Daily Current Affairs in Telugu 17-04-2020
కోవిడ్-19 నిర్దారణకు కొత్త కిట్ ను కనిపెట్టిన కేరళ పరిశోధకులు :
కోవిడ్-19 పరీక్షలను వేగంగా,తక్కువ ఖర్చుతో చేపట్టేందుకు తిరువనంతపురం లోని రాజీవ్ గాంధీ సెంటర్ పర్ బయోటెక్నాలజీ (ఆర్ జీసీబీ) పరిశోధకులు వినూత్న టెస్ట్ కిట్ ను తయారుచేశారు. ఇది 20 నిమిషాల్లోనే పరిక్ష నిర్వహిస్తుందని తెలిపారు. ఒక్కో పరిక్ష కు రూ.600 మాత్రమే ఖర్చువుతుంది. ఈ విధానాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నుంచి తుది అనుమతి కోసం సంస్థ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం దేశంలో ‘రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టి-పిసిఆర్) విధానాన్నిఉపయోగిస్తున్నారు. ఒక్కోపరీక్షకు రూ.4వేల నుంచి 6వేలుఖర్చువుతుంది.పరిక్ష ఫలితం రావడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. కేరళ పరిశోధకులు తయారుచేసిన టెస్ట్ కిట్లతో ఈ ఇబ్బంది తొలగిపోతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్-19 నిర్దారణకు కొత్త కిట్ ను కనిపెట్టిన కేరళ పరిశోధకులు
ఎక్కడ:కేరళ
ఎప్పుడు:ఏప్రిల్ 17
కోవిడ్-19 కు యాంటిబాడీ పరీక్షను అభివృద్ధి చేసిన స్విస్ సంస్థ రోష్ :
ఒక వ్యక్తికి గతంలో కోవిడ్-19 సోకిందా లేదా అన్నది గుర్తించేందుకు యాంటిబాడీ పరీక్షను అభివృద్ధి చేసినట్లు స్విస్ సంస్థ రోష్ ప్రకటించింది, వచ్చే నెల నుంచి దీన్నిప్రారంభిస్తామని,గతంలో వ్యాధి సోకినప్పడు ఎలాంటి లక్షణాలు బయటపడకున్నా ఈ పరీక్షలో అది తెలిసిపోతుందని తెలిపింది. ఈ పరిక్ష కోసం రక్తనమునాను సేకరించాలి. అందులోని యాంటిబాడీ లను గుర్తిస్తారు.తద్వారా కోవిడ్-19కు కారణమయ్యే వైరస్ కు సంబంధిత వ్యక్తిలోని రోగ నిరోధక వ్యవస్థ స్పందించిన తీరును నిర్దారిస్తారు. నిజానికి ఇలాంటి సిరాలజి పరీక్షలను అభివృద్ధిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. వ్యాధి లక్షణాలేమి లేకుండా కరోనా సోకిన వారిని గుర్తించడం చాలా కీలకమని రోష్ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్-19 కు యాంటిబాడీ పరీక్షను అభివృద్ధి చేసిన స్విస్ సంస్థ రోష్
ఎవరు: స్విస్ సంస్థ
ఎప్పుడు: ఏప్రిల్ 17
కోవిడ్-19 కారణంగా బిసిసీఐ ఐపిఎల్ 2020 ని నిరవధికం గా నిలిపివేత :
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి (బిసిసిఐ) ఐపిఎల్ 2020 సీజన్ ను తదుపరి నోటిసు వచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపిఎల్ మార్చి 29 న ప్రారంభమై మే 24 తో ముగుస్తుంది. అయితే భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో ఇదిమొదట ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్-19 కారణంగా బిసిసీఐ ఐపిఎల్ 2020 ని నిరవధికం గా నిలిపివేత :
ఎవరు: బిసిసీఐ
ఎప్పుడు: ఏప్రిల్ 17
హంగ్జౌ 2022 ఆసియా పారా ఆటల చిహ్నం ఫిఫీ;
ఫిఫీ చైనా లోని హంగ్జౌ 2022 ఆసియా పారా గేమ్స్ యొక్క చిహ్నం గా ప్రకటించారు.4 వ ఆసియా పారా గేమ్స్ అక్టోబర్ 9-15,2022 నుండి జరగనున్నాయి.ఇందులో టైక్వాండో మరియు పారా కానో లతో కలిసి 22 క్రీడలు ఉన్నాయి.అథ్లెట్ల నుండి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరికి ప్రేక్షకుల ఆటల కు ప్రాణం పోసేందుకు ఈ చిహ్నం సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హంగ్జౌ 2022 ఆసియా పారా ఆటల చిహ్నం ఫిఫీ
ఎప్పుడు: ఏప్రిల్ 17
ఇండియా లో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ రాయబారిగా చేరిన విశ్వనాథ్ ఆనంద్:
డబ్ల్యుడబ్ల్యు ఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్) భారతదేశం ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ను పర్యావరణ విద్య కార్యక్రమానికి తన రాయబారిగా నియమించింది. పర్యావరణ పరిరక్షణ మరియు రక్షణకు ఆనంద్ తన యొక్క మద్దతును ఇస్తాడు.మొదటి సారిగా వరల్డ్ చెస్ చాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ WWF (వరల్డ్ వైడ్ ఫండ్)భారత దేశంలో పర్యావరణ విద్య కార్యక్రమానికి తన రాయబారిగా చేరారు. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా తన 50సంవత్సరాల పరిరక్షణను భారత దేశంలో జరుపు కుంటోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా లో డబ్ల్యుడబ్ల్యు ఎఫ్ రాయబారిగా చేరిన విశ్వనాథ్ ఆనంద్
ఎక్కడ:ఇండియా
ఎవరు:విశ్వనాథ్ ఆనంద్
ఎప్పుడు:ఏప్రిల్ 17
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |