Daily Current Affairs in Telugu 30-07-2021
ప్రపంచ రికార్డుతో పసిడి పథకం గెలుచుకున్న స్విమ్మర్ శూన్మాకర్ :

ఒలింపిక్స్ఈతలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ టోక్యోలో ఇతర దేశాలు పతకాలు సాధిస్తున్నాయి. జూలై 30న నాలుగు పతకాంశాల్లో పోటీపడ్డ అమెరికా ఒక్క దాంట్లోనూ స్వర్ణం నెగ్గలేదు. మహిళల 200 మీ. బ్రెస్ట్ ఫైనల్లో దక్షి ణాఫ్రికా స్విమ్మర్ తర్జన షూన్మాకర్ ప్రపంచ రికార్డుతో పసిడి పట్టేసింది. 2 నిమిషాల 18.95 సెకన్లలో రేసు ముగించి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా, స్విమ్మర్లు లిల్లీ (2:19. EG 92సె), లాజర్ (2:20.84సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ ఒలింపిక్స్ స్మిమ్మింగ్ వ్యక్తిగత విభాగంలో నమోదైన తొలి ప్రపంచ రికార్డు ఇది
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రికార్డుతో పసిడి పథకం గెలుచుకున్న స్విమ్మర్ శూన్మాకర్
ఎవరు: స్విమ్మర్ శూన్మాకర్
ఎక్కడ: జపాన్ ( టోక్యో )
ఎప్పుడు: జులై ౩౦
డీఆర్డీవో)లో మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ -ఎంఎస్ఎస్) విభాగానికి నారాయణమూర్తి నియామకం :

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లో ప్రతిష్ఠాత్మకమైన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల (మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ -ఎంఎస్ఎస్) విభాగానికి నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా డాక్టర్ బీహెచ్పీఎస్ నారాయణమూర్తి గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)కు డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. పదోన్నతిపై నగరంలోని కంచన్ బాగ్ మిసైల్స్ కాంప్లెక్స్ లోని ఎంఎస్ఎస్ డీజీగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ ఎంఎస్ఆర్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు. వరంగల్ ఆర్ట్స్ఈసీలోఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివిన మూర్తి. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేశారు. ట్రిపుల్ ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పీహెచ్‌డి చేశారు. 1986లో డీఆర్డీవోలో చేరారు. అడ్వా న్స్ ఆన్ బోర్డు కంప్యూటర్స్ కు ఆయన ముఖ్య రూపశిల్పి. తద్వారా క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. భారత్ తొలిసారిగా చేపట్టిన ఉప గ్రహవిధ్వంసక క్షిపణి ప్రయోగానికి (మిషన్ శక్తి) అవ సరమైన అడ్వాన్స్ ఏవియానిక్స్ డిజైన్, అభివృద్ధి ప్రాజె క్టుకు నాయకత్వం వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డీఆర్డీవో)లో మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ -ఎంఎస్ఎస్) విభాగానికి నారాయణమూర్తి నియామకం
ఎవరు: నారాయణమూర్తి
ఎప్పుడు: జులై ౩౦
జాతీయ ఆరోగ్య వలంటీర్ల ప్రచారాన్ని ప్రారంబించిన జెపి నడ్డా :

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గారు న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం నుండి జాతీయ ఆరోగ్య వలంటీర్ల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో సుమారు 4 లక్షల మంది వాలంటీర్లకు కోవిడ్‌పై అట్టడుగు స్థాయిలో పనిచేసే వారికి శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రచారం కింద వారు 2 లక్షల గ్రామాలకు చేరుకోవాలని జెపి నడ్డా అన్నారు. ఈ క్యాంపెయిన్ కాగా ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ప్రోగ్రామ్‌గా మారుతుందని ఆయన అన్నారు. కార్మికుల శిక్షణ నిర్మాణాత్మకంగా ఉండటమే కాకుండా వాలంటీర్‌కి సేవాభావం కూడా ఉండాలని జెపి నడ్డా అన్నారు. మానవత్వ సేవ కోసం బిజెపి పనిచేస్తోందని ఆయన అన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ ఆరోగ్య వలంటీర్ల ప్రచారాన్ని ప్రారంబించిన జెపి నడ్డా
ఎవరు: జెపి నడ్డా
ఎప్పుడు: జులై ౩౦
దేశంలో మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్స్ కు ఒక శాతం రిజర్వేషన్ కల్పించిన కర్ణాటక :

అన్ని ప్రభుత్వ సర్వీసుల్లో ‘ట్రాన్స్‌జెండర్’ కమ్యూనిటీకి ఒక శాతం రిజర్వేషన్ కల్పించి దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలిచింది ‘ట్రాన్స్‌జెండర్’ కమ్యూనిటీ కొరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించనుంది.తద్వారా వీరికి రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రము గా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటక సివిల్ సర్వీస్ (జనరల్ రిక్రూట్మెంట్) రూల్, 1977 ని సవరించిన తర్వాత ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలియజేస్తూ ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలో మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్స్ కు ఒక శాతం రిజర్వేషన్ కల్పించిన కర్ణాటక
ఎవరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు: జులై ౩౦
సినారే స్మారక పురస్కారం కు ఎంపిక అయిన జూకంటి జగన్నాద౦ :

తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారు కలిసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే సి. నారాయణరెడ్డి స్మారక సాహిత్య పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంగారు ఎంపికయ్యారు . జూలై 29న హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతి ఉత్సవంలో జూకంటికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా జూకంటి జగన్నాథం సాహిత్యానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఈ పురస్కారాన్ని అందించారు. ఇప్పటివరకు జూకంటి 14 కవితా సంకలనాలు, ఒక కథా సంకలనంతోపాటు సమగ్ర సాహిత్యాన్ని మూడు సంపుటి లుగా వెలువరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సినారే స్మారక పురస్కారం కు ఎంపిక అయిన జూకంటి జగన్నాద౦
ఎవరు: జూకంటి జగన్నాద౦
ఎప్పుడు: జులై ౩౦
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |