Daily Current Affairs in Telugu 29-08-2021
22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) :
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నుంచి అత్యంత శక్తి సామర్థ్య యూనిట్ (ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్) సీఐఐ నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది. ఈ నెల 24 నుంచి 27 వరకూ వర్చు వల్ సమావేశం ద్వారా 30 మంది న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 9 విభిన్న రంగాల నుంచి 400 పరిశ్రమలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నాయి. నిర్ణేతల ప్యానెల్ పరిశీలన అనం తరం చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రోత్ కారిడార్లో ఉన్న ఆటోమోటివ్ యూనిట్కు ఇంజినీరింగ్ కేటగిరీ కింద పురస్కారం లభించింది. అదే విధంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ లోని చిన్న బ్యాటరీల డివిజన్ ప్లాంట్ ‘ఇన్నో వేటివ్ ప్రాజెక్టు అవార్డు’ను గెలుచుకుంది. న్యుమాటిక్ సిలిండర్ సైజ్ ఆప్టి మైజేషన్ చేయడం ద్వారా ఈ అవార్డును అందుకుంది.
- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) స్థాపన : 1895
- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అద్యక్షుడు : టి.వి నరెంద్రన్
- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)డైరెక్టర్ జనరల్ :చంద్రజిత్ బెనర్జీ
క్విక్ రివ్యు :
ఏమిటి: 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
ఎవరు: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
ఎప్పుడు:ఆగస్ట్ 30
అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నూతన అధిపతిగా మహ్మద్ ఎస్లామి నియామకం :
దేశంలోని అణుశక్తిని బలోపేతం చేయడానికి, ఇరాన్ ప్రభుత్వం ఆదివారం మాజీ రవాణా మంత్రి మహ్మద్ ఎస్లామిని ఆ దేశ అణు శాఖ కొత్త డైరెక్టర్‌గా నియమించింది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, కొత్తగా ఎన్నికైన ఇరాన్ హార్డ్-లైన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ 2013 నుండి ఇరాన్ యొక్క అత్యంత ప్రముఖ అణు శాస్త్రవేత్త మరియు AEOI చీఫ్‌గా ఉన్న అలీ అక్బర్ సలేహి స్థానంలో ఎస్లామీని నియమించారు. ఇంతలో, 65 ఏళ్ల ఎస్లామికి న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ముందస్తు అనుభవం లేదు. అయితే గతంలో సివిల్ ఇంజనీర్‌గా ఉన్నారు. అతను గతంలో దేశంలోని రోడ్ నెట్‌వర్క్‌లో పనిచేశాడు. అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనేది ఇరాన్ లో ని అణుశక్తి సంస్థ ఇరాన్ లో అణుశక్తి మరియు అణు ఇంధన చక్రాల సంస్థాపనలను నిర్వహించడానికి బాధ్యత వహించే ప్రధాన ఇరానియన్ ప్రభుత్వ సంస్థ.
క్విక్ రివ్యు :
ఏమిటి: అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నూతన అధిపతిగా మహ్మద్ ఎస్లామి నియామకం
ఎవరు: మహ్మద్ ఎస్లామి
ఎక్కడ: ఇరాన్
ఎప్పుడు: ఆగస్ట్ 30
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణపతకం గెలిచిన షూటర్ అవని లేఖారా :
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. షూటింగ్ భారత్ కూ బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో 621.7 స్కోరు సాధించింది. మరో మూడు మెడల్స్ ను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్ త్రోలో రజతం, జావెలిన్ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్ సింగ్కు కాంస్యం గెలుపొందాడు.
- టోక్యో పారాలింపిక్స్ లో తొలి పథకం సాధించిన క్రీడాకారిణి : భావీనా పటేల్
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణపతకం గెలిచిన షూటర్ అవని లేఖారా
ఎవరు: షూటర్ అవని లేఖారా
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 30
టోక్యో పారాలిమ్పిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన భారత జవేలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్ :
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. తన ఐదో అటేమ్ట్ లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. ఇప్పటి వరకు మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరింది. వాస్తవానికి భారత ఆటగాళ్లు సాధించింది8 పతకాలు కాగా, డిజేబిలిటీ క్లాసిఫికేషన్ లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని రద్దు చేశారు.
- జపాన్ దేశ రాజదాని : టోక్యో
- జపాన్ దేశ ప్రధాన మంత్రి : యోషిహిడె సుగా
- 2020 ఒలింపిక్స్ జరిగిన ప్రదేశం : టోక్యో (జపాన్)
- 2020 టోక్యో పారాలి౦పిక్స్ యొక్క థీం : యునైటెడ్ బై ఎమోషన్
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలిమ్పిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన భారత జవేలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్
ఎవరు: సుమిత్ ఆంటిల్
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 30
భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతియ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు :
భారత మాజీ క్రేకెటర్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాజీ దిగ్గజ ఆటగాడు రోజర్ బిన్నీ వారసుడిగా 2014లో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల స్టువర్ట్.. భారత్ తరపున 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2014లో ఢాకాలో బంగ్లాదేశ్లో జరిగిన వన్డేలో కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీయడం ద్వారా ఈ పేసర్ సంచలనం సృష్టించాడు. ఇప్పటికీ భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అతడివే.
- బి.సి.సి.ఐ కార్యాలయం : ముంబై
- బి.సి.సి.ఐ అద్యక్షుడు :సౌరబ్ గంగూలి
- ఐ.సి.సి చైర్మన్ : గ్రెగ్ బార్క్లే
- ఐ.సి.సి సబ్యుల సంఖ్య :106 సభ్యులు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతియ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: స్టువర్ట్ బిన్నీ
ఎప్పుడు: ఆగస్ట్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |