Daily Current Affairs in Telugu 05 -05-2021
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన మమత బెనర్జీ :

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమత బెనర్జీ గారితో రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కడ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరపున మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన మమత బెనర్జీ
ఎవరు: మమత బెనర్జీ
ఎక్కడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర౦
ఎప్పుడు: ఏప్రిల్ 05
పశ్చిమ బెంగాల్ రాజధాని –కోల్ కతా
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి – మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ : జగదీప్ ధన్కడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డి నియామకం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిని నియమించారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును వీరు పర్యవేక్షిస్తారు. హరిప్రసాద్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఉల్చాల హరిప్రసాద్ రెండు దశాబ్దాలుగా పత్రికారంగంలో కొనసాగారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, లా లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కాకర్ల చెన్నారెడ్డి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో 15 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డి నియామకం
ఎవరు: హరిప్రసాద్, చెన్నారెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు: ఏప్రిల్ 05
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని – అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి –వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ – బిశ్వా భూషణ్ హరిచంద్
. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ రామన్ మీనాక్షి సుందరం నియమకం :

కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క ఆర్మ్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (HIRR) డైరెక్టర్ రామన్ మీనాక్షి సుందరం గారు నియమితులయ్యారు. దీనికి ముందు అతను ఇన్స్టిట్యూట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ (బయోటెక్నాలజీ) గా పనిచేస్తున్నారు. రైస్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బ్రీడింగ్, మరియు జెనోమిక్స్ రంగాలలో పనిచేస్తున్న గ్లోబల్ కీర్తి శాస్త్రవేత్త మరియు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో ప్రసిద్ధి చెందిన 160 పరిశోధనా పత్రాలను కలిగి ఉన్నాడు మరియు అనేక పుస్తకాలు, పుస్తక అధ్యాయాలు మరియు ప్రసిద్ధ కథనాలను ప్రచురించాడు
క్విక్ రివ్యు:
ఏమిటి: . ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ రామన్ మీనాక్షి సుందరం నియమకం
ఎవరు: రామన్ మీనాక్షి సుందరం
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 05
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.నారాయణ రాజు కన్నుమూత :

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి జి.నారాయణ రాజు (62) కరోనా బారిన పడి ఏప్రిల్ 04న రాత్రి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కేంద్ర న్యాయశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నారాయణరాజు కొంతకాలంగా న్యాయశాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇటీవలే కేంద్రం ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. కాగా నారాయణరాజు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు
క్విక్ రివ్యు:
ఏమిటి: కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.నారాయణ రాజు కన్నుమూత
ఎవరు: జి.నారాయణ రాజు
ఎప్పుడు: : ఏప్రిల్ 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |