Daily Current Affairs in Telugu 29-03-2020
కేంద్ర మాజీ మంత్రి బెని ప్రసాద్ కన్నుమూత :
కేంద్ర మాజీ మంత్రి సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక సబ్యుడు బెని ప్రసాద్ వర్మ కన్నుమూశారు.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 27 న లక్నో లో ని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.ఉత్తరప్రదేశ్ బరబాకం లో 1941 ఫిబ్రవరి 11 న జన్మించిన ప్రసాద్ 1996 -98 కాలంలో అప్పటి వరకు ప్రదాని హెచ్ డి దేవగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా పనిచేశారు.అలాగే 2011 జనవరి 11 నుంచి 2014మే 26 వరకు ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి బెని ప్రసాద్ కన్నుమూత
ఎవరు: బెని ప్రసాద్
ఎప్పుడు: మార్చి 29
ఒటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆంద్ర ప్రదేశ్ కేబినేట్ ఆమోదం :
వచ్చే ఆర్ధిక సంవత్సరం లో 2020-21 కు సంబందించి తొలి త్రైమాసిక అన్ని రంగాలకు అవసరమైన రూ .70994 ,98,38,000 (రూ.70,994.98) వ్యయానికి వీలు కల్పించే ద్రవ్య వినిమాయ ఒటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ -2020కు మార్చి 27 న ఆంద్ర ప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.కరోనా వైరస్ యొక్క వ్యాప్తి న్ని తగ్గించ దానికి లాక్ డౌన్ విధించి వైద్య సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్న నేపద్యంలో శాసనసభ సమావేశాలను నిర్వహించలేదని పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలో 203 అధికరణలో క్లాజ్ -1 ప్రకారం రాబోయే మూడు నెలలో రూ.70.994.98 కోట్ల వ్యయనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు ప్రబుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆంద్ర ప్రదేశ్ కేబినేట్ ఆమో
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: మార్చి 29
బ్రిటన్ ప్రదాని అయిన బోరిస్ జాన్సన్ కు కరోనా :
బ్రిటన్ ప్రధాన మంత్రి అయిన బోరిస్ జాన్సన్ ,ఆరోగ్య శాఖ మంత్రి మత్ హాన్ కాక్ కి కోవిద్ -19 (కరోనా వైరస్ ) సోకిందని మార్చి 28 వెల్లడైంది.దీంతో జాన్సన్ 10 డౌనింగ్ స్ట్రీట్ లో తన నివాసంలో స్వీయ నిర్బడంలో కి వెళ్ళిపోయారు .మార్చి 26 నుంచి నాలో కరోన లక్షణాలు కాస్త కనిపించాయి.వెంటనే పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది.వెంటనే నా గదిలోనే నిర్బంధంలోకి వెళ్ళిపోయాను.దేశ ప్రదాని గా సాంకేతిక పరీక్ష ను ఉపయోగించి కరోనా వైరస్ పై తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తున్న అని జాన్సన్ తన ట్విటార్ అకౌంట్ లో ఒక వీడీయో షేర్ చేశారు.మరో వైపు స్వీయ నిర్బండంలోకి వేల్లిన ఆరోగ్య శాఖ మంత్రి మట్ హాన్ కాక్ కూడా ఇంటి నుంచే పని చేస్తానని ప్రకటించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రిటన్ ప్రదాని అయిన బోరిస్ జాన్సన్ కు కరోనా
ఎక్కడ: బ్రిటన్
ఎవరు: బోరిస్ జాన్సన్
ఎప్పుడు: మార్చి 29
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
బ్రహ్మ కుమరీస్ సంస్థ అధ్యక్షురాలు రాజయోగిని దాదీ జానకి కన్నుమూత :
ప్రముఖ అధ్యత్మిక సంస్థ బ్రహ్మ కుమరీస్ సంస్థాన్ అధ్యక్షురాలిగా ఉన్న రాజయోగిని దాడీ జానకి (104) అస్తమించారు.శ్వాస ఉదర సంబద సమస్యలతో రెండు నెలలుగా భాద పడుతున్న ఆమె మార్చి 27 న రాజస్తాన్ లోని మౌంట్ అబూ ఆసుపత్రిలో తుది శ్వాస విదిచారు.పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో 1916 జనవరి 01 న జన్మించిన దాదీ 21ఏళ్ల వయసులోఆద్యాత్మిక జీవనంలోకి వచ్చ్చారు.ప్రప్న్చంలోన్ని మహిళలు నడుపుతున్న అతిపెద్ద అద్యత్మిక సంస్థగా బ్రహ్మ కుమరీస్ నిలవడం విశేషం.పారిశుదయ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రబుత్వం దాదీ స్వచ్చ భారత్ అబియాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రహ్మ కుమరీస్ సంస్థ అధ్యక్షురాలు రాజయోగిని దాదీ జానకి కన్నుమూత
ఎక్కడ: జైపూర్
ఎవరు: రాజయోగిని దాడీ జానకి
ఎప్పుడు: మార్చి 29
ఆర్ధిక మంద్యంలోకి ప్రపంచ దేశాలు :ఐఎంఎఫ్:
కరోనా మహామ్మారితో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరోగామనం లోకి జారి పోయిందని అంతర్జతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అధిపతి క్రిస్తలీనా జార్జీవా పేర్కొన్నారు.ఈ నేపద్యంలో వర్తమాన దేశాలను ఆదుకోవడానికి బారీగా నిధులు అవసరమని తెలిపారు. మనం ఆర్ధిక మాంద్యం లోకి వేల్లిపోయం .2009 లో తలెత్తిన పరిస్థతి కన్నా ఇది చాలా దారుణంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకస్మికంగా ఆర్హ్తిక ప్రతిస్తంబన ఏర్పడినందున వర్తమాన దేశాల ఆర్థిక అవసరాలు తీర్చడానికి కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమని చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్ధిక మంద్యంలోకి ప్రపంచ దేశాలు :ఐఎంఎఫ్
ఎవరు: ఐఎంఎఫ్
ఎప్పుడు: మార్చి 29
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |