Daily Current Affairs in Telugu 24-08-2021
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్) చైర్మన్ గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ నియమకం :
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్ కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవహరించనుండగా కమిషన్ సభ్యులుగా సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్ లు ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆగస్టు 23న నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్ సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
- తెలంగాణ ఎస్సి కమిషన్ చైర్మన్ :ఏర్రోల్ల శ్రీనివాస్
- తెలంగాణా మహిళా కమిషన్ చైర్మన్ :వి.సునీత లక్ష్మా రెడ్డి
క్విక్ రివ్యు:
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్) చైర్మన్ గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ నియమకం
ఎవరు: డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్
ఎక్కడ: తెలంగాణ రాష్ట్ర౦
ఎప్పుడు:ఆగస్ట్ 24
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా టి.శ్రీకాంత్ నియామకం :
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ 2004 బ్యాచ్ కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ) క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి టి. శ్రీకాంత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన శ్రీకాంత్ ఇప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2012 సెప్టెంబర్ నుంచి 2014 జూలై మధ్య పుదుచ్చేరి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా పని చేశారు. 2023 వరకు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ పై ఉన్న ఆయన అప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
- కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు : 1950 జనవరి 25
- కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం :న్యుడిల్లి
- కేంద్ర ఎన్నికల సంఘం మొదటి కమిషనర్ : సుకుమార్ సేన్
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుత కమిషనర్ :సునీల్ అరోరా
క్విక్ రివ్యు:
ఏమిటి: కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా టి.శ్రీకాంత్ నియామకం
ఎవరు: టి.శ్రీకాంత్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 24
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా మారుమూడి విక్టర్ ప్రసాద్ నియామకం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా మారుమూడి విక్టర్ ప్రసాద్ నియమితులయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఆయన్ని చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాక విక్టర్ ప్రసాద్ తొలి చైర్మన్. కమిషన్ సభ్యులుగా కె. బసవరావు, చెల్లం ఆనంద ప్రకాశ్ ను నియమించారు. బాధ్యతలు చేపట్టిన నుంచి వీరు మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగు తారని ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఎస్సీ, ఎస్టీ లకు కలిపి ఒకే కమిషన్ ఉండేది. ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేసింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా మారుమూడి విక్టర్ ప్రసాద్ నియామకం
ఎవరు: మారుమూడి విక్టర్ ప్రసాద్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 24
జర్మని లో భారత రాయబారిగా హరీశ్ పర్వతనేని నియామకం :
సీనియర్ దౌత్యాదికాధి హరీశ్ పర్వతనేని జర్మని లో భారత రాయబారిగా, నియమితులయ్యారు. కాగా ఈయన 1990 బ్యాచ్ ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’కు చెందిన అధికారిగా ఆయన ప్రస్తుతం దిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో సేవలందిస్తున్నారు. త్వరలోనే జర్మనీలో బాధ్యతలు చేపట్టనున్నారని ఈ శాఖ ఆగస్ట్ 24న ప్రకటించింది. హరీశ్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజి నీరింగ్ పూర్తిచేసి బంగారు సాధించారు. తర్వాత కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో చదువుకున్నారు. సివిల్స్ కు ఎంపికై శిక్షణానంతరం వివిధ దేశాల్లో పనిచేశారు. కైరోలోని అమెరికా విశ్వవిద్యాలయంలో అరబిక్ భాషను నేర్చుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. భారత ఉప రాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఉన్నప్పుడు ఆయన దగ్గర ప్రత్యేకాధికారిగానూ సేవలందించారు.
- జర్మని దేశ రాజధాని : బెర్లిన్
- జర్మని దేశ చాన్సలర్ : ఏంజల మోర్కెల్
- జర్మని దేశ అద్యక్షుడు :ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మేయిర్
క్విక్ రివ్యు:
ఏమిటి: జర్మని లో భారత రాయబారిగా హరీశ్ పర్వతనేని నియామకం
ఎవరు: హరీశ్ పర్వతనేని
ఎక్కడ: జర్మని
ఎప్పుడు: ఆగస్ట్ 24
మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు ఓ చంద్ర శేఖర్ కన్నుమూత :
1962 జకర్తా ఆసియా క్రీడల్లో పసిడి ‘పతకం గెలిచిన ఫుట్బాల్ జట్టులో సభ్యుడు ఒ.చంద్రశే ఖర్ మరణించారు. ఆయన వయసు 85 ఏళ్లు. కొన్ని రోజు లుగా వృద్ధాప్యం వల్ల వచ్చిన రుగ్మతలతో చంద్రశేఖర్ బాధపడుతున్నారు. 1958-66 మధ్య దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఈ కేరళ డిఫెండర్.జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లోనూ పాల్గొన్నారు. దేశవాళీ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన చంద్రశేఖర్. 196లో సంతోష్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు ఓ చంద్ర శేఖర్ కన్నుమూత
ఎవరు: ఓ చంద్ర శేఖర్
ఎప్పుడు: ఆగస్ట్ 24
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |