Daily Current Affairs in Telugu 2-08-2021
‘ఈ రూపీ’ విధానాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ రూపీ’ విధానాన్ని. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 02 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రభుత్వం-లబ్ధిదారుల నడుమ మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించి, లక్షిత ప్రయోజనా లను నేరుగా వారికి అందించాలన్న యోచనతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో నగదు ప్రమేయం ఉండదు. వ్యక్తులను నేరుగా కలవాల్సిన పనిలేదు. సేవలు పొందిన తర్వాత మొబైల్ ఫోన్ కు వచ్చే క్యూఆర్ కోడ్ ను చూపించినా, ఓచర్ నంబరును చెప్పినా సరిపో తుంది సుపరిపాలనలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ కూడా ఇందుకు తోడ్పాటు అందించాయి. ప్రస్తుతం ఆరోగ్య సేవల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఈ విధానాన్ని త్వరలోనే ఇతర విభాగాలకూ విస్తరించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; ‘ఈ రూపీ’ విధానాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ; న్యుడిల్లి
ఎప్పుడు ; ఆగస్ట్ 02
2021 ఏడాదికిగాను లోకమాన్య తిలక్ అవార్డ్ కు ఎంపికైన డాక్టర్ సైరస్ పూనావాల :
2021 ఏడాదికిగాను డాక్టర్ సైరస్ పూనావాల కు లోకమాన్య తిలక్ అవార్డు కు ఎంపికయ్యారు. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లు లోకమాన్య తిలక్ ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ ఆగస్టు 1. ప్రకటించారు. ఆగస్టు 13న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుతో పాటు రూ లక్ష నగదు, మెమెంటో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు వివరించారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ద్వారా ఆయన ఎన్నో ప్రాణాలను కాపాడారని కొనియాడారు. తిలక్ జాతీయ అవార్డును గతంలో మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, ఏబీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ వంటి వారు అందుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి ; 2021 ఏడాదికిగాను లోకమాన్య తిలక్ అవార్డ్ కు ఎంపికైన డాక్టర్ సైరస్ పూనావాల
ఎవరు: డాక్టర్ సైరస్ పూనావాల
ఎప్పుడు ; ఆగస్ట్ 02
ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రికార్డు సృష్టించిన అథ్లెట్ శ్రీనివాస్ :
ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ శ్రీనివాస్ పరుగులో సంచలనం సృష్టించాడు. ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ అండర్-20 అబ్బాయిల 200మీ. పరుగులో సరికొత్త జాతీయ రికార్డు నమోదు చేశాడు. ఆగస్ట్ 02 న 21.02 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతను.. 1996లో ఢిల్లీ అథ్లెట్ అజయ్ నెలకొల్పిన రికార్డు 21.19సె)ను తిరగరాసాడు. ఈ ప్రదర్శనతో అతను ఈ నెల 17న కెన్యాలో ఆరంభమయ్యే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ కు అర్హత సాధించాడు. 100మీ. పరుగులోనూ అతనే చాంపియన్ గా నిలిచాడు. అమ్మాయిల 200మీ. పరుగులో తెలంగాణ అథ్లెట్ దీప్తి (24.40నె) రజతం గెలిచింది. ప్రియా మోహన్ (కర్ణాటక- 23.963), అవంతిక (మహారాష్ట్ర- 24.46సె) వరుసగా స్వర్ణకాంస్య కాంస్య పతకాలు నెగ్గారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రికార్డు సృష్టించిన అథ్లెట్ శ్రీనివాస్
ఎవరు: అథ్లెట్ శ్రీనివాస్
ఎప్పుడు ; ఆగస్ట్ 02
మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ప్రధానమంత్రిగా మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ :
మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ప్రధానమంత్రిగా మయన్మార్ మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ నేతృత్వంలో ‘మయన్మార్ యొక్క సంరక్షక ప్రభుత్వం’ గా ఏర్పరచచబడింది ఆగస్ట్ 01 న టెలివిజన్ ప్రసంగంలో, జనరల్ హేలింగ్ కూడా 2023 నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మయన్మార్‌పై ఆసియాన్ నియమించిన భవిష్యత్ ప్రాంతీయ రాయబారితో కలిసి పనిచేయడానికి తన పరిపాలన సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు లో సమావేశం జరగడానికి ఒక రోజు ముందు, ఫిబ్రవరి 1 న స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించిన తరువాత ఫిబ్రవరిలో మయన్మార్‌లో జనరల్ హ్లెయింగ్ అధికారాన్ని చేపట్టాడు. అప్పటి నుండి, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ మయన్మార్‌లో ప్రభుత్వ విధులను నిర్వహిస్తోంది. అత్యవసర ప్రసంగ నిబంధనల ప్రకారం ఆగస్టు 2023 నాటికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యం మరియు ఫెడరలిజం ఆధారంగా యూనియన్ ఏర్పాటుకు హామీ ఇస్తున్నట్లు జనరల్ హ్లెయింగ్ తన ప్రసంగంలో చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ప్రధానమంత్రిగా మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్
ఎవరు: మిన్ ఆంగ్ హ్లెయింగ్
ఎక్కడ; మయన్మార్
ఎప్పుడు ; ఆగస్ట్ 02
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి ట్రాన్స్జెండర్ గా నిలిచిన లారెల్ హుబ్బార్డ్ :
టోక్యో ఒలింపిక్స్ లో న్యూజిలాండ్ దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లారెల్ హుబ్బార్డ్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ గేమ్స్ పాల్గొన్న మొదటి ట్రాన్స్ జెండర్ వు మెన్ గా ఆమె నిలిచింది హుబర్ట్. 87+కేజీల విభాగంలో పోటీపడిన లారెల్ హుబ్బార్డ్, 3 ప్రయత్నాల్లోనూ 120కేజీలను లిఫ్ట్ చేయడంలో విఫలమై, నిరాశగా ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగింది. 43ఏళ్ల హుబ్బార్డ్, పుట్టుకతో మగవాడు. 30 ఏళ్ల వయసులో లింగమార్పిడి. చేసుకుని మహిళగా మారింది.
క్విక్ రివ్యు :
ఏమిటి ; టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి ట్రాన్స్జెండర్ గా నిలిచిన లారెల్ హుబ్బార్డ్
ఎవరు: లారెల్ హుబ్బార్డ్
ఎక్కడ ; జపాన్ (టోక్యో )
ఎప్పుడు ; ఆగస్ట్ 02
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక బౌలింగ్ ఆల్ రౌండర్ ఇసురు ఉడానా :
శ్రీలంక దేశ క్రికెట్ జట్టు చెందిన బౌలింగ్ ఆల్ రౌండర్ ఇసురు ఉడానా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్, ఇసురు ఉడానా తక్షణం అమలులోకి వచ్చేలా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 12 సంవత్సరాల పాటు తన ప్రదర్శనలతో ఉదానా చాలా నిరాడంబరమైన అంతర్జాతీయ కెరీర్‌ని కలిగి ఉన్నాడు, ఇందులో అతను తన ప్రయత్నాల కోసం కేవలం 45 వికెట్లతో 21 వన్డేలు మరియు 35 టి 20 ఇంటర్నేషనల్‌మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం-పేసర్ 2009 లో టీ 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20 లో శ్రీలంక పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. కాగా అతని తొలి వన్డే గేమ్ 2012 లో భారత్‌పై జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి ; అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక బౌలింగ్ ఆల్ రౌండర్ ఇసురు ఉడానా
ఎవరు: ఇసురు ఉడానా
ఎక్కడ శ్రీలంక
ఎప్పుడు ; ఆగస్ట్ 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |