Daily Current Affairs in Telugu 16-08-2021
కొత్త నాలుగు జిల్లాలు ఏర్పాటు ను ప్రకటించిన ఛత్తీస్ గడ్ సిఎం భుపేష్ భాగెల్ :
ఛత్తీస్ ఘర్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఫేల్ గారు స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని నూతనంగా నాలుగు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో జిల్లాల సంఖ్య 32కు చేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన అన్ని జిల్లా ‘మహిళల కోసం పార్కులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కొత్తగా మోహ్ల – మన్ పూర్, శక్తి, సారంగర్ – బిలాయిగర్ అనేనే ఏర్పాటుతో పాటు 18 కొత్త తహసీల్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
చత్తీస్ గడ్ రాష్ట్ర రాజధాని :రాయ్ పూర్
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : భుపేష్ భాగెల్
చత్తీస్ గడ్ రాష్ట్ర గవర్నర్ :అనసూయ ఉయికే
క్విక్ రివ్యు :
ఏమిటి: కొత్త నాలుగు జిల్లాలు ఏర్పాటు ను ప్రకటించిన ఛత్తీస్ గడ్ సిఎం భుపేష్ భాగెల్
ఎవరు: ఛత్తీస్ గడ్ సిఎం భుపేష్ భాగెల్
ఎక్కడ: ఛత్తీస్ గడ్
ఎప్పుడు : ఆగస్ట్ 16
తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తమిళనాడు రాష్ట్రము :
తమిళనాడురాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో సమర్పించారు. రైతులు, వ్యవసాయ నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, సెరికల్చర్, అటవీ వంటి సంబంధిత శాఖలకు రూ. 34, 220. 65 కోట నిధులు కేటాయించినట్లు మంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. వ్యవసాయ పంపు లకు ఉచితంగా విద్యుత్ ను అందించడానికి రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ అయిన తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కు రూ.4,508.23 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని : చెన్నై
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి : ఎం.కే స్టాలిన్
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ : బన్వారిలాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తమిళనాడు రాష్ట్రము
ఎవరు: తమిళనాడు రాష్ట్రము
ఎక్కడ: తమిళనాడు
ఎప్పుడు : ఆగస్ట్ 16
మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ ప్రదాని పదవికి రాజీనామా :
మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ ఆగస్ట్ 16 న రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో రెండో పెద్ద పార్టీగా ఉన్న యునైటెడ్ మలేసియన్ నేషనల్ పార్టీ (యూఎంఎన్వో) మద్దతు ఉపసంహరించడంతో మెజార్టీ కోల్పోయిన ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2020 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ముహిద్దీన్ మొత్తంగా 17 నెలలే ప్రధానిగా ఉన్నారు. ముహిద్దీన్, అతని కేబినెట్ రాజీనామాను రాజు సుల్తాన్ అబ్దుల్లా గారు ఆమోదించారు. తదుపరి ప్రభుత్వంకొలువుతీరేవరకు ఆపద్ధర్మ ప్రధానిగా ముహిద్దీన్ ను నియమించారు. కాగా ప్రభుత్వ పతనంతో మలేసియాలో కరోలా కల్లోలం, ఆర్థిక మాంద్యంపై అనిశ్చితి నెలకొంది. దేశంలో ఏ కూటమికీ ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని స్థానాలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఎన్నికలు జరపలేమని, ప్రజలంతా సంయమనం పాటిస్తూ పరిపాలనకు సహకరించాలని రాజు విజ్ఞప్తి చేశారు. మలేసియాలో కరోనా నియంత్రణ చర్యలు పేలవంగా మారాయి. వైరస్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో మలేసియా ఒకటి. ఈ పరిస్థితులతో గత కొంతకాలంగా ముహిద్దీన్ ప్రభుత్వంపై ఇంటా బయటా ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో అంతర్గత పోరు మొదలై పతనమైంది
- మలేషియా దేశ రాజధాని : కౌలాలంపూర్
- మలేసియ కరెన్సీ :రింగ్సిట్
- మలేసియ దేశ ప్రధాని : ముహిద్దీన్ యాసిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ ప్రదాని పదవికి రాజీనామా
ఎవరు: ప్రధాని ముహిద్దీన్
ఎక్కడ: మలేసియా
ఎప్పుడు : ఆగస్ట్ 16
జర్మన్ ఫుట్‌బాల్ లెజెండ్ గెర్డ్ ముల్లర్ కన్నుమూత :
జర్మన్ ఫుట్‌బాల్ లెజెండ్ గెర్డ్ ముల్లర్ కన్నుమూశారు మాజీ పశ్చిమ జర్మనీ ఫార్వర్డ్ మరియు బేయర్న్ మ్యూనిచ్ ఫుట్‌బాల్ లెజెండ్, గెర్డ్ ముల్లర్ కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో, అతను పశ్చిమ జర్మనీ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు, 62 ప్రదర్శనలలో 68 గోల్స్ చేశాడు, మరియు క్లబ్ స్థాయిలో, అతను బేయర్న్ మ్యూనిచ్ జట్టు కొరకు ఆడాడు, దానితో అతను 427 బుండెస్లిగా ఆటలలో 365 గోల్స్ సాధించాడు. అతని స్కోరింగ్ ప్రతిభ కు గాను అతనికి “బాంబర్ దేర్ నేషన్” (“దేశం యొక్క బాంబర్”) లేదా “డెర్ బాంబర్” గా అని పేరు పెట్టారు
క్విక్ రివ్యు :
ఏమిటి: జర్మన్ ఫుట్‌బాల్ లెజెండ్ గెర్డ్ ముల్లర్ కన్నుమూత
ఎవరు: గెర్డ్ ముల్లర్
ఎప్పుడు : ఆగస్ట్ 16
ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్ లో స్వర్ణ పతకం సాధించిన దీరజ్ :
ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ సత్తా చాటాడు. రికర్వ్ జూనియర్ బాలుర టీమ్ విభాగంలో అతడు పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ధీరజ్, ఆదిత్య చౌదరి, పార్ద్ సాలుంక లతో కూడిన భారత బృందం 5-3తో స్పెయిన్ (సాంజెస్, సొలెరా,సొంటోస్)లపై విజయం సాధించింది. ధీరజ్. విజయవాడకు చెందిన వోల్గా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రికర్వ్ పురుషుల టీమ్, అండర్-18 మిక్స్డ్ జట్టు, జూనియర్ మహిళలు, జూనియర్ మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కూడా స్వర్ణ పతకాలు మన సొంతమయ్యాయి. బిశాల్ తంగ్ మయ్ ఒక్కడే రెండు స్వర్ణాలతో మూడు పతకాలు సాధించడం విశేషం. అండర్-18 పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చంగ్మయ్. చిక్కీ రుహాల్, అమిత్ కుమార్ తో కూడిన భారత బృందం 4-2తో ఫ్రాన్స్ ను ఓడించి స్వర్ణ పతకం గెలవగా మిక్స్డ్ విభాగం తుది సమరంలో బిశాల్-తమన్నా జోడీ. 4-2తో యెహటా-మివా (జపాన్)ను ఓడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించిన దీరజ్
ఎవరు: దీరజ్
ఎప్పుడు : ఆగస్ట్ 16
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |