
Daily Current Affairs in Telugu 13-03-2020
గ్రీస్ అద్యక్ష పదవిలో తొలిసారిగా మహిళ కు బాద్యతలు :

గ్రీస్ అద్యక్ష పదవికి తొలిసారి ఓ మహిళ ఆ అద్యక్ష పీటాన్ని అలంకించారు. హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కాతెరినా సాకేల్లోపల్లో మార్చి 13 న ఈ బాద్యతలు చేపట్టారు.కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో పార్లమెంటు భవనంలో అతి పెద్ద భవనం లో అతి కొద్ది మంది చట్ట సబ్యులు పాత్రికేయులు సమక్షంలో ఆమె ప్రమాణం చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గ్రీస్ అద్యక్ష పదవిలో తొలిసారిగా మహిళ కు బాద్యతలు
ఎక్కడ:గ్రీస్
ఎవరు: జస్టిస్ కాతెరినా
ఎప్పుడు:మార్చి 13
లండన్లో మ్యుజియం గా అంబేద్కర్ నివాసం ;

భారత రాజ్యాంగ ఫ్రూప శిల్పి బిఆర్ అంబేద్కర్ ఉత్తర లండన్ లో నివసించిన ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి బ్రిటన్ ప్రబుత్వం అంగీకారం తెలిపింది. నివాస ప్రాంతానికి సంబంధించిన ప్లానింగ్ నిబందనల ఉల్లంగన జరిగినదన్న ఆరోపణలతో ఆ ఇంటిని మూసి వేయాలని తొలుత ఇక్కడి సర్కారు నిర్ణయించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ భారత్ చేరిన అప్పిలును తాజాగా అమోధించిది. అంబేద్కర్ నివాసాన్ని సందర్షుకుల కోసం తెరిచి ఉంచాలని నిర్నయించింది. 1921-22 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యను అబ్యాసించిన సమయంలో అంబేద్కర్ ఇక్కడ నివాసం ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: లండన్లో మ్యుజియం గా అంబేద్కర్ నివాసం
ఎక్కడ:లండన్
ఎప్పుడు:మార్చి 13
తొలిసారి రంజీ చాంపియన్ విజేతగా నిలిచిన సౌరాష్ట్ర టీం :

సౌరాష్ట్ర రంజీ చాంపియన్ గా అవతరించిది. బెంగాల్ పోరాటం గుబులు రేపినా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (44) పరుగులు ద్వారా ట్రోఫీ అందుకుంటుంది. రంజీ ట్రోఫీ సాధించడం ఆ జట్టుకు ఇదే తొలిసారి సౌరాష్ట్ర తొలిసారి గా ఇన్నింగ్స్ స్కోరు 425 పరుగులకు జవాబుగా అయిదో రోజు మార్చి 12 న జరిగిన మ్యాచ్ ఓవర్ నైట్ స్కోరు 354 /6 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించడం లో బంగాల్ ను సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్ఘాట్ (2/96) దెబ్బ కొట్టాడు.అతను ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 105/4 తో ఉండగా పలితం తేలే అవకాశం లేకపోవడంతోఇరు జట్లు కెప్టెన్లు డ్రా కు అంగీకరించారు.తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆదారంగా సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ ని అందుకుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: తొలిసారి రంజీ చాంపియన్ విజేతగా నిలిచిన సౌరాష్ట్ర టీం :
ఎక్కడ: రాజ్ కోట్
ఎవరు:సౌరాష్ట్ర టీం
ఎప్పుడు:మార్చి 13
గ్లోబల్ యానిమల్ ప్రొటెక్షన్ ఇండెక్స్ 2020 లో భారత్ రెండవ స్థానం :

గ్లోబల్ యానిమల్ ప్రొటెక్షన్ ఇండెక్స్ 2020 లో భారత దేశానికి రెండవ ర్యాంక్ లబించింది. ఈ సూచికను అంతర్జాతీయ జంతు సంక్షేమ స్వచ్చంద సంస్థ వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ విడుదల చేసింది.ఇండెక్స్ లో భారత్ సి ర్యాంకు సాధించింది.స్పెయిన్ ,మెక్సికో ఫ్రాన్స్ న్యూజిలాండ్ లతో పాటు భారత్ కు స్థానం లబించింది. స్వీడన్ యునైటెడ్ కింగ్ డం మరియు ఆస్ట్రియా అత్యధిక స్కోర్ లతో రేట్ నమోదు చేయబడ్డాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: గ్లోబల్ యానిమల్ ప్రొటెక్షన్ ఇండెక్స్ 2020 లో భారత్ రెండవ స్థానం
ఎవరు: భారత దేశం
ఎప్పుడు: మార్చి 13
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టోక్యో ఒలింపిక్స్ కు శివ పాల్ సింగ్ అర్హత ;

భారత జువేలియన్ త్రోయర్ శివ పాల్ సింగ్ ఒక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికా లో జరిగిన ఎసి ఎన్డబ్ల్యు అట్లేతిక్స్ మీట్ లో శివ పాల్ సింగ్ ఈటే ను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు.ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ కు అర్హత ప్రమాణ 85మీటర్ల ను కూడా శివ పాల్ సింగ్ అధిగమించాడు.భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్ కు అర్హత పొందిన రెండో జువెలిన్ త్రోయర్ శివ పాల్ సింగ్ ఇప్ప్పటికే నీరజ్ చోప్రా టోక్యో క్రీడల్లో బెర్త్ సాధించాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ కు శివ పాల్ సింగ్ అర్హత
ఎక్కడ: టోక్యో
ఎవరు: శివ పాల్ సింగ్
ఎప్పుడు: మర్చి 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |