌరబ్ రజతం నెగ్గాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా పియన్ షిప్ లో సౌరబ్ చౌదరి ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో రజతం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు : సౌరబ్ చౌదరి
ఎక్కడ దోహ
రాష్ట్రానికి నీలం సాహ్ని సిఎస్ గా నియమాకం మార్గం సుగమం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నీలం సాహ్ని నియామకం కు మార్గం సుగమం అయింది .ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం ,సాధికార శాఖా కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆ విధుల నుంచి రేలివ్ చేస్తు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖా నవంబర్ 10 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర నియామకాలకు కేబినేట్ కమిటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది .1984 బ్యాచ్ ఏపీ కేదార్ కు చెందినా నీలం సాహ్ని ఏది వరకు కేంద్ర విజిలెన్సు కమిషన్ కార్యదర్శిగా సేవలందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రానికి నీలం సాహ్ని సిఎస్ గా నియమాకం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు : నీలం సాహ్ని
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
నాసా నుంచి విద్యుత్ విమానానికి తయారికి రంఘం సిద్దం :
కాలుష్యానికి తావు లేని నిష్శ్సబ్ద విమానయానం కోసం అమెరిక అంతరిక్ష సంస్థ నాస అడుగులు వేస్తుంది . పూర్తిగా విద్యత్ తో నడిచే తన తొలి ప్రయోగాత్మక విమానాన్ని ఆ సంస్థ అవిష్కరిచింది . వచ్చే ఏడాది ఏది గగనవిహారం చేయనుంది . ఎక్స్ -57 మ్యాక్స్ వెల్ అనే విమానామ్ 2015 నుంచి అభివృద్ది దశలో ఉంది. ఇటలీ కి చెందినా పే2006టే అనే లోహ విహంగానికి మార్పులు చేర్పులు చేసి నాసా దీని సిద్దం చేసింది .ప్రస్తుతానికి రెండింటినే అమర్చారు . ప్రత్యేకంగా రూపొందించిన లిథియం ఐయాన్ బాటరీ ల నుంచి వీటికి శక్తి అందుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాసా నుంచి విద్యుత్ విమానానికి తయారికి రంగం సిద్దం
ఎపుడు : నవంబర్ 11 -2019
ఎవరు :నాసా
ఎక్కడ :వాషింగ్టన్
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |