Daily Current Affairs in Telugu -18-11-2019
ఈ ఏడాది చివర్లో చిన్న వాహక నౌక తొలి ప్రయోగం :-
భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) వినూత్నంగా చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎస్ఎల్వి) ఈ ఏడాది చివర్లో తొలి సారిగా నింగిలోకి దూసుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికి కొన్ని కారణాలతో జాప్యమవుతుంది. ఈ వాహక నౌక పై అమెరికాకు చెందిన స్పేస్ ప్లేట్ సహా పలు కంపనీలు ఆసక్తి కనబరచాయి. ఇస్రో కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) కు కాంట్రాక్టులు వస్తున్నాయి. (ఎస్ఎస్ఐఎల్ ద్వారా 500 కిలోల బరువు గల ఉపగ్రహాలు ప్రయోగించొచ్చు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ఈ ఏడాది చివర్లో చిన్న వాహక నౌక తొలి ప్రయోగం
ఎక్కడ: బెంగళూరు
ఎప్పుడు: నవంబర్ 18
సాఫ్ట్ వేర్ సమస్యతోనే విక్రం విఫలం –ఇస్రో
చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళిన విక్రం ల్యాండర్ చివరి నిమిషం లో విఫలం కావడానికి గల కారణాల అన్వేషణలో బారత అంతరిక్ష పరిశోదన సంస్థ పురోగతి సాదించినట్లు తెలుస్తోంది. చంద్రయాన్ -2 విపలమైన తర్వాత ఇస్రో వైపల్యాల నిర్ద్తారణ కమిటీ (అంతర్గత కమిటీ) ని నియమించింది. ఈ కమిటీకి మహేంద్రగిరి లోని లిక్విడ్ ప్రోపోల్స్హన్ సిస్టం సెంటర్ సంచాలకులు వి. నారాయణ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన అద్వార్యాన కమిటీ చంద్రయాన్ -2 ప్రయోగం అనంతరం పలు అంశాలు పరిశీలించింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: సాఫ్ట్ వేర్ సమస్యతోనే విక్రం విఫలం –ఇస్రో
ఎవరు: ఇస్రో
ఎప్పుడు: నవంబర్ 18
కొలిజియం సభ్యురాలిగా జస్టిస్ భాను మతి
సీనియర్ న్యాయమోర్తి జస్టిస్ ఆర్. భానుమతి కి సుప్రీం కోర్ట్ కొలిజియం లో స్థానం లభించింది. ప్రదాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గగోయ్ పదవి విరమణ చేయడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వచ్చింది. కొలిజియం లో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులకు సబ్యత్వం ఉంటుంది. ప్రస్తుత సిజేఐ జస్టిస్ ఎస్.ఎ.బొబ్డే ,జస్టిస్ ఎన్.వి రమణ , జస్టిస్ అరుణ్ మిశ్ర ,జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ,జస్టిస్ ఆర్ . భానుమతిలు సభ్యులుగా ఉంటారు. కొలిజియం సబ్యత్వం పొందిన రెండో మహిళా న్యాయమూర్తి ఆమె కావడం గమనార్హం
క్విక్ రివ్యూ
ఏమిటి: కొలిజియం సభ్యురాలిగా జస్టిస్ భాను మతి
ఎవరు: జస్టిస్ భాను మతి
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు: నవంబర్ 18
శ్రీలంక అధ్యక్షునిగా గోటబాయ రాజపక్స ప్రమాణం:-
శ్రీలంక ఎడో అద్యక్షునిగా గోటబాయ రాజపక్స నవంబర్ 18 న ప్రమాణ స్వీకారం చేశారు. సాంప్రదాయాన్ని పక్కన ప్పెట్టి రాజదాని కోలోంబోలో కాకుండా ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలోని అనురాదపురంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ప్రాచిన బౌద్ద ఆలయమైన రువాన్ వెలి సేయ లో అద్యక్షుడిగా బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: శ్రీలంక అధ్యక్షునిగా గోటబాయ ప్రమాణం
ఎవరు: గోటబాయ రాజపక్స
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: నవంబర్ 18
అగ్రవాన్ గా మారనున్న ఆగ్రా పేరు :-
ఆగ్రా పేరును అగ్రవాన్ గా మార్చాలని ఉత్తరప్రదేశ్ లోని యోగి అదిత్యానాత్ ప్రబుత్వం భావిస్తోంది. ఈ నగర పుట్టు పూర్వోత్తరాలపై పరిశోదన చేయాలనీ బీఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయాన్ని కోరింది. ఈ మేరకు చరిత్ర శాఖా అధిపతి ఆనంద్ దీనిపై పరిశోదన చేశారు. మహాబారతం కాలంలో ఈ ప్రాంతానికి అగ్రవాన్ (అగ్ర భాగం లోని బాణం ) అన్నపేరు ఉండేది.ఆగ్రా గేజిటీర్ లో కూడా ఈ ప్రస్తావన ఉంది. అంగీర ముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతో ఆయన పేరుతో ఈ నగరాన్ని అంగీర అని పిలిచేవారు అని కథనం కూడా ఉంది.
క్విక్ రివ్యూ
ఏమిటి: అగ్రవాన్ గా మారనున్న ఆగ్రా పేరు
ఎవరు: యోగి ఆదిత్యా నాథ్
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 18
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
రోబోకాన్ పోటిలలో అమృత వర్శిటీ విద్యార్తుల ప్రతిభ
అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) లో జరిగిన రోబోకాన్ -2019 రోబోటిక్స్ పోటిలలో అమృత విశ్వ విద్యా పీతం (అమృతపురి క్యాంపస్ ,కేరళ ) విద్యార్తులు అద్బుత ప్రతిభను కనబరిచి అగ్రగాములుగా నిలిచారు. అమృత వర్శిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసేఈ చివరి సంవత్సరం చదివే విద్యార్ధి రుత్విక్ చందా సారద్యంలో ని బృందం ప్రథమ బహుమతి ని గెలుచుకుంది.రుత్విక్ చందా బృందంలో బ్రజిల్ చైనా ,థాయ్ లాండ్,చైనా విద్యార్థులున్నారు. వీరు తమకు ఇచ్చిన 60 విడి భాగాలున్న కిట్ ను ఉపయోగించి కేవలం 12 రోజుల వ్యవదిలో తాయారు చేసిన మూన్ రోవర్ కు మొదటి బహుమతి వచ్చింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: రోబోకాన్ పోటిలలో అమృత వర్శిటీ విద్యార్తుల ప్రతిభ
ఎక్కడ: అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఎప్పుడు: నవంబర్ 18
బ్రెజిల్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత వెర్ స్తాపెన్:-
రెడ్ బుల్ డ్రైవర్ మాక్స్ వేర్ స్తాపెన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ చాంపియన్ గా నిలిచాడు. ప్రపంచ చాంపియన్ లూయిస్ హమిల్టన్ ను వెనక్కి నెట్టి వెర్ స్తాఫెన్ ఈ త్రోపిని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో అతనికది మూడో టైటిల్ గాస్లె(ఫ్రాన్స్) రెండో స్థానంలో నిలవగా , సైంజ్ జునిఉర్ మూడో స్థానం సాధించాడు. హమిల్టన్ ఏడో స్థానంతో సరి పెట్టుకున్నాడు.
క్విక్ రివ్యూ
ఏమిటి: బ్రెజిల్ గ్రాండ్ ప్రీ విజేత వెర్ స్తాపెన్
ఎవరు: వెర్ స్తాపెన్
ఎక్కడ: సావోపోలో
ఎప్పుడు: నవంబర్18
ఎటిపి ఫైనల్స్ టోర్నీ టైటిల్ – స్తేఫనోస్ సిట్సిపాస్
యువ టెన్నిస్ ఆటగాడు స్తేపనోస్ సిత్సిపాస్ (గ్రీస్) అదరగొట్టాడు. నాదల్ ,ఫెదరర్, జకోవిచ్, లాంటి దిగ్గజాలను తోసిరాజంటూ ఎటిఫై ఫైనల్స్ టోర్నీ టైటిల్ ను చేజేక్కిన్చుకున్నాడు ఫైనల్లో 21 ఎల్ల సిట్సి పాస్ (6-7) (6-8) ,6-2 ,7-6 (7-4) డొమినిక్ థీమ్ ఆస్ట్రియ పై పోరాడి గెలిచాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో తొలి సారి తుది పోరుకు చేరిన సిట్సిపాస్ వరుసగా రెండో సరి ఫైనల్లో అడుగు పెట్టిన థీమ్ మద్య టైటిల్ పోరు హోరాహోరిగా సాగింది. తొలి సారి టైటిల్ గెలిచిన అతను 2001 తర్వాత పుట్టిన అత్యంత పిన్న వయస్సులో ఎటిపి ఫైనల్స్ విజేతగా నిలిచినా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ఎటిపి ఫైనల్స్ టోర్నీ టైటిల్ – స్తేఫనోస్ సిట్సిపాస్
ఎవరు: – స్తేఫనోస్ సిట్సిపాస్
ఎక్కడ:లండన్
ఎప్పుడు: నవంబర్ 18
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |