Daily Current Affairs in Telugu -07-11-2019

Daily Current Affairs in Telugu -07-11-2019:

ప్రమాదాల పరిహారం 300% పెంపు : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి : బొగ్గు గనుల:

బొగ్గుగని మాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబాలకుచెల్లించే పరిహారాన్ని 300 % పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి  ప్రకటించారు. ప్రస్తుతం రూ.5 లక్షలున్న పరిహారాన్నిరూ.15 లక్షలకు పెరుగుతుందన్నారు అయన నవంబర్7న నాడు ఓడిషలో ఈ ప్రకటన  చేశారు. ఇది కోల్  ఇండియాతో పాటు ఎనిమిదీ రాష్ట్రాల్లో  ఉన్న దాని అనుబంద సంస్థలలో  వర్తిస్తుందని చెప్పారు.  ప్రమాదాల్లో మరణించిన వర్కర్లకు  వర్తిస్తుందని  వెల్లడించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రమాదాల పరిహారం 300% పెంపు : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి : బొగ్గు గనుల

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : కేంద్ర  మంత్రి  ప్రహ్లాద్ జోషి 

ఎక్కడ : ఓడిష.

జైలు సంస్కరణలో  తెలంగాణ బెష్ ;టాటా ట్రస్ట్ నివేదిక విడుదల:

తెలంగాణా జిల్లాలో నాలుగేళ్ళుగా మెచ్చుకొదగిన సంస్కరణలు వస్తున్నట్లు టాటా ట్రస్ట్ నివేదిక పేర్కొంది ఫలితంగా జిల్లాలో ఖైదిల్లోప్ర్వతన మెరుగవుతుందని తెలిపింది ఇక్కడ్నున్హి ఇతర రాష్టాలు నేర్చుకోవాల్సిన  ఆవాసం ఉంది అని  పేర్కొంది.  ఇక్కడ ప్రతి 7.5 లక్షల మందికి  ఒక పారా లీగల్ వాలంటీర్ ఉన్నారని  వివరించింది ఆర్.టి.ఐ ద్వారా సమాచారం కోరినప్పుడు ఇవ్వడంలో మాత్రం జైళ్ళ  విభాగం వద్ద  ఆలస్యం జరుగుతుందని పేర్కొంది. ఈ విభాగం జిల్లా స్థాయీ అధికారుల నుంచి సమాచార సమన్వయం చేసుకునే పరిస్థితి లేదని  స్పష్టం చేసింది. తెలంగాణ లోని సబర్దినెట్  కోర్టుల్లో 44 % మంది మహిళా న్యాయముర్తులు ఉండగ హైకోర్ట్ లో మాత్రం 10% ఉన్నారు  జిల్లా స్థాయి న్యాయ సేవల అథారిటీ ఇంకా ప్రారంభించాలి.మొత్తంగా మహారాష్ట్ర తొలి స్థానం సాధించగా కేరళ,తమిళనాడు తర్వాత స్థానాల్లో నిలిచాయి.తెలంగాణ 11వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : జైలు సంస్కరణ లో తెలంగాణకు 11వ స్థానం.

 ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : టాటా ట్రస్ట్

ఎక్కడ : ఓడిష.

హైదరాబాద్ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్  అవార్డు:

ఇన్ఫోసిస్ సైన్సు ఫౌండేషన్ నవంబర్ 7న ఇద్దరు మహిళల సహా ఆరుగురికి పురస్కారాలను ప్రకటించింది.ఇందులో హైదరాబాద్  సిసిఎంబి కి చెందిన చీఫ్  సైంటిస్ట్ మంజుల రెడ్డి ఉన్నారు. జీవ శాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. ఇంగేనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సులో సునీత సరవాగి(ముంబై) హుమనిటీస్ లో వి.దేవదేవన్ గణితంలో సిద్దార్థ, బౌతికశ శాస్త్రంలో జి.ముగేష్ (బెంగళూర్), సామజిక శాస్త్రంలో ఆనంద్ పాండియన్ (తమిళనాడు) లకు పురస్కారాలు దక్కాయి. ఇన్ఫోసిస్ విజ్ఞాన  ప్రతిష్టాన (ఐఎస్ఏఫ్) అద్వర్యంలో బెంగళూరు లో నవంబర్ 7న నిర్వహించిన  11వ ఇన్ఫోసిస్ ఫ్రిజ్-2019 కార్యక్రమంలో సంస్థ  వ్యవస్తాపకుడు నారాయణమూర్తి ఈ పురస్కారాలను ప్రకటిచారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హైదరాబాద్ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్  అవార్డు

 ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : ఇన్ఫోసిస్  సైన్సు  ఫౌండేషన్ 

ఎక్కడ : బెంగళూరు

నవంబర్ 27 న పీఎస్ఎల్వి-సి47 ప్రయోగం:

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి  నవంబర్27 న తేది ఉదయం 9.30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి- 47వాహక నౌకక నింగిలోకి పంపేందుకు శాస్త్రవేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వాహకనౌక అనుసందానం పూర్తయి  ఉపగ్రహం కోసం శాస్త్రవేతలు ఎదురు  చూస్తున్నారు. ఉపగ్రహం బెంగుళూరులోని యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి రావాల్సి ఉంది. షార్ లోని రెండవ  ప్రయోగం  వేదిక సమీపంలో వాహన అనుససందాన  భవనంలో పిఎస్ఎల్వి -17 అనుసందాన పనులు సాగుతున్నాయి. పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వార కార్టోశాట్ -3 ఉపగ్రహం తో పాటు విదేశాలాకు  చెందిన 14 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. షార్ లో నవంబర్ 7న  పీఎస్ఎల్వీ-సి48 అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : నవంబర్ 27 న పీఎస్ఎల్వి-సి47 ప్రయోగం

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : ఇస్రో

ఎక్కడ : నెల్లూరు జిల్లలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్

ఎస్పీడీసిఎల్ కు ఐసిసి పురస్కారాలు:

దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణి సంస్థ (టీఎస్ఎస్పిడీసిఎల్) కు ప్రతిష్టాత్మక ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామేర్స్(ఐసిసి) పురస్కారాలు దక్కాయి.డీల్లీలో నవంబర్ 7న నిర్వహించిన 13వ ఇండియా ఎనర్జీ సమ్మిట్లో కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి సుభాష్  చంద్రగార్గ్  చేతుల మీదుగా ఎస్పీడీసిఎల్ సి ఎమ్ డీ రఘుమారెడ్డి  ఈ పురస్కారాలు అందుకున్నారు. ఎస్పీడీసిఎల్ కు ఓవరాల్ విన్నర్ ;ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు 2019,ఎఫ్ఫిశిఎంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు ,టేక్నోలగిఅడప్షన్ అవార్డు , పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్మెంట్ అవార్డు దక్కాయి. రఘుమారెడ్డి  మాట్లాడుతూ విద్యుత్ పంపని వ్యవస్థను  పటిష్టం చేసి నాణ్యమైన సేవలు అందిచినందుకు ఈ పురస్కారాలు దక్కాయి అన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు  కచితమైన విద్యుత్ బిల్లుల కోసం ఐఆర్ /ఐ అర్డిఎ ఆదారిత విద్యత్ మీటర్లు , రాజధానిలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ స్కేడ/ డీఎంఎస్/ఎస్ఎఎస్ఎ వంటి పద్దతులు ప్రవేశాపెత్తనునట్లు వివరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎస్పీడీసిఎల్ కు ఐసిసి పురస్కారాలు

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : టీఎస్ఎస్పిడీసిఎల్

ఎక్కడ : డీల్లీ

ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద నిధుల కట్టడి సదస్సు కు హాజరైన కిషన్ రెడ్డి:

శాంతి భద్రతలు  అభివుద్దికి పొంచి వున్నా  అతి పెద్ద ముప్పుగా కేంద్ర హోం శాఖా సహాయమంత్రి  జి.కిషన్ రెడ్డి  అభివర్నిచారు . ఉగ్రవాదం పై దానికి అండగా నిలుస్తున్నవారిపై ఉమ్మడిగ పోరాడదామంటూ ప్రపంచ దేశాలకు అయన పిలుపునిచారు, ఆస్ట్రేలియాలోని  మెల్బోర్న్ లో నవంబర్ “ఉగ్రవాద నిధుల కట్టడి “ సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించకుడదన్నారు.. కొన్ని దేశాలు ముష్కరులకు మద్దతుగా నిలుస్తున్నాయంటూ  పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పిచారు.ఉగ్రవాదం పై పోరులో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద నిధుల కట్టడి సదస్సు కు హాజరైన కిషన్ రెడ్డి

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : కేంద్ర హోం శాఖా సహాయమంత్రి  జి.కిషన్ రెడ్డి  ‘

ఎక్కడ : ఆస్ట్రేలియాలోని  మెల్బోర్న్

కర్నాటక క్రికెటర్  గౌతం అరెస్ట్ ; కే పీఎల్ లో స్పాట్  ఫిక్సింగ్:

కర్ణాటక ప్రిమియర్ లీగ్ లో (కేపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలపై కర్ణాటక మాజీ రంజీ ఆటగాళ్ళు సిఎం గోతమ్, అబ్రార్  ఖాజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతం కేపేఎల్ లో బళ్ళారి టక్సర్స్ కు నాయకత్వం వహించాడు. వికెట్ కీపర్  బ్యాట్స్ మెన్ అబ్రార్ ఖాజీ అ జట్టులో సబ్యుడు. గత రెండు కేపీఎల్ సీజన్లో జరిగిన బెంగళూరు సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా ఇంకొంతమంది అరెస్ట్ అయ్యే అవకశం ఉంది. గౌతం ప్రస్తుతం గోవా కు ఆడుతుండగా ఖాజీ మిజోరం కు ప్రతినిత్యం వహిస్తున్నాడు.33ఏళ్ల గౌతమ దెల్లి డేర్ దెవిల్,ముంబై ఇండియాన్స్ ,రాయల్ చలెంజేర్స్  బెంగళూర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.94ఫస్ట్ క్లాసు మ్యాచ్ లు ఆడిన గౌతం ఈ  ఏడాదే  గోవా కు మారారు. 30 ఎల్లా ఖాజీ  ఆర్సిబీ తరుపున ఒక మ్యాచ్ ఆడాడు 17ఫిస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కర్నాటక క్రికెటర్  గౌతం అరెస్ట్

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : సిఎం గోతమ్, అబ్రార్  ఖాజీ ‘

ఎక్కడ : బెంగళూరు

ఆసియ షూటింగ్ ఛాంపియన్ షిప్  లో ఇషా కు డబుల్:

ఆసియ షూటింగ్ చాంపియన్స్షిప్ లో తెలంగాణ  అమ్మాయి ఇషా సింగ్ డబుల్ సాధించింది. అద్బుత ప్రదర్శనతో ఈ టీనేజర్ రెండు స్వర్ణాలు ఖాతాలో వేస్కుంది. 10మీటర్ల జూనియర్ మహిళల  పిస్టల్ విభాగం క్వాలిఫయింగ్ లో 579పాయింట్ల తో ఫైనల్కు అర్హత సాధించిన ఇషా తుది సమరంలో 242.2పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి పసిడి ఎగరేసుకుపాయింది. 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ జూనియర్ మహిళల టీం విభాగం లో ఇషా ,యువిక ,ప్రియ  ల తోకూడిన భారత జట్టు (1721పాయింట్లు) స్వర్ణం గెలుచుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆసియ షూటింగ్ ఛాంపియన్ షిప్  లో ఇషా కు డబుల్

ఎప్పుడు : నవంబర్ 7

ఎవరు : ఇషా సింగ్

ఎక్కడ : దోహా, ఖతర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *