Daily Current Affairs in Telugu 21-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 21-06-2020

rrb ntpc online exams in telugu

https://manavidya.in/daily-current-affairs-in-telugu-20-06-2020/

ఆంధ్రప్రదేశ్ లోని భీమ వరం లో ఏర్పాటు కానున్న ఆక్వా యునివర్సిటీ:

 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఆక్వా యునివర్సిటీ ఏర్పాటు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు వర్శిటీ  స్థాపనకు అవసరమైన భూమికి సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ప్రాథమికంగా వర్శిటీ ఏర్పాటు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంబంయ్యాయి.ఏటా 25.52 లక్షల టన్నుల చేపల 11.82 లక్షల టన్నుల రోయ్యల దిగుబడి వస్తోంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. చేపలు ,రొయ్యలు  సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడిని మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో సాగుకు సంబంధించిన వివిధ కోర్సులను భోధించే యునివర్సిటీ లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయించింది. ఈ నేపద్యంలో భీమ వరం లో ఆక్వ యునివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ లోని భీమ వరం లో ఏర్పాటు కానున్న ఆక్వా యునివర్సిటీ

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పడు: జూన్ 21

ఆంధ్రప్రదేశ్ కార్ల్ లో ఏర్పాటు కానున్న పశువుల వ్యాక్సిన్ తయారీ యూనిట్ :

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద రంగాపురం సమీపంలో ఉన్న ఎపి కార్ల్ (ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ఆన్ లైవ్ స్టాక్) లో పశువులకు సంబంధించిన వ్యాక్సన్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఎపి కార్ల్ ఐజిఐ ఇమ్మునోలజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సమక్షంలో జూన్ 19 న క్యాంపు కార్యాలయం లో ఒప్పందం పై ఏపి  కార్ల్  సంస్థ సియివో డాక్టర్ ఎం.శ్రీనివాస్ రావు ఐ.జివై ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి సంతకాలు చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ కార్ల్ లో ఏర్పాటు కానున్న పశువుల వ్యాక్సిన్ తయారీ యూనిట్

ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పడు: జూన్ 21

ప్రముఖ దేశవాళి క్రికెట్ బౌలింగ్ దిగ్గజం అయిన రాజిందర్ గోయెల్ కన్నుమూత :

భారత దేశవాళి క్రికెట్ స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయెల్ కన్నుమూసారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు అనారోగ్యంతో ఆదివారం తన స్వగృహంలో అయన కన్నుమూసారు. 1958 నుంచి 1985వరకు దేశవాళి క్రికెట్ లో గోయెల్ చెరగని ముద్ర వేశారు. ఎడం చేతి వాటం స్పిన్నర్ అయిన గోయెల్ తన 27సంవత్సరాలు సుదీర్గ కెరీర్లో 157 మ్యాచ్ లు ఆడి 750 వికెట్లు తీసారు. రంజీ ట్రోపీ చరిత్రలో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు ఇప్పటి వరకు రాజిందర్ గోయెల్ పేరున ఉంది .ఆయన రంజీలో మొత్తం 637 వికెట్లు పడగొట్టారు. ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజిందర్ భారత జట్టుకు మాత్రం ఆడలేకపోయారు. అయితే 1964-65 సీజన్ లో అహ్మదాబాద్ ఓ శ్రీలంక తో జరిగిన అనధికారిక టెస్టుమ్యాచ్ లో అయన ఆడారు. రెండో ఇన్నింగ్స్ లో 4వికెట్లు తీసారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ దేశవాళి క్రికెట్ బౌలింగ్ దిగ్గజం అయిన రాజిందర్ గోయెల్ కన్నుమూత

ఎవరు: రాజిందర్ గోయెల్

ఎప్పడు: జూన్ 21

కరోన చికిత్స కు ప్రవేశపెట్టిన భారత్ కు చెందిన గ్లెన్ మార్క్ ఔషదం :

ప్రపంచ వ్యాప్తంగా దేశాలను వణికిస్తున్న కోవిద్ చికిత్స కు దేశం ఔషదం తయారు చేసినట్టు భారత్ కుచెందిన గ్లెన్ మార్క్ ఫార్మసూటికల్స్ కంపెని ప్రకటించింది. యాంటీ  వైరల్ ఔశాదం ఫావివిరవర్ కోవిద్ చికిత్స కు బాగా పని చేస్తుందని దీనిని ఫాబిఫ్లూ అనే బ్రాండ్ నెం తో మార్కెట్లో కి విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదిస్తున్నట్లు ముంబై కి చెందిన గ్లెన్ మార్క్ జూన్ 19 న వెల్లడించింది. తాము తాయారు చేసిన క్లినికల్ ట్రయల్స్ లో ఫావివిరల్ మందు రోగులపైన చాలా బాగా పనిచేస్తుందని కంపెని చైర్మన్ ఎం డి గ్లెన్ సల్దాన్హా తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కరోన చికిత్స కు ప్రవేశపెట్టిన భారత్ కు చెందిన గ్లెన్ మార్క్ ఔషదం

ఎవరు: గ్లెన్ మార్క్ ఫార్మసూటికల్స్ కంపెని

ఎక్కడ:  ముంబై

ఎప్పడు: జూన్ 21

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *