Daily Current Affairs in Telugu 02-09-2021
అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచిన పుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో ;
రికార్డుల రారాజు ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ టైమ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. ప్రపంచకప్ అర్హత రౌండ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై రెండు గోల్స్ చేసిన ఈ పోర్చుగల్ స్టార్ ప్లేయర్ మొత్తం 111 గోల్స్. తోఇరాన్ మాజీ ఆటగాడు అలీ దేయి (109)ని వెనక్కినెట్టాడు. ఈ మ్యాచ్ లో పోర్చు గల్ 2-1 తేడాతో విజయం సాధించింది. యూరో కప్ సందర్భంగా అలీ రికార్డును సమంచేసిన రొనాల్డో భారీ అంచనాలతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో అడుగు పెట్టాడు. కానీ 15వ నిమిషంలో పెనాల్టీ అవకాశాన్ని వృథా చేయడంతో అభిమానులు నిరాశ చెందారు. రొనాల్డో గోల్ కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది. 45వ నిమిషంలోనే జాన్ చేసిన గోల్ ఐర్లాండ్ రొనాల్డో రికార్డు ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 89వ నిమిషంలో తలతో ప్రత్యర్థి గోల్పోస్టులోకి బంతిని పంపిన రొనాల్డో అలీని అధిగమించడంతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. అతను కూడా సంబరాల్లో మునిగిపోయాడు. ఆ తర్వాత అదనపు సమయంలో (90+6వ నిమిషంలో) మరో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించి ఈ మ్యాచ్ ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఆల్ టైమ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ జాబితాలో మరో దిగ్గజ ఆటగాడు మెస్సి (76) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచిన పుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో
ఎవరు: క్రిస్టియానో రోనాల్డో
ఎప్పుడు: సెప్టెంబర్ 02
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ &ఎండి గా అతుల్ భట్ నియామకం :
విశాఖపట్నంలోనిరాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎన్ఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట రుగా అతుల్ భట్ నియమితులయ్యారు. మెకాన్ సంస్థ సీఎండీగా ఉన్న ఆయనను రెండు నెలల కిందటే పబ్లిక్ సెక్టార్స్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. ఎంపిక తర్వాత చేపట్టే అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తవడంతో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్(ఏసీసీ) సెప్టెంబర్02న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 లో ఆయన పదవీ విరమణ చేసేంతవరకూ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. 1986లో దిల్లీ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పొందిన భట్ 1989లో ఐఐఎం కోల్కతాలో మేనేజ్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మెకాన్ లో చేరకముందు ఎన్ఎండీసీలో బిజినెస్ డెవలప్మెంట్ కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టరుగా బాధ్యతలను నిర్వర్తించారు.ఎన్ఎండీసీ చేప ట్టిన విలీనాలు, స్వాధీన (మెర్జర్స్, అక్విజిషన్స్) ప్రక్రియల్లో కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ &ఎండి గా అతుల్ భట్ నియామకం
ఎవరు: అతుల్ భట్
ఎప్పుడు: సెప్టెంబర్ 02
అసోంలోని రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్కుగా మార్చిన అస్సాం ప్రభుత్వం :
అసోంలోని రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేనల్ పార్క్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్ గాంధీ పేరును తొలగించి ఒరాంగ్ నేషనల్ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్ తీర్మానించింది. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ దేశంలోనే రాయల్ బెంగాల్ టైగర్స్ కి పెట్టింది పేరు. జాతీయ పార్క్ పేరును మార్చాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదివాసీ, టీ తెగ కమ్యూనిటీ డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేబినెట్ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును మార్చాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని తద్వారా మార్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.. దరాంగ్, ఉదల్గురి, సోనిత్పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న జాతీయ ఉద్యానవనం ఇండియన్ రైనోస్, రాయల్ బెంగాల్ టైగర్, పిగ్మీ హాగ్, అడవి ఏనుగులు ఉనాయి. 79.28 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్క్ 1985లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. 1999లో జాతీయ ఉద్యాన వనంగా అప్ గ్రేడ్ చేశారు. 1992లో అభయారణ్యానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టగా.తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2001లో రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనంగా మార్చింది.
- అస్సాం రాష్ట్ర రాజధాని :దిస్పూర్
- అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి : హిమంత బిశ్వ శర్మ
- అస్సాం రాష్ట గవర్నర్ : జగదీశ్ ముఖి
- అస్సాం రాష్ట్రము లో ని ప్రముఖ ప్రదేశాలు :. ఖజిరంగా నేషనల్ పార్క్
క్విక్ రివ్యు :
ఏమిటి: అసోంలోని రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్కుగా మార్చిన అస్సాం ప్రభుత్వం
ఎవరు: అస్సాం ప్రభుత్వం
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు: సెప్టెంబర్ 02
బిమ్స్ టేక్ దేశాల వ్యవసాయ నిపుణుల 8వ సమావేశానికి అద్యక్షత వహించిన భారత్ :
భారతదేశం BIMSTEC దేశాల వ్యవసాయ నిపుణుల 8వ సమావేశాన్ని నిర్వహిస్తోంది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మల్టీ సెక్టోరల్ టెక్నికల్ మరియు ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్ టేక్ దేశాల కోసం బెంగాల్ బే యొక్క 8 వ వ్యవసాయ నిపుణుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశానికి వ్యవసాయ పరిశోధన & విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మొహపాత్రా అధ్యక్షత వహించారు. ఐ.సి.ఎ.ఆర్ బిమ్.స్టేక్ లో దక్షిణ ఆసియా నుండి ఐదు సభ్య దేశాలు (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక), మరియు ఆగ్నేయాసియా నుండి రెండు, మయన్మార్ మరియు థాయ్‌లాండ్ ఉన్నాయి. ఈ సమావేశంలో, చైర్మన్ అస్సాం ప్రభుత్వం UN ఆహార వ్యవస్థ సమ్మిట్ 2021 మరియు పరివర్తన అంశాలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థలతో అంతటా జరుగుతోంది.
- బిమ్స్ టేక్ స్థాపన :1997 జూన్ 06
- బిమ్స్ టేక్ ప్రధాన కార్యాలయం : బంగ్లాదేశ్ (డాకా లో ) ఖాట్మండు (నేపాల్ )
- బిమ్స్ టేక్ పూర్తి రూపం : బె ఆఫ్ బెంగాల్ ఇన్షియేటివ్ ఫర్ మల్టీ సెక్టరాళ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్
- బిమ్స్ టేక్ లోని సభ్య దేశాలు :థాయ్ ల్యాండ్ ,మయన్మార్,నేపాల్ ,బంగ్లాదేశ్ ,శ్రీలంక ,భూటాన్ దేశాలు
క్విక్ రివ్యు :
ఏమిటి: బిమ్స్ టేక్ దేశాల వ్యవసాయ నిపుణుల 8వ సమావేశానికి అద్యక్షత వహించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: సెప్టెంబర్ 02
మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్ మిత్రా కన్నుమూత :
రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్ మిత్రా(65) కన్నుమూశారు. ఏడాదిపాటు అనారోగ్యం తో బాధపడుతున్న మిత్రా ఢిల్లీలోని నివాసంలో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు. జర్నలిస్ట్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన చందన్ మిత్రా ను సమకాలీన రాజకీయ పరిణామాలపై చురుగ్గా స్పందిస్తారనే పేరుంది. 1997లో పయనీర్లో కీలక బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా. హిందుస్తాన్ టైమ్స్ “తదితర పత్రికల్లో పనిచేశారు. అనారోగ్య కారణాలతో పయనీర్ పత్రిక పబ్లిషర్ హోదాకు రాజీనామా చేసిన ఆయన ఎడిటర్ గా కొనసాగుతున్నారు. బి.జే.పి తరపున రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన చందన్ మిత్రా, పార్టీ కురువృద్ధ నేత ఎల్.కే అద్వానీ గారికి సన్నిహితుడు. 2018లో చేపికి రాజీనామా చేసి, టి.ఎంసీలో చేరిన ఆయన క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్ మిత్రా కన్నుమూత
ఎవరు: చందన్ మిత్రా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 02
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |