
Daily Current Affairs in Telugu 08-05-2021
దాదా సాహెబ్ ఫాల్కే చిత్రోత్సవాల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో విజేతగా నిలిచిన రామ్ అల్లాడి :‘

దాదా సాహెబ్ ఫాల్కే చిత్రోత్సవాల్లో ప్రవాసాంధ్రుడు రామ్ అల్లాడి ఉత్తమ దర్శకుడు విభాగంలో విజేతగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకి చెందిన దర్శకులు తీసిన సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో వివిధ విభాగాల్లో పోటీ పడ్డాయి. లో రామ్ అల్లాడి తీసిన ‘రాస్ మెటనోయా’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఆయనకి పురస్కారం లభించింది. నవంబర్ 2020లో. ఈ చిత్రం విడుదలైంది. మహాత్మాగాంధీ ‘ జీవితంపై తీసిన ఈ చిత్రానికి అప్పటికే పన్నెండుకిపైగా పురస్కారాలు వచ్చినట్టు రామ్ అల్లాడి తెలిపారు. ఆయన ప్రస్తుతం ‘నభాంసి’ పేరుతో సంస్కృతంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు
క్విక్ రివ్యు:
ఏమిటి: దాదా సాహెబ్ ఫాల్కే చిత్రోత్సవాల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో విజేతగా నిలిచిన రామ్ అల్లాడి
ఎవరు: రామ్ అల్లాడి
ఎప్పుడు: మె 08
పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారి పీఏఎస్) కు ఎంపికైన హిందూ యువతి :

పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారి ఓ హిందూ యువతి ఆ దేశ అత్యున్నత సర్వీసు అయిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పీఏఎస్) కు ఎంపికైంది. సింధ్ ప్రావినన్స్ లోని షికార్ కు చెందిన ఎంబీబీఎస్ వైద్యురాలు సనా రామ్ చంద్ ఈ ఘనత సాధించారు. పాక్ ప్రభుత్వం నిర్వహించిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్షలను మొత్తం 18,533 మంది రాశారు. ఇంటర్వ్యూ”వైద్య పరీక్షల అనంతరం 221 మందితో తుది జాబితా విడుదల చేశారు. అందులో సనా రామచంద్ పేరు కూడా ఉంది. ఇది మన దేశంలో ఐఏఎస్ తో సమానం.
క్విక్ రివ్యు:
ఏమిటి: పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారి పీఏఎస్) కు ఎంపికైన హిందూ యువతి
ఎవరు: సనా రామ్ చంద్
ఎక్కడ: పాకిస్థాన్
ఎప్పుడు: : మె 08
ఈయూ కౌన్సిల్ సమావేశానికి హాజరయిన ప్రదాని నరేంద్ర మోడి :

సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పదం కోసం చర్చలు తిరిగి ప్రారంభించేందుకు భారత్-ఈయూ అంగీకరించాయి. ఏప్రిల్ 08న జరిగిన ఈయూ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా హాజరయ్యారు. కరోనా టీకాలపై పేటెంట్లను రద్దు చేయాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలకాలని ఆయన ఈయూ దేశాలను కోరారు. అలా చేస్తే ప్రపంచమంతటికీ వాక్సిన్లు సమానంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భారత్-ఈయూ సంబంధాల బలోపేతంపై 27 సభ్య దేశాల ప్రతినిధులతో మోదీ చర్చించారు. సుస్థిర, సమగ్ర అనుసంధాన భాగస్వామ్యాన్ని భారత్-ఈయూ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వతంత్ర పెట్టుబడి రక్షణ ఒప్పందంపైనా చర్చలు ప్రారంభించడానికి అంగీకరించినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఈయూ కౌన్సిల్ సమావేశానికి హాజరయిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు: : మె 08
కెరీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి చరిత్ర సృష్టించిన లూయిస్ హామిల్టన్ :

ఫార్ములా వన్ ట్రాక్ పై రికార్డుల వేటలో దూసుకెళ్తున్న ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) మరో చరిత్ర సృష్టించాడు. కెరీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి రేసర్ గా నిలిచాడు. ఏప్రిల్ 08న స్పానిష్ గ్రాండ్ ప్రీ ఆర్హత రేసును అగ్రస్థానంతో ముగించిన ఈ మెర్సిడెజ్ రేసర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఒక నిమిషం 18.741 ‘సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న అతను ఈ గ్రాండ్ ప్రి అర్హత రేసు చరిత్ర.లోనే అత్యంత వేగవంతమైన టైమింగ్ ను నమోదు చేశాడు. వెర్ స్టాపెన్ (రెడబ్బుల్), బొటాస్ (మెర్సిడెజ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఏప్రిల్ 9జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానంతో మొదలెట్టనున్నాడు. అత్యధిక పోల్ పొజిషన్లు సాధించిన రేసర్లలో దిగ్గజం షుమాకర్ (68) రెండో స్థానంలో ఉన్నాడు. 2007లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన హామిల్టన్ అంచెలంచెలుగా ఎదిగి ఫార్ములావన్ సామ్రాజ్యానికి రారాజుగా మారాడు. ఇప్పటికే అత్యధిక గ్రాండ్ ప్రి విజయాలు పోల్ పొజిషన్ సాదించిన షుమాకర్ ను వెనక్కినెట్టిన హామిల్టన్ ఏడు ప్రపంచ చాంపియన్ టైటిళ్లతో అతని సరనస చేరారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: కెరీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి చరిత్ర సృష్టించిన లూయిస్ హామిల్టన్
ఎవరు: లూయిస్ హామిల్టన్
ఎప్పుడు: : మె 08
ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కేశవప్రసాద్ కన్నుమూత :

అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కేశవప్రసాద్(68) కరోనాతో ఏప్రిల్ 07న కన్నుమూశారు. పది రోజులుగా ఆయన ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కూచిపూడిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో జన్మించిన కేశవప్రసాద్ ఏటా కూచిపూడి నాట్యంతో పాటు పలు భారతీయ నృత్యరీతులతో 38 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తూ నాట్య ప్రాభవాన్ని దశదిశలా చాటారు. శ్రీబా లాత్రిపురసుందరి సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి వంశపారం పర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన నాట్య కళాశాలలో సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కేశవప్రసాద్ కన్నుమూత
ఎవరు: కేశవప్రసాద్
ఎప్పుడు: : మె 08
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |