Daily Current Affairs in Telugu 09-05-2021
రెండోసారి లండన్ మేయర్ గా ఎన్నిక అయిన పాకిస్థాన్ సంతతికి చెందిన సాదిఖ్ ఖాన్ :
పాకిస్థాన్ సంతతికి చెందిన సాదిఖ్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్ గా గెలుపొందారు. లేబర్ పార్టీనుంచి పోటీ చేసిన సాదిఖ్ ఖాన్ 55.2 శాతం ఓట్లు సాధించారు. 2016 లో లండన్ మేయర్ గా గెలుపొంది బ్రిటన్ లో మొట్టమొదటి ముస్లిం మేయర్ గా ఆయన నిలిచారు. గత వారం జరిగిన లండన్ స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి షాన్ బెయిలీపై విజయం సాధించారు. లండన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు అని సాదిఖ్ ఖాన్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రెండోసారి లండన్ మేయర్ గా ఎన్నిక అయిన పాకిస్థాన్ సంతతికి చెందిన సాదిఖ్ ఖాన్
ఎవరు: సాదిఖ్ ఖాన్
ఎక్కడ: లండన్
ఎప్పుడు: మే 9
అస్సాం రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి గా హిమంత బిశ్వశర్మ ఎన్నిక :
అస్సాంలో భాజపా శాసనసభాపక్ష నేతగా హిమంత బిశ్వశర్మ ఆది వారం ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష సమావే శానికి ముందు రాజ్భవన్ లో గవర్నర్ ప్రొఫె సర్ జగదీష్ ముఖిని ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. శాసనసభాపక్ష సమావేశంలో హిమంత పేరును సోనోవాల్ స్వయంగా ప్రతి పాదించారు. సమావేశం ఏకగ్రీవంగా కొత్త నేతను ఎన్నుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకునిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్పార్టీ కేంద్ర పరిశీలకునిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజర య్యారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగానూ శర్మ ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. దీంతో హిమంత అస్సాం 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 52 ఏళ్ల హిమంత బిశ్వశర్మ విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన 2001లో జలక్ బరి నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అస్సాం రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి గా హిమంత బిశ్వశర్మ ఎన్నిక
ఎవరు: హిమంత బిశ్వశర్మ
ఎక్కడ: అస్సాం రాష్ట్ర౦
ఎప్పుడు: మే 9
భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ప్రతినిధులను తెలంగాణా నుంచి కోచ్ గోపీ చంద్ ఎంపిక :
కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు, కోచ్లకు సాయంగా నిలవడం కోసం కేంద్ర | క్రీడా మంత్రిత్వ శాఖ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) చేతులు కలిపాయి. అవసరాల్లో ఉన్న వాళ్లకు ఆర్థికంగా, వైద్యప రంగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. అయితే ఆ సాయం కోసం అంతర్జాల వేదికగా అథ్లెట్లు, కోచ్లు తమ అవసరాలను విన్నవిం చాల్సి ఉంటుంది. ఈ సాయాన్ని వాళ్లకు చేర్చేం దుకు వీలుగా కొన్ని రాష్ట్రాల వారీగా ఐఓఏ ప్రతినిధులను ఎంపిక చేసింది. అందులో తెలం గాణ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీ చంద్, భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, జగదీశ్వర్ రావు, మహేశ్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాఘవేంద్ర, సుభాన్ బాష ఎంపికయ్యారు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ప్రతినిధులను తెలంగాణా నుంచి కోచ్ గోపీ చంద్ ఎంపిక
ఎవరు: గోపీ చంద్
ఎప్పుడు: మే 8
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంఎం స్టాలిన్ ప్రమాణ స్వీకారం :
రాజ్‌భవన్‌లో మె7న తమిళనాడు ముఖ్యమంత్రిగా డిఎంకె చీఫ్ ఎం కె స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన ప్రమాణ స్వీకారం రాష్ట్ర గవర్నర్ ఐన బన్వారిలాల్ పురోహిత్ గారు మరియు అతని 33 మంది మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు 11 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, ఎంఎం స్టాలిన్ డిఎంకె ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగమైన ప్రభుత్వ ఉత్తర్వులపై సంతకం చేశారు. బియ్యం రేషన్ కార్డుదారులందరికీ రూ .2,000 జారీ చేశాడు. ఇది మొదటి దశ, రెండవ దశలో మరో రూ .2,000 ఇవ్వబడుతుంది. దీనికి రూ .4 వేల కోట్లకు పైగా కేటాయించారు. అన్ని టౌన్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో COVID-19 చికిత్స ఖర్చును CM ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకురానున్నామని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంఎం స్టాలిన్ ప్రమాణ స్వీకారం
ఎవరు: ఎంఎం స్టాలిన్
ఎక్కడ: తమిళనాడు
ఎప్పుడు: మే 8
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం గా మే 8 :
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని రెడ్ క్రెసెంట్ డే అని కూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం మే 8 న జరుపుకుంటారు. ఈ తేదీ అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) వ్యవస్థాపకుడు ఐన హెన్రీ డ్యూనాంట్ జయంతిని సూచిస్తుంది. అతను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. అతను మే 8, 1828 న జన్మించాడు. టుగెదర్ వి కాంట్ స్టాపబుల్ గా ప్రపంచ రెడ్‌క్రాస్ డే 2021 యొక్క థీమ్ గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం గా మే 8 :
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మే 8
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |